Meera Jasmine మీరా జాస్మిన్‌కు బంపర్ ఆఫర్.. భర్తతో విడాకుల తర్వాత తెలుగులో పవన్ హీరోయిన్ రీ ఎంట్రీ!
ఈ మధ్య కాలంలో సీనియర్ హీరోయిన్స్ రీ ఎంట్రీ హవా నడుస్తోంది. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన హీరోయిన్స్ .. పెళ్లితో గ్యాప్ తీసుకొని మళ్లీ రీ ఎంట్రీ ఇస్తూ బిజీగా మారుతున్నారు. స్టార్ హీరోలకు అక్కగా, వదినగా కీలక పాత్రల్లో నటిస్తూ సినిమాకు వెన్నుముకగా నిలుస్తున్నారు. ఇప్పటికే భూమిక, ప్రియమణి, లయ.. ఇలా చాలామంది హీరోయిన్స్.. రీ ఎంట్రీ లో అదరగొడుతున్నారు. ఇక వీరి లిస్ట్ లో చేరిపోయింది.. అందాల భామ మీరా జాస్మిన్ రీ ఎంట్రీ వివరాల్లోకి వెళితే..
అమ్మాయి బాగుంది అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యింది మీరా జాస్మిన్. అందం, అభినయం.. కట్టు బొట్టు.. అచ్ఛ తెలుగు అమ్మాయిలా మీరా కనిపించేసరికి తెలుగువారు ఆమెను గుండెల్లో పెట్టేసుకున్నారు. ఇక ఈ సినిమా తరువాత అమ్మడు చాలా సినిమాల్లో నటించి మెప్పించింది.

భద్ర, గుడుంబా శంకర్, బంగారు బాబు, గోరింటాకు లాంటి సినిమాల్లో నటించిన మీరా.. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే దుబాయ్ కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ ను వివాహమాడి.. సినిమాలకు దూరమయ్యింది. ఇక పెళ్లి తరువాత అమ్మడు ఇండస్ట్రీలో కనిపించింది లేదు.
అయితే చాలా గ్యాప్ తరువాత మీరా జాస్మిన్.. తన సోషల్ మీడియా ద్వారా అభిమానులను పలకరించింది. అది కూడా అలా ఇలా కాదు ఎప్పుడు లేనంత గ్లామరస్ గా కనిపించింది. మునుపెన్నడూ చేయని అందాల ఆరబోత చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేసింది. అసలు ఎంత పద్ధతిగా తెలుగమ్మయిలా ఉండే ఈమెనా.. ఇలా క్లివేజ్ షో చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది అని నెటిజన్స్ షాక్ అయ్యారు.
భర్తతో విభేదాల కారణంగా ఆమె విడాకులు తీసుకొని విడిపోయిందని, అందుకే మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి ఇంత అందాల ఆరబోత చేస్తుందని వార్తలు కూడా వచ్చాయి. ఇంత అందాల ఆరబోత చేసినా అమ్మడుకు మాత్రం తెలుగులో మంచి సినిమా ఛాన్స్ రాలేదు. గతేడాది విమానం అనే సినిమాలో ఒక చిన్న పాత్ర లో కనిపించింది. హిందీ లో ది టెస్ట్ అనే సినిమాలో నటిస్తోంది. ఇక్కడితో అమ్మడు పని అయిపోయింది అనుకున్నారు. కానీ, అంతలోనే మీరా జాస్మిన్ లక్కీ ఛాన్స్ పట్టేసింది.
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న స్వాగ్ సినిమాలో మీరా జాస్మిన్ కీలక పాత్రలో నటిస్తుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన రీతూ వర్మ నటిస్తోంది.
బోరింగ్ కథలకు టాటా చెబుతూ.. సరికొత్త పంథాలో అచ్చ తెలుగు సినిమా స్వాగ్ అంటూ రిలీజైన ఈ సినిమా గ్లింప్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఇక నేడు మీరా జాస్మిన్ ను మేకర్స్ సినిమాలోకి అధికారికంగా ఆహ్వానించారు. మీరా జాస్మిన్ మహారాణిగా కనిపించింది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో మీరా జాస్మిన్ లక్కీ ఛాన్స్ పట్టేసిందనే చెప్పాలి.
ఎట్టకేలకు అమ్మడి అందాల ఆరబోతకు ఫలితం దక్కినట్టే. ఈ సినిమా కనుక హిట్ అయితే మీరా జాస్మిన్ ను ఆపడం ఎవరితరం కాదు అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాతో ఈ చిన్నది ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











