53 ఏళ్ల ఏజ్‌లో రమ్యకృష్ణ గ్లామర్ షో: అస్సలు గుర్తు పట్టనంత ఘాటుగా!

టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోయిన్లు స్టార్‌డమ్‌తో సత్తా చాటారు. అయితే, కొందరు మాత్రం తరాలు మారుతున్నా ప్రభావాన్ని కోల్పోకుండా దూసుకుపోతోన్నారు. అందులో డైనమిక్ లేడీ రమ్యకృష్ణ ఒకరు. దాదాపు నాలుగు దశాబ్ధాలుగా తనదైన చిత్రాలతో సందడి చేస్తోన్న ఈమె.. ఇప్పటికి కూడా అదిరిపోయే పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇలా పాన్ ఇండియా రేంజ్‌లో హవాను చూపిస్తున్నారు. అదే సయమంలో సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటోన్నారు. ఈ క్రమంలోనే తాజాగా రమ్యకృష్ణ వదిలిన కొన్ని ఘాటు ఫొటోలను మీరే చూడండి!

అప్పట్లోనే పాన్ ఇండియా
రమ్యకృష్ణ 'వెళ్ళై మనసు' అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 'భలే మిత్రులు' మూవీతో తెలుగులోకి వచ్చారు. అప్పటి నుంచి దాదాపు 300లకు పైగా సినిమాల్లో నటించి హవాను చూపించారు. ఈ క్రమంలోనే సౌత్‌తో పాటు నార్త్‌లోనూ వరుసగా సినిమాల్లో నటించారు. తద్వారా నేషనల్ రేంజ్‌లో క్రేజ్‌ను సొంతం చేసుకుని సత్తా చాటారు.

Senior Heroine Ramya Krishnan Stunning Looking Photos Viral

బాహుబలి నుంచి స్పీడ్‌గా
సుదీర్ఘ కాలంగా చాలా భాషల్లో హీరోయిన్‌గా సినిమాలు చేస్తూ వచ్చిన రమ్యకృష్ణ.. చాలా భాషల్లోని స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఫలితంగా మూడు దశాబ్దాలుగా తన మార్కును చూపించారు. ఇక, 'బాహుబలి'లో శివగామి దేవిగా మరోసారి ఆమె దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయ్యారు. అప్పటి నుంచి రమ్య పాన్ ఇండియా చిత్రాల్లో భాగం అవుతూ హవాను చూపిస్తున్నారు.

హిట్లు ఫ్లాపులతో సాగుతూ
ఈ మధ్య పాన్ ఇండియా చిత్రాలను చేస్తోన్న రమ్యకృష్ణ.. 'లైగర్' అనే సినిమాతో వచ్చారు. కానీ, ఈ చిత్రం డిజాస్టర్ అయింది. అలాగే, ఈ మధ్యనే 'రంగమార్తాండ' అనే సినిమానూ చేశారు. కానీ, ఇది కూడా కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. అయితే, రజినీకాంత్‌తో కలిసి రమ్యకృష్ణ 'జైలర్' మూవీ చేసి బ్లాక్ బస్టర్ కొట్టారు. ఈ ఏడాది 'గుంటూరు కారం' మూవీతోనూ అలరించారు.

Senior Heroine Ramya Krishnan Stunning Looking Photos Viral

ఏదో ఒక భాషలో చేస్తూనే
నాలుగు దశాబ్దాలకు పైగానే ఏకధాటిగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్న రమ్యకృష్ణ.. మధ్యలో కొన్ని షోలలోనూ కనిపిస్తున్నారు. ఇలా ఆ మధ్య ఆహాలో స్ట్రీమింగ్ అయిన 'డ్యాన్స్ ఐకాన్' అనే షోకు జడ్జ్‌గానూ వ్యవహరించారు. ఇందులో ఆమె తనదైన రీతిలో ఆకట్టుకున్నారు. ఇక, ఇప్పుడు రమ్యకృష్ణ తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లోనూ నటిస్తూనే ఉన్నారు.

అక్కడ యమా యాక్టివ్‌గా
హీరోయిన్‌గా, సహాయ నటిగా వరుసగా సినిమాల మీద సినిమాలు చేసి.. ఈ మధ్య కాలంలో కొంత వేగం తగ్గించిన సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటారు. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తుంటారు. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటున్నారు.

Senior Heroine Ramya Krishnan Stunning Looking Photos Viral

ఈ ఏజ్‌లోనూ గ్లామర్ షో
సోషల్ మీడియాలో సీనియర్ హీరోయిన్లు పెద్దగా సందడి చేయడం లేదు. కానీ, రమ్యకృష్ణ మాత్రం ఓ రేంజ్‌లో హల్చల్ చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే తన ఫొటోలు, వీడియోలు నిత్యం షేర్ చేస్తున్నారు. వీటిలో అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ దిగినవి కూడా ఉంటున్నాయి. ముఖ్యంగా క్లీవేజ్ షో చేసే పిక్స్‌ను ఎక్కువగా షేర్ చేస్తూ రమ్యకృష్ణ ట్రెండింగ్‌లో ఉంటున్నారు.

రమ్యకృష్ణ పిక్స్ వైరల్‌
సోషల్ మీడియాలో ఈ మధ్యన యమ హల్చల్ చేస్తోన్న రమ్యకృష్ణ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను వదిలారు. వీటిలో ఆమె స్లీవ్‌లెస్ అండ్ డీప్‌నెక్ డిజైన్ టాప్‌లో గ్లామర్ షో చేస్తూ ఫోజులు ఇచ్చారు. ఫలితంగా ఆమె అందాలు తెగ హైలైట్ అవుతున్నాయి. దీంతో ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. తద్వారా ఇవి వైరల్‌ అయిపోతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X