అయ్యో.. 7/G హీరోయిన్ లైఫ్ ఇలా అయ్యిందేంటి.. అప్పటి నుంచి కష్టాల్లోనే..
కొంతమంది హీరోయిన్స్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎలా ఉంటారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అవకాశాలను బట్టి గ్లామర్ లో మార్పులు తెస్తుంటారు. ఇక కెరీర్ ని సీరియస్ గా తీసుకునేవారి స్టైల్ మరోలా ఉంటుంది. సోనియా అగర్వాల్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఒకే ఒక్క సినిమాతో కెరీర్ కి సరిపడేంత క్రేజ్ అయితే అందుకుంది గాని అనుకున్నంత రేంజ్ లో అయితే హీరోయిన్ గా అవకాశాలు అందుకోలేకపోయింది.

బిగ్గెస్ట్ సక్సెస్ అదే..
సెల్వరాఘవన్ దర్శకత్వంలో వచ్చిన 7/G బృందావన కాలనీ సినిమా ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తమిళ్ లో కూడా బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన ఆ సినిమాతోనే రవి కృష్ణ హీరోగా పరిచయం అయ్యాడు. ఇక హీరోయిన్ గా సోనియాకు బిగ్గెస్ట్ సక్సెస్ అదే. ఆ సినిమాలో వారి నటన అద్బుతమనే చెప్పాలి. అప్పట్లో యువతకు ఆ సినిమా గండే లోతుల్లోకి వెళ్లిపోయింది.

దర్శకుడినే పెళ్లి చేసుకొని...
7/G సినిమాకు మరొక హీరోయిన్ సెట్టవ్వదు అనే విధంగా నటించిన సోనియా ఆ సినిమా తరువాత సౌత్ లో అగ్ర దర్శక నిర్మాతలను ఆకర్షించింది. ఇక హిట్టిచ్చిన డైరెక్టర్ సెల్వ రాఘవన్ ని ఆమె పెళ్లాడింది. ఏమైందో ఏమో కాని నాలుగేళ్లకే మళ్ళీ విడిపోయారు. పెళ్లి వలన సినిమా ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చిన సోనియా మళ్ళీ 2011లో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సరికొత్త ఎంట్రీ ఇచ్చింది.

సెకండ్ ఇన్నింగ్స్ లో ఫెయిల్
హీరోయిన్ గా మంచి భవిష్యత్తు ఉన్న సమయంలో ఆమె గ్యాప్ ఇవ్వడం కాస్త దెబ్బ పడిందనే కథనాలు చాలానే వచ్చాయి. సెకండ్ ఇన్నింగ్స్ లో అయితే సోనియా మెయిన్ హీరోయిన్ గా అవకాశం అందుకోలేకపోయింది. ఎదో అలా అలా నెట్టుకొస్తోంది. విడాకుల తరువాత ఆమె మరో పెళ్లి కూడా చేసుకోలేదు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనే ట్యాగ్ అందుకుంది.
Recommended Video

ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందట
ఫైనల్ గా తనలోని గ్లామర్ తగ్గలేదని నిరూపించుకోవాలని సోనియా ప్లాన్ గట్టిగానే వేసినట్లు అర్థమవుతోంది. ఇటీవల అమ్మడు మొహానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందట. పూర్తిగా స్టైల్ ని మార్చాలని ప్లాన్ బాగానే వేసింది కానీ అంతగా వర్కౌట్ అవ్వడం లేదనే కామెంట్స్ కూడా ఎక్కువవుతున్నాయి. 38ఏళ్ల సోనియా ఇప్పుడు ఈ ప్రయోగాలు ఎందుకు అని ఓ వర్గం కోలీవుడ్ ఆడియెన్స్ ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. మరి సోనియా ముందుముందు ఎలాంటి షాకుల ఇస్తుందో చూడాలి


Click it and Unblock the Notifications











