Don't Miss!
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ దర్శకుడు లిప్ లాక్ ఇచ్చే వరకు వదల్లేదు.. ఎన్టీఆర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
సినిమా ఇండస్ట్రీలో గత రెండేళ్లుగా మీటూ ఆరోపణలు ఏ రేంజ్ లో వస్తున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సీనియర్ హీరోయిన్స్ కూడా వారికి ఎదురైన ఎన్నో చేదు అనుభవాలను గురించి డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. ఇక ఇటీవల ఒక్కప్పటి హాట్ బ్యూటీ సమీరా రెడ్డి షూటింగ్ లో ఎదురైన గోడవ గురించి బయటపెట్టింది. లిప్ లాక్ ఇవ్వాల్సిందే అంటూ దర్శకుడు చాలా ఇబ్బంది పెట్టినట్లు తెలుపడం నేషనల్ మీడియాలో వైరల్ గా మారింది.
బాలీవుడ్ అవకాశాల కోసం..
ఆ బ్యూటీ మరెవరో కాదు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన అశోక్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమీరా రెడ్డి. పక్కా తెలుగమ్మాయే అయినప్పటికీ మోడలింగ్ కోసం ముంబై నగరాలకు వెళ్లిన ఈ బ్యూటీ బాలీవుడ్ లో కూడా పలు అవకాశాలను అందుకునేందుకు ప్రయత్నాలు చేసింది.
అక్కడ కూడా ఫెయిల్యూర్స్ రావడంతో
తెలుగులో అశోక్ తరువాత జై చిరంజీవి అనే సినిమాలో నటించిన సమీరా ఎన్టీఆర్ తో రెండవసారి నరసింహుడు అనే సినిమా చేసింది. కానీ ఆ సినిమాలు అమ్మడికి పెద్దగా సక్సెస్ ని ఇవ్వలేకపోయాయి. ఇక కొన్నాళ్లపాటు బాలీవుడ్ లో కొనసాగినప్పటికి అక్కడ కూడా ఫెయిల్యూర్స్ రావడంతో స్టార్ హీరోయిన్ గా సక్సెస్ కాలేదు.
లిప్ లాక్ కోసం గొడవకు దిగాడు
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సమీరా రెడ్డి ఒక సినిమా షూటింగ్ లో దర్శకుడు చేసిన ఒక గొడవ గురించి బయటపెట్టింది. మొదట స్క్రిప్ట్ చెప్పినప్పుడు లిప్ లాక్ గురించి ఏ మాత్రం చెప్పలేదు. గాని సడన్ గా ఒక సీన్ కోసం హీరోకు లిప్ లాక్ ఇవ్వాల్సిందే అంటూ దర్శకుడు ఫోర్స్ చేశాడు. నేను చేయనని చెబితే గొడవకు దిగాడు.
Recommended Video
అలా చేసేవరకు ఒప్పుకోలేదు
ఎంత అభ్యంతరం చెప్పినా కూడా ఆ దర్శకుడు వినలేదు. బెదిరించడానికి ట్రై చేశాడు. సినిమా నుంచి తప్పించడానికి కూడా సిద్ధమేనని వార్నింగ్ ఇచ్చాడు. అంతకుముందు చేసిన మూసాఫిర్ సినిమాలో లిప్ లాక్ ఇచ్చావ్ కాదా ఇందులో ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటని అన్నాడు. ఇక చివరకు ఆ కిస్ సీన్ లో నటించేవరకు ఒప్పుకోలేదని సమీరా రెడ్డి వివరణ ఇచ్చింది. అయితే ఆ దర్శకుడు ఎవరనేది మాత్రం ఈ బ్యూటీ బయటపెట్టలేదు.