నా కాలే తొక్కుతావా.. కోపంగా షూటింగ్‌లో తెలుగు హీరోయిన్‌కు చుక్కలు చూపించిన బాలకృష్ణ!

నందమూరి బాలకృష్ణ అప్పుడప్పుడు తన కోపంతో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. అయితే బాలకృష్ణతో సన్నిహితంగా ఉండేవారు మాత్రం ఆయన కోపం కొన్ని నిమిషాల్లోనే ఉంటుంది అని ఆ తర్వాత మళ్లీ వెంటనే సాధారణ పరిస్థితుల్లోకి వచ్చేస్తారు అని కూడా అంటుంటారు. బాలయ్య బాబు చాలా సరదా మనిషి కూడా అని చెబుతూ ఉంటారు. అయితే ఇటీవల సీనియర్ హీరోయిన్ లయ మాత్రం బాలకృష్ణ ఒకానొక సమయంలో సీరియస్ అయిన విషయాన్ని గురించి తెలియజేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

తెలుగు అమ్మాయిగా..

తెలుగు అమ్మాయిగా..

సీనియర్ హీరోయిన్ లయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలో కొంతకాలం పాటు మంచి స్టార్ ఇమేజ్ ను చూసిన లయ ఓ వర్గం యువ హీరోలతో అప్పట్లో బాగానే సినిమాలు చేసింది. బాక్సాఫీస్ వద్ద కూడా ఆమెకు మంచి విజయాలు దక్కాయి. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసుకుంటూ లయ దశాబ్ద కాలానికి పైగా బిజీగానే కనిపించింది.

హీరోయిన్ అవ్వడం కంటే ముందు

హీరోయిన్ అవ్వడం కంటే ముందు

విజయవాడకు చెందిన లయ మొదట డాన్సర్ గా మంచి గుర్తింపును అందుకుంది. క్లాసికల్ డాన్సర్ గా చాలా స్టేజ్ షో లతో ఆమె అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇక చెస్ ప్లేయర్ గా కూడా ఆమె అప్పట్లో మంచి గుర్తింపును అందుకుంది. ఇక డాన్సర్ గా అయితే దాదాపు 50 స్టేజ్ షోలు ఇచ్చిన లయ ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

ఆ తరువాత బిజీగా

ఆ తరువాత బిజీగా

లయ 1992లో భద్రం కొడుకో అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది. ఇక తర్వాత మళ్లీ కొంతకాలం గ్యాప్ తీసుకుని 1999లో స్వయంవరం అనే సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఆ సినిమా తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా మూడేళ్ల వరకు సినిమాలు చేసుకుంటూనే వెళుతుంది. కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ మలయాళం ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేసింది.

బాలకృష్ణ సీరియస్

బాలకృష్ణ సీరియస్

ఇక లయ కొంతమంది అగ్ర హీరోలతో కూడా అవకాశాలు అందుకుంది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ తో 2004లో విజయేంద్ర వర్మ అనే సినిమా చేసింది. అయితే ఆ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు లయ చేసినా ఒక పొరపాటు వలన బాలకృష్ణ ఒక్కసారిగా సీరియస్ అయిపోయారట. ఆ దెబ్బతో ఆమె కన్నీళ్లు కూడా పెట్టుకుంది.

నా కాలే తొక్కుతావా అంటూ..

నా కాలే తొక్కుతావా అంటూ..

ఆరోజు జరిగిన విషయం గురించి లయ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేసింది. అప్పుడు షూటింగ్ స్టార్ట్ చేసే కంటే ముందు ఒక సాంగ్ కోసమని డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాము. అయితే ఆ సమయంలో అనుకోకుండా నేను బాలకృష్ణ గారి కాలు తొక్కేశాను. దీంతో ఆయన ఒక్కసారిగా నాపై సీరియస్ అవుతూ.. నా కాలే తొక్కుతావా అనేసారు. అంతేకాకుండా షూటింగ్ ఫ్యాకప్ అని అనేశారు.

ఏడిపించిన తరువాత

ఏడిపించిన తరువాత

జరిగిన పొరపాటు కారణంగా ఆయనలో సీరియస్ కావడంతో నేను వెంటనే సారీ సారీ అంటూ ఏడుస్తూనే ఉన్నాను. అయినప్పటికీ కూడా కొంతసేపటి వరకు ఆయన ఏమీ అనలేదు. కానీ చివరికి కాసేపు ఏడిపించిన తర్వాత ఇదంతా సరదాగా.. ఊరికే అన్నాను అంటూ నవ్వేశారు. దీంతో నేను ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నాను. బాలయ్య బాబు గారు చాలా సరదా మనిషి అని అంతకు ముందే తెలుసు. కానీ ఆ రోజు అలా ఆట పట్టించడంతో కన్ఫ్యూజ్ అయ్యాను.. అని లయ వివరణ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X