టబుకు సోషల్ మీడియాలో చేదు అనుభవం: ఆ లింకుల గురించి హెచ్చరిస్తూ హీరోయిన్ ఆవేదన!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చారు. వారిలో కొందరు మాత్రమే విపరీతమైన క్రేజ్‌ను అందుకున్నారు. అలాంటి వారిలో గ్లామరస్ హీరోయిన్ టబు ఒకరు. 'కూలీ నెం 1' సినిమాతో టాలీవుడ్‌లోకి ప్రవేశించిన ఆమె.. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించింది. కెరీర్ ఆరంభంలోనే పలు హిట్లను తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇక, ఇటీవల సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టబు.. అన్ని రకాల జోనర్లు, పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెకు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. అసలేం జరిగింది? వివరాల్లోకి వెళితే...

వెంకటేష్‌తో మొదలు.. వాళ్లందరితోనూ

వెంకటేష్‌తో మొదలు.. వాళ్లందరితోనూ


'కూలీ నెం 1'తో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన టబు.. ఆ తర్వాత టాప్ హీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో నటించింది. దీంతో ఆమె అప్పట్లోనే భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్‌గా నిలిచింది. తెలుగు సినిమాల్లో అప్పుడప్పుడు మాత్రమే కనిపించిన టబు.. హిందీలో మాత్రం క్రమం తప్పకుండా సినిమాలు చేసుకుంటూ వస్తోంది.

టాలీవుడ్‌లోకి రీఎంట్రీ.. తల్లిగా వచ్చింది

టాలీవుడ్‌లోకి రీఎంట్రీ.. తల్లిగా వచ్చింది

తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన టబు.. లాంగ్ గ్యాప్ తర్వాత మరోసారి కొన్ని చిత్రాలను చేసింది. కానీ, నందమూరి బాలకృష్ణ నటించిన 'పాండురంగడు' సినిమా తర్వాత ఆమె మరోసారి టాలీవుడ్‌లో కనిపించలేదు. అయితే, త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన 'అల.. వైకుంఠపురములో'తో ఆమె రీఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆమె హీరోకు తల్లిగా నటించారు.

ఆ సినిమాతో గుర్తింపు... ఫుల్ బిజీగా

ఆ సినిమాతో గుర్తింపు... ఫుల్ బిజీగా

మొదటి నుంచీ హిందీ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన హీరోయిన్ టబు.. కొద్ది రోజుల క్రితం అక్కడ కూడా రీఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఎన్నో హిట్లను అందుకుంది. ఆ మధ్య 'అంధాధున్' రూపంలో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సక్సెస్ పుణ్యమా అని సెకండ్ ఇన్నింగ్స్‌ను జోరుగా సాగిస్తోన్న ఈ సీనియర్ నటి అన్ని భాషల్లో బిజీ అయిపోయింది.

ఈ వయసులో యంగ్ హీరోతో రొమాన్స్

ఈ వయసులో యంగ్ హీరోతో రొమాన్స్

ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన టబు.. ప్రస్తుతం బాగా డిమాండ్ ఉన్న డిజిటల్ మీడియాలోకి కూడా ప్రవేశించేసింది. ఇందులో భాగంగా ఈ సీనియర్ హీరోయిన్ అడల్ట్ కంటెంట్ ఉన్న 'ఏ సూటబుల్ బాయ్'లో నటించింది. ఇందుకోసం లేటు వయసులో యంగ్ హీరో ఇషాన్ ఖట్టర్‌తో రొమాన్స్ చేసింది. గతంలో 'కామసూత్ర'ను తెరకెక్కించిన మీరా నాయర్ దీనికి డైరెక్టర్.

హీరోయిన్‌ టబుకు భారీ షాకిచ్చారుగా

హీరోయిన్‌ టబుకు భారీ షాకిచ్చారుగా


టబు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆమె తరచూ ఏదో ఒక ఫొటోలు పెడుతూనే ఉంటారు. అంతేకాదు, తన వ్యక్తిగత, కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను రకరకాల పోస్టుల ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ హీరోయిన్ టబు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ హ్యాక్ అయింది.

ఆ లింకుల గురించి హెచ్చరిస్తూ ఆవేదన

ఆ లింకుల గురించి హెచ్చరిస్తూ ఆవేదన


తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిన విషయాన్ని టబు స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో 'హ్యాక్‌ అలర్ట్‌... నా అకౌంట్‌ హ్యాకింగ్‌కు గురైంది. నా అకౌంట్‌ను నుంచి వచ్చే ఎలాంటి లింక్‌లను క్లిక్‌ చేయకండి' అంటూ ఆమె పోస్టు పెట్టింది. ఇదిలా ఉండగా, ఇటీవల పలువురు సినీ ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్‌కు గురైన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X