బన్నీ, త్రివిక్రమ్ చిత్రంలో టబు.. పాత్ర ఏంటో తెలుసా!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్, రాధాకృష సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జనవరిలోనే ఈ చిత్రానికి ప్రకటన జరిగింది. కానీ ఇంతవరకు సెట్స్ పైకి వెళ్లలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంకా కథపై కసరత్తు చేస్తూనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మధ్యన ఈ చిత్రంలో అలనాటి అందాల తార నగ్మ నటించనున్నట్లు వార్తలు వచ్చాయి.

తల్లి పాత్ర కావడంతో నగ్మ అంగీకరించలేదని ప్రచారం జరిగింది. ఇప్పుడు మరో సీనియర్ హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. నిన్నే పెళ్లాడతా, పాండురంగడు లాంటి చిత్రాల్లో నటించ టబు త్రివిక్రమ్, బన్నీ చిత్రంలో నటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బన్నీకి తల్లిగా టబు నటించాల్సి ఉంటుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ టబుతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

 Senior heroine Tabu playing as Allu Arjuns mother in Trivikram movie

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అల్లు అరవింద్, రాధాకృష్ణ కలసి నిర్మించబోయే ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి 'నాన్న.. నేను' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నా పేరు సూర్య చిత్రం నిరాశపరచడంతో ఎలాగైనా ఓ హిట్ చిత్రాన్ని ఫ్యాన్స్ కు అందించాలని అల్లు అల్లు అర్జున్ పట్టుదలతో ఉన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X