హీరోయిన్ సదా ప్రేమ పెళ్లి.. అతడితో ఏడు అడుగులు నడిచేది ఎప్పుడంటే!
తెలుగు సినీ ఇండస్ట్రీ ద్వారా హీరోయిన్‌గా పరిచయమై.. దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకున్న అమ్మాయిలు చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో క్యూట్ లేడీ సదా ఒకరు. సుదీర్ఘ కాలంగా తనదైన అందం, అభినయంతో రాణిస్తోన్న ఈ చిన్నది.. ఇప్పటికీ అవకాశాలను అందుకుంటూ ముందుకు సాగుతోంది.
ఇలా ఇప్పుడు ఎన్నో షోలు, సినిమాలు చేసుకుంటూ ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో హీరోయిన్ సదా పెళ్లిపై పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె దీనిపై స్పందించింది. ఆ వివరాలు మీకోసమే!

టాలీవుడ్‌లో స్టార్ స్టేటస్
సదా మొట్టమొదటిగా తెలుగులోనే 'జయం' అనే సినిమా చేసింది. ఇందులో నటన పరంగా, అందం పరంగా మెప్పించిన ఈ చిన్నది మంచి గుర్తింపు అందుకుంది. అంతే.. ఇక టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లను దక్కించుకుని సత్తా చాటింది. ఇలా టాలీవుడ్‌లోని స్టార్ హీరోల సరసన కూడా నటించింది. ఇలా ఎన్నో సినిమాలు చేసి సదా టాలీవుడ్‌లో స్టార్ స్టేటస్‌ను అందుకుంది.

ఆ భాషల్లోనూ వరుసగా
స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న తర్వాత హీరోయిన్ సదా.. 'జయం' రీమేక్‌తో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. అనంతరం 'మోనాలిసా' అనే చిత్రంతో కన్నడ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చేసింది. అలాగే, 'నోవెల్' అనే మూవీతో మలయాళంలోకి అడుగు పెట్టింది. ఇలా సదా సౌత్ ఇండియా మొత్తంలో తనదైన మార్కును చూపించింది.

ఇప్పుడు అలాంటివేగా
చాలా కాలం పాటు ఏకధాటిగా సినిమాలు చేసినా.. ఈ మధ్య కాలంలో హీరోయిన్‌గా పెద్దగా అవకాశాలను అందుకోవడంలో సదా విఫలం అవుతోంది. ఈ మధ్యన 'అహింస', 'ఆదికేశవ' మూవీలు చేసింది. అలాగే ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్‌లు, షోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది. ఈ క్రమంలోనే 'Hello World' సహా పలు వెబ్ సిరీస్‌లనూ చేస్తోంది.
బుల్లితెరపై సందడిగా
గతంలో మాదిరిగా సినిమాల్లో ఆశించిన రీతిలో సందడి చేయకున్నా.. బుల్లితెరపై మాత్రం సదా ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఆ మధ్య 'ఢీ' షోలో మెరిసిన ఈ బ్యూటీ.. ఇటీవలే స్టార్ మాలో ప్రసారం అయిన 'బీబీ జోడీ' షోకు జడ్జ్‌గా వ్యవహరించింది. ఈ క్రమంలోనే అదే ఛానెల్‌లో వస్తోన్న 'నీతోనే డ్యాన్స్ సీజన్ 2' అనే షోలోనూ హల్చల్ చేస్తోంది.

పెళ్లి పుకార్లపై స్పందన
హీరోయిన్ సదా కొంత కాలంగా కెరీర్ పరంగా సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే ఆమె పెళ్లి గురించి కూడా ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన పెళ్లి గురించి ప్రస్తావించింది. ఈ సందర్భంగా తన జీవితంలో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఇప్పట్లో లేదు అని ఈ క్యూట్ హీరోయిన్ తేల్చి చెప్పేసింది.

ప్రేమ పెళ్లి అంటూనే
తాజా ఇంటర్వ్యూలో సదా 'ప్రస్తుతం నేను సింగిల్‌గా ఎంతో స్వేచ్చగా ఉన్నాను. ఈ ఫ్రీడమ్ పోతుందనే పెళ్లి చేసుకోలేదు. దీనికితోడు నచ్చిన వ్యక్తి దొరకకపోవడంతో ఇంట్రెస్ట్ రాలేదు. నాకు అరైంజ్‌డ్ మ్యారేజ్ ఇష్టం లేదు. ఎప్పటికైనా నేను ప్రేమ పెళ్లినే చేసుకుంటాను. మనసుకు నచ్చిన వ్యక్తి వచ్చిన తర్వాతనే ఏడు అడుగులు నడుస్తాను' అంటూ స్పష్టం చేసేసింది.


Click it and Unblock the Notifications











