Don't Miss!
- Sports DC vs RR: కొంపముంచిన మోహిత్ శర్మ.. రిషభ్ పంత్ విధ్వంసం!
- News కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
యువహీరోతో టబు రొమాన్స్.. లీకైన ఫొటో చూసి ఫ్యాన్స్ షాక్
'కూలీ నెం 1'తో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించింది గ్లామరస్ హీరోయిన్ టబు. ఈ క్రమంలోనే చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో నటించింది. దీంతో ఆమె అప్పట్లోనే భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్గా నిలిచింది. తెలుగు సినిమాల్లో అప్పుడప్పుడు మాత్రమే కనిపించిన టబు.. హిందీలో మాత్రం క్రమం తప్పకుండా సినిమాలు చేసుకుంటూ వస్తోంది. అక్కడ కూడా అగ్ర కథానాయకులతో నటించి, మెప్పించింది. కానీ, మధ్యలో కొన్ని ఫెయిల్యూర్స్ రావడంతో కొద్ది సంవత్సరాలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది. తాజాగా ఈ సీనియర్ హీరోయిన్ ఓ కుర్ర హీరోతో రొమాన్స్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఓ ఫొటో బటయకు రావడంతో అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఎవరా హీరో.? వివరాల్లోకి వెళ్తే..
Recommended Video
బాలకృష్ణదే చివరిది అనుకుంటే..
తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన టబు.. లాంగ్ గ్యాప్ తర్వాత మరోసారి కొన్ని చిత్రాలను చేసింది. కానీ, నందమూరి బాలకృష్ణ నటించిన ‘పాండురంగడు' సినిమా తర్వాత ఆమె మరోసారి టాలీవుడ్లో కనిపించలేదు. అయితే, ప్రస్తుతం త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న ‘అల.. వైకుంఠపురములో'తో ఆమె మరోసారి రీఎంట్రీ ఇస్తున్నారు.
అక్కడ కూడా అదిరిపోయే రీఎంట్రీ
మొదటి నుంచీ హిందీ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే టబు.. కొద్ది రోజుల క్రితం అక్కడ కూడా రీఎంట్రీ ఇచ్చింది. రీసెంట్గా ‘అంధాధున్' రూపంలో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా సక్సెస్ పుణ్యమా అని సెకండ్ ఇన్నింగ్స్‌ను జోరుగా సాగిస్తోన్న ఈ సీనియర్ నటి అన్ని భాషల్లో బిజీ అయిపోయింది.
|
లేటు వయసులో రొమాన్స్
ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన టబు.. ప్రస్తుతం బాగా డిమాండ్ ఉన్న డిజిటల్ మీడియాలోకి కూడా ప్రవేశించేసింది. ఇందులో భాగంగా ఈ సీనియర్ హీరోయిన్ అడల్ట్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇందుకోసం లేటు వయసులో రొమాన్స్ చేయడానికి పచ్చ జెండా ఊపేసింది. గతంలో ‘కామసూత్ర'ను తెరకెక్కించిన మీరా నాయర్ దీనికి డైరెక్టర్.
ఫొటో బయటకు రావడంతో..
టబు నటిస్తున్న వెబ్ సిరీస్ పేరు ‘ఏ సూటబుల్ బాయ్'. ఇందులో ఆమె మిడిల్ ఏజ్ మహిళగా కనిపిస్తుంది. ఆమెతో ప్రేమలో పడే అబ్బాయిగా ఇషాన్ ఖట్టర్ నటిస్తున్నాడు. వీళ్లిద్దరి మధ్య వచ్చే రొమాన్స్ సీన్స్‌తో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. తాజాగా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.