Tabu: 52 ఏళ్ల ఏజ్‌లో టబు అరాచకం.. 25 ఏళ్ల అమ్మాయిలా గ్లామర్ షో
తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాల సంఖ్యతో సంబంధం లేకుండా చాలా తక్కువ మంది భామలు మాత్రమే సెన్సేషన్ అయిపోయారు. అలాంటి వారిలో సీనియర్ బ్యూటీ టబు ఒకరు. ఎన్నో ఏళ్ల క్రితమే టాలీవుడ్‌లో హవాను చూపించిన ఈమె.. తక్కువ సినిమాలతోనే ఎక్కువ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఇక, ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌కే పరిమితమై వరుస చిత్రాలతో తెగ హడావిడి చేస్తోంది. అదే సమయంలో టబు సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ సీనియర్ హీరోయిన్ ఓ బోల్డు పిక్ వదిలింది. దాన్ని మీరే చూడండి!
అలా మొదలు.. స్టార్లతోనే : హైదరాబాద్‌కు చెందిన టబు బాలీవుడ్‌లో బాలనటిగా ఎన్నో సినిమాల్లో నటించింది. కొన్నేళ్ల తర్వాత అక్కడే హీరోయిన్‌గా పరిచయం అయింది. అలా పలు సినిమాలు చేసిన తర్వాత ఈ భామ 'కూలీ నెం 1' మూవీతో టాలీవుడ్‌లోకి వచ్చింది. ఆ తర్వాత చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో నటించింది. ఇలా కొన్ని సినిమాలకే తెలుగులో సెన్సేషన్ అయింది.

తెలుగులో తళుక్కుమని : తెలుగులో కొన్ని చిత్రాలకే పరిమితం అయిన టబు.. అప్పుడప్పుడూ పలు సినిమాల్లో కనిపించి తళుక్కున మెరిసింది. కానీ, బాలకృష్ణ నటించిన 'పాండురంగడు' సినిమా తర్వాత ఆమె మరోసారి టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చేసింది. ఇక, త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన 'అల.. వైకుంఠపురములో'తో ఆమె రీఎంట్రీ ఇచ్చి సెటిల్డ్ యాక్టింగ్‌తో ఆకట్టుకుంది.
అలాంటి సినిమాలతోనే : టబు కెరీర్ ప్రారంభం నుంచీ హిందీ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. ఇలా తన జర్నీలో ఎన్నో హిట్లను అందుకుంది. ముఖ్యంగా 'అంధాధున్' రూపంలో భారీ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. తర్వాత అడల్ట్ కంటెంట్ ఉన్న 'ఏ సూటబుల్ బాయ్'లో నటించడంతో సంచలనం అయింది. అప్పటి నుంచి టబుకు బాలీవుడ్‌లో ఆఫర్లు భారీ స్థాయిలో వస్తున్నాయి.

ఇప్పుడా చిత్రాలతో బిజీ : 50 ఏళ్లు దాటిపోయినా టబు మాత్రం గతంలో కంటే వేగంగా సినిమాలు చేస్తోంది. ఇలా గత ఏడాది 'దృశ్యం 2'తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అలాగే, 'భూల్ భులయా'లోనూ నటించింది. ఇక, ఈ ఏడాది అప్పుడే 'కుత్తే', 'భోళా' మూవీలతో వచ్చింది. ఇక, ఇప్పుడు 'ఖుఫియా', Auron Mein Kahan Dum Tha, The Crew వంటి వాటిని చేస్తోంది.
అక్కడ మాత్రం యాక్టివ్ : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచీ టబు అందులో యమ యాక్టివ్‌గా ఉంటోందన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆమె తరచూ ఏదో ఒక ఫొటోలు పెడుతూనే ఉంటోంది. అంతేకాదు, తన వ్యక్తిగత, కెరీర్‌కు సంబంధించిన విషయాలను రకరకాల పోస్టుల ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తద్వారా ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉంది.

గ్లామర్ ట్రీట్‌తో కవ్విస్తూ : చాలా ఏళ్ల నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న సీనియర్ హీరోయిన్ టబు.. అప్పుడప్పుడూ గ్లామర్ షో కూడా చేస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే 50 ఏళ్ల వయసు దాటినా తన అందాలను ఆరబోస్తూ కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. తద్వారా టబు కుర్ర హీరోయిన్లనే వెనక్కి నెట్టేస్తుంది.
టబు హాట్ పిక్ వైరల్‌గా : ఓ వైపు సినిమాల్లో బోల్డు షోతో రెచ్చిపోతోన్న హీరోయిన్ టబు.. సోషల్ మీడియాలోనూ ఈ మధ్య రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తాజాగా షర్ట్ బటన్స్ విప్పేసి క్లీవేజ్ షో చేస్తోన్న ఓ పిక్‌ను షేర్ చేసింది. దీంతో ఆమె అందాలు నెటిజన్లను కొసరి కొసరి రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా టబు షేర్ చేసిన ఈ ఫొటోకు భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. తద్వారా ఇది వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications











