Ramya Krishnan: ఆ డైరెక్టర్ బలవంతం చేశాడు... రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్
తనను డైరెక్టర్ బలవంతం చేసి ఒక సీన్ చేయించాడు అంటూ రమ్యకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి తెరమీదకు వచ్చాయి. వాస్తవానికి అది ఇప్పటి సినిమా కాదు... కానీ ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి. అసలు రమ్యకృష్ణ ఎవరి గురించి మాట్లాడింది? ఏ సినిమా గురించి ఈ వ్యాఖ్యలు చేసింది? అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
టాలీవుడ్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడంటే అత్త పాత్రలకు, తల్లి పాత్రలకు పరిమితమైంది. కానీ ఒకప్పుడు టాలీవుడ్ సహా తమిళ శని పరిశ్రమలు కూడా అవి ఏలేసింది. అయితే తాను నటించిన నరసింహ సినిమా గురించి ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నిజానికి నరసింహ సినిమాలో ఆమె సౌందర్య నటించిన పాత్రలో నటించాలని అనుకుందట. కానీ ఆ పాత్ర కంటే నీలాంబరి పాత్రలో నటిస్తేనే మీకు మంచి పేరు వస్తుందని చెప్పి బలవంతంగా తనను ఆ పాత్రలో నటింప చేశారని రమ్యకృష్ణ చెప్పుకొచ్చింది. అంతేగాక ఆ సినిమాలో సౌందర్య మొకాన్ని తన కాలితో తన్నే ఒక సీను ఉంటుందని అయితే ఆ సీన్ చేయమని అడిగినప్పుడు ససేమిరా తాను చేయను అన్నారట.

కానీ తనను బలవంతం చేసి సీన్ చేయించారని... అలా చేసిన తర్వాత ఎన్ని సార్లు సౌందర్యకు సారీ చెప్పానో లెక్క లేదని ఆమె చెప్పుకొచ్చారు. ఇప్పటికీ నరసింహ సినిమా అంటే తనకు అదే విషయం గుర్తుకొచ్చి బాధ అనిపిస్తుందని తాను దర్శకుడి బలవంతం మేరకు అలా చేయాల్సి వచ్చిందని ఆమె బాధ పడుతుంది.

అయితే నరసింహ సినిమాలో రజనీకాంత్ కి ఢీ అంటే ఢీ అనే పాత్రలో నటించి ఒక్కసారిగా ఆమె మంచి పేరు సంపాదించింది. ఇక ఆ తర్వాత కూడా రమ్యకృష్ణ అలాంటి పాత్రలలో నటించింది. నెగిటివ్ పాత్రలతో పాటు హీరోయిన్ పాత్రలలో కూడా కనిపించి ఆమె మంచి పేరు సంపాదించింది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మధ్య విడుదలైన జైలర్ సినిమాలో ఆమె రజినీకాంత్ భార్య పాత్రలో నటించి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చింది. ఏకంగా ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లోనే నరసింహ తర్వాత ఇన్నేళ్లకు రజనీకాంత్ కి నీలాంబరి దగ్గర అయిందనే విధంగా కామెంట్లు చేశారంటే వారిద్దరి కాంబినేషన్ ఎంత పెద్ద సూపర్ హిట్ అయిందో చెప్పకనే చెప్పినట్లయింది. ఇక ప్రస్తుతానికి రమ్యకృష్ణ వరుస సినిమాలతో కూడా దూసుకుపోతున్నారు. రజినీకాంత్ లాగా వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ అటు తెలుగు అభిమానులతో పాటు తమిళ అభిమానులను కూడా అలరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











