తెలుగులో జోరు పెంచిన టబు.. రానా చిత్రంలో కీలక పాత్ర!

విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ రానా దూసుకుపోతున్నాడు. బాహుబలి, ఘాజి, నేనే రాజు నేనే మంత్రి లాంటి చిత్రాలలో నటిస్తూ అభిమానులకు ఎప్పటికి గుర్తుండిపోయే పాత్రలు అందిస్తున్నాడు. గత కొంతకాలంగా రానా వేణు ఊడుగుల దర్శకత్వంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి విరాటపర్వం 1992 అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నారు. నేనే రాజు నేనే మంత్రి చిత్రం తర్వాత రాజా నటించిన పూర్తి స్థాయి చిత్రం ప్రేక్షకుల ముందుకు రాలేదు.

ఎన్టీఆర్ బయోపిక్, ఇతర చిత్రాల్లో కొన్ని పాత్రలో నటించాడు. తాజాగా రానా కొత్త చిత్రానికి సంబంధించిన పనులు జోరందుకునట్లు తెలుస్తోంది.విరాటపర్వం 1992 చిత్రం కోసం దర్శకుడు వేణు నటీనటుల ఎంపిక ప్రారంభించినట్లు తెలుస్తోంది. సీనియర్ హీరోయిన్ టబు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే టబు త్రివిక్రమ్, అల్లు అర్జున్ చిత్రంతో టాలీవుడ్ కి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

Senior heroine Tabu to play key role in Rana Daggubatis Virataparvam movie

విరాటపర్వం చిత్రంలో టబు మానవహక్కుల కోసం పోరాడే మహిళగా నటించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నిన్నే పెళ్లాడతా, కూలి నెం 1, చెన్నకేశవరెడ్డి లాంటి తెలుగు చిత్రాల్లో టబు నటించింది. తాను నటించిన అన్ని భాషల్లో టబు మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X