నువ్వు లేకపోతే చచ్చిపోతా అన్నాడు..పెళ్లి తరువాత రాత్రులు చిత్రవధ చేశాడు: నటి జయలలిత
సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయలలిత అప్పట్లో మంచి క్రేజ్ అందుకున్న వారిలో ఒకరు. ఆమె ఎక్కువగా గ్లామర్ డోస్ ఎక్కువగా ఉండే వాంప్ పాత్రలలోనే నటించేవారు. ఆ తర్వాత మెల్లగా తన ఇమేజ్ ను మార్చుకునే విధంగా మంచి రోల్స్ కూడా చేశారు.
ముఖ్యంగా భరత్ అనే నేను సినిమాలో కూడా ఆమె ఒక స్పీకర్ పాత్రలో కనిపించారు. ఇక ఈ మధ్య ఓరి దేవుడా, రంగ మార్తాండ వంటి సినిమాల్లో కూడా కనిపించారు. అయితే తన జీవితంలో కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కొన్న ఆమె ఒక ఇంటర్వ్యూలో ఆ విషయాల గురించి వివరణ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే...

అతనితో ప్రేమ: జయలలిత మాట్లాడుతూ.. అప్పట్లో నేను భాషతో సంబంధం లేకుండా తెలుగు తమిళ్ కన్నడ ఏ భాషలో ఛాన్స్ వచ్చినా కూడా సినిమాలు చేసుకుంటూ వెళ్లాను. అయితే చాలా బిజీగా ఉన్న టైమ్ లో ఫ్యామిలీ మొత్తం కూడా సెట్ అయింది అనుకున్న సమయంలో ప్రేమ వ్యవహారం నా జీవితాన్ని కొంత మార్చింది.
అతను మలయాళం డైరెక్టర్. అతని 25 చిత్రాల్లో నేను నటించడం జరిగింది. వాళ్ళ అమ్మానాన్న కూడా నిర్మాతలే. దాదాపు ఏడేళ్ల ప్రేమ. అప్పటినుంచి కూడా నేను ఆలోచిస్తున్నాను. పెళ్లి చేసుకుందామా వద్దా అని..
దొంగకోళ్లు పట్టే వాడిలా ఉన్నాడు: అంతకుముందే నేను చాలా మంది తెలుగు వాళ్లకు కూడా అతని పరిచయం చేయడం జరిగింది. అందరూ కూడా ఒకటే కామెంట్ చేశారు. దొంగకోళ్లు పట్టే వాడిలా ఉన్నాడు నిన్ను ఏం చూసుకుంటాడు. ఎందుకలా నిర్ణయం తీసుకున్నావు అని చాలామంది చెప్పారు. నేను అతని విషయంలో మొదట ఎవరి మాట వినలేదు. చలపతి రావు గారు, మేకప్ మ్యాన్, ప్రొడ్యూసర్ జయకృష్ణ గారు కూడా చాలా చెప్పారు.

చచ్చిపోతాను.. విషం తాగుతాను: అయినా కూడా వినలేదు. ఎందుకంటే అతను నువ్వు పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని విషం తాగుతాను అని అన్నాడు. అంతేకాకుండా రక్తంతో లెటర్స్ రాయడం వరకు వచ్చింది. నేను అదే నిజమైన ప్రేమ అనుకున్నాను. నేను కరిగిపోయి చాలా నిజాయితీగా ఉన్నాడు అనుకునే ఒక గుడిలో పెళ్లి చేసుకున్నాను. మా వాళ్ళు ఇష్టం లేకుండానే పెళ్లికి వచ్చి సైలెంట్ గా వెళ్ళిపోయారు. తర్వాత తెలుస్తుంది అని కూడా అన్నారు.
ఆస్తి కోసమే పెళ్లి: అయితే వాళ్లు చేసిన ఒక మంచి పని ఏమిటంటే ఒక ఒప్పందం రాయించుకున్నారు. ఆస్తులు అయితే నీకు పిల్లలు పుట్టిన తర్వాతనే ఇస్తామని అన్నారు. ఇక ఆ విషయం ఆయనకు ఎలా తెలిసిందో గానీ పెళ్లి అయిన తర్వాత ఒక వారం రోజులకు నువ్వు ఆ ఒప్పందాన్ని క్యాన్సిల్ చేస్తావా లేదా? ఎందుకు దాంట్లో సంతకం చేసావు అని అన్నారు. ఇక తర్వాత రోజులు గడిచిన కొద్ది నాకు విషయం అర్థమైంది. ఆస్తి కోసమే వీళ్ళు పెళ్లి చేసుకున్నారు అని తెలిసింది.

యాసిడ్ పోస్తాను.. చంపేస్తాను: ఒక మూడు నెలల వరకు సైలెంట్ గా కాపురం చేశాను. ఏడాది గడవక ముందే గొడవలు మరింత ముదిరాయి. నీ మీద యాసిడ్ పోస్తాను.. చంపేస్తాను.. అనేసి గదిలో తాళం వేసి ఉంచారు. అలా ఇబ్బంది పెట్టడంతో చలపతిరావు గారు గోపాలకృష్ణగారు వచ్చి నన్ను ఆ ఇంట్లో నుంచి బయటకు తీసుకువచ్చారు.
లేకపోతే ఆ ఇంట్లో ఏమైపోయేదాన్నో నాకు తెలియదు. ఇన్ని దెబ్బలు తగిలినా కూడా ఏనాడు ఆత్మహత్య చేసుకోవాలి అని అనిపించలేదు. అలాంటి ఆలోచనలతో ఉన్న వాళ్ళని చూస్తే కూడా నాకు చాలా కోపం వస్తుంది. చచ్చి ఏం సాధిస్తారు. ఏదైనా సరే ఎదుర్కోవాలి.. అని జయలలిత తెలియజేశారు.


Click it and Unblock the Notifications











