పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ సంఘవి.. 42 ఏళ్ల వయసులో

సినిమా కెరీర్ లో బిజీగా ఉంటూ.. చాలా మంది పెళ్లి అనే టాపిక్ ని మరచిపోతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య బ్యాచిలర్ లిస్ట్ పెరుగుతోంది. కానీ ఎక్కడో ఒక చోట మనసుకు నచ్చిన అమ్మాయి తగిలితే బౌల్డ్ అవ్వక తప్పదు. హీరోయిన్స్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. సీనియర్ నటి సంఘవి కూడా ఆలస్యంగానే పెళ్లి చేసుకుంది. అయితే చాలా రోజుల తరువాత ఈ నటి ఒక ఫొటోతో నెటీజన్స్ ని ఆశ్చర్యపరిచింది.

Recommended Video

Senior Telugu Actress Sanghavi With Her First Baby, Picture Goes Viral
బెస్ట్ హీరోయిన్..

బెస్ట్ హీరోయిన్..

1990ల కాలంలో హీరోయిన్స్ కొరత ఉన్న ఒకానొక సమయంలో ఎంట్రీ ఇచ్చిన సంఘవి తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. సమరసింహా రెడ్డి సినిమాతో ఈ బ్యూటీకి అప్పట్లో మంచి క్రేజ్ దక్కింది. సొంత బాష కన్నడ అయినప్పటికీ తెలుగు హీరోయిన్ అన్నట్టుగా జనాలను ఎట్రాక్ట్ చేసింది. సింపుల్ యాక్టింగ్ తో అమాయకంగా కనిపిస్తూ బెస్ట్ యాక్టర్ అనిపించుకుంది.

చాలా రోజుల తరువాత..

చాలా రోజుల తరువాత..

సంఘవి తెలుగు తెరపై కనిపించి చాలా కాలమవుతోంది. చివరగా ఆంధ్రావాల సినిమాలో సపోర్టింగ్ రోల్ తో మెప్పించిన తరువాత పెద్దగా కనిపించలేదు. మధ్య మధ్యలో రెండు చిన్న సినిమాలు చేసింది. కానీ అందులో సంఘవి ఉన్నట్లు ఎవరికి తెలియదు. ఇక చాలా కాలం తరువాత అమ్మడు తన పాపతో దర్శనమిచ్చింది. ఒక పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.

ఫోటో వైరల్

ఫోటో వైరల్

42 ఏళ్ల వయసులో తల్లైన సంఘవి పెళ్లి చాలా ఆలస్యంగా చేసుకుంది. సినిమాలు తగ్గుతున్న సమయంలోనే 2016లో వెంకటేష్ అనే ఐటి టెక్కిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె వివాహం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే జరిగింది. ఇక చాలా రోజుల తరువాత తన కూతురితో ఫోటోకి పొజివ్వడంతో ఆ ఫోటో వైరల్ గా మారింది.

ప్లాప్ ఎఫెక్ట్..

ప్లాప్ ఎఫెక్ట్..

బాలకృష్ణ సమరసింహా రెడ్డి అనంతరం సంఘవికి ఒక్కసారిగా ఆఫర్లు వచ్చి పడ్డాయి. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ దక్కించుకుంది. అయితే ఆ సినిమాలు చాలా వరకు ప్లాప్ అవ్వడంతో ఎక్కువ కాలం అప్పటి స్టార్ హీరోయిన్స్ కి సంఘవి పోటీని ఇవ్వలేకపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X