twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తిండితో పాటు అదీ అవసరమే, సెక్సువల్ ఫ్రస్టేషన్ వల్లే రేప్ చేస్తున్నారు: గాయిత్రి గుప్తా

    |

    సెక్సువల్ ప్రస్టేషన్ ఎక్కువ అవ్వటం వల్లే రేప్ సంఘటనలు జరుగుతున్నాయని తెలుగు నటి గాయిత్రి గుప్తా అభిప్రాయ పడ్డారు. తాజాగా ఓ వెబ్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఈ సమాజానికి భయపడో, ఎవరైనా ఏమైనా అంటారనో ఇష్టం లేని పని చేయవద్దని, పెళ్లయినా.. రిలేషన్ షిప్ అయినా మీకు ఇష్టం అయితే ఓకే చెప్పండి, సింగిల్‌గా హ్యాపీగా ఉంటే దాన్ని కంటిన్యూ చేయాలని అన్నారు.

    నేను ఎప్పుడూ ఎవరి మీద ఆధార పడను, సింగిల్‌గా ఉండటానికే ఇష్టపడతానని గాయిత్రి గుప్తా స్పష్టం చేశారు. ఒక వ్యక్తి నా జీవితంలో వచ్చి నన్ను బాగా చూసుకోవాలని, ప్రేమించాలని ఎందుకు కోరుకోవాలి? నాకు అవయవాలన్నీ బావున్నాయి, నా కాళ్ల మీద నేను నిలబడి సంపాదించగలను, ఆనందంగా ఉండగలను అన్నారు.

    వాడు చనిపోతే మళ్లీ సింగిలే కదా...

    వాడు చనిపోతే మళ్లీ సింగిలే కదా...

    సమాజం కోసమో, ఎవరో ఏదో అనుకుంటారనో పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఒకవేళ మీరు చెబుతున్నట్లే జీవితంలో తోడు కావాలి కాబట్టి పెళ్లి చేసుకున్నానే అనుకుందాం. అతడు యాక్సిడెంటులో చనిపోతే మళ్లీ సింగిలే కదా. ఇక్కడ దేనికీ గ్యారంటీ లేదు. దేనికో ఒక దానికి భయపడి బ్రతకడం చేయొద్దు, నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతకడం నేర్చుకోవాలి. నీకు నిజంగా పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉంటే చేసుకో, రిలేషన్ షిప్ పెట్టుకోవాలంటే పెట్టుకో.. అంతే కానీ సింగిల్‌గా ఉండటం వల్ల నా ఫ్యూచర్ ఏమిటి? ఏవరైనా ఏమైన అంటారేమో? అనే భయంతో చేసుకోవద్దని గాయిత్రి గుప్తా వ్యాఖ్యానించారు.

    చాలా మంది వదిలేసి వెళుతున్నారు

    చాలా మంది వదిలేసి వెళుతున్నారు

    మనకు పిల్లలు పుడితే వారు మనల్ని ముసలి వయసులో చూసుకుంటారనే వాదన కూడా సరైంది కాదు. ఎందుకంటే చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రులను అనాధాశ్రమంలో, వృద్ధాశ్రమంలో వదిలేసి వెళ్లిపోతున్నారు. రోజు రోజుకూ ఆశ్రమాల సంఖ్య పెరిగిపోతోందని గాయిత్రి గుప్తా గుర్తు చేశారు.

    అందరికీ ఒక రూల్ పెడితే సెట్టవ్వదు

    అందరికీ ఒక రూల్ పెడితే సెట్టవ్వదు

    కొంత మందికి మమ్మీల్లాగా బట్టలు చుట్టేసుకుని ఇంట్లో ఉండాలనిపిస్తుంది. వారిని ఇంట్రోవర్ట్స్ అంటారు. ఎక్ట్సోవర్ట్స్‌కు అలా ఉండాలనిపించదు. వారికి స్వేచ్ఛగా ఎగరాలి, పది మందితో మాట్లాడాలి, లైఫ్ లో కొన్ని ఎచీవ్ చేయాలని ఉంటుంది. ఒక మనిషి ఆలోచనకు, ఇంకో మనిషి ఆలోచనకు అసలు పొంతన ఉండదు. ప్రతి ఒక్కరూ విభిన్నం. అలాంటపుడు అందరికీ ఒక రూల్ పెడితే సెట్టవ్వదని గాయిత్రి చెప్పుకొచ్చారు.

    రేప్ జరిగినపుడు బాధితురాలిని బ్లేమ్ చేయకూడదు

    రేప్ జరిగినపుడు బాధితురాలిని బ్లేమ్ చేయకూడదు

    డ్రెస్సింగ్ వల్ల ఆడవారిపై అత్యాచారాలు జరుగుతున్నాయనే వాదనలో నిజం లేదు. రేప్ జరిగినపుడు బాధితురాలిని బ్లేమ్ చేయకుండా ఎవరైతే ఆ పని చేశారో వారిని బ్లేమ్ చేయాలి. ప్రతి సారి అమ్మాయి రేప్ చేయబడుతుంది కాబట్టి అమ్మాయిదే తప్పు అనడం కరెక్ట్ కాదని గాయిత్రి గుప్తా తెలిపారు.

    సెక్సువల్ ప్రస్టేషన్ ఎక్కువ అవ్వడం వల్లే రేప్ సంఘటనలు

    సెక్సువల్ ప్రస్టేషన్ ఎక్కువ అవ్వడం వల్లే రేప్ సంఘటనలు

    చాలా రేప్ కేసుల్లో మైనర్స్ ఉన్నారు, ముసలివారు ఉన్నారు, దళితులు ఉన్నారు. సెక్సువల్ ప్రస్టేషన్ ఎక్కువ అవ్వడం వల్లే రేప్ సంఘటనలు జరుగుతాయి. ఆకలైనపుడు తిండి దొరక్కపోతే మనిషిషి ఏం చేస్తాడో అందరికీ తెలుసు. అదే విధంగా ఆ ఏజ్‌లో ఫీలింగ్స్ కలిగినపుడు కోరిక తీరకపోతే రేప్ చేస్తాడు. అలా చేయడం వంద శాతం తప్పు. కానీ దానికి కారణం అమ్మాయి డ్రెస్సు కాదు. కొంత లిబరల్ సొసైటీ కావాలి. మన సమాజంలో అది లేక పోవడం వల్ల ఇలాంటి రేప్ సంఘటనలు జరుగుతున్నాయని అభిప్రాయ పడ్డారు.

    ధైర్యం ఉంటేనే బయటకు రావాలి

    ధైర్యం ఉంటేనే బయటకు రావాలి

    ఇండస్ట్రీలో రావాడానికి కొందరు మహిళలు భయపడుతున్నారు అనడం కంటే.. భయం ఉన్న మనిషి ఏం చేయడానికైనా భయపడతారు అనేది నా వాదన. అందుకే ఇండస్ట్రీకి, భయంకు ఏమీ సంబంధం లేదని నేనంటాను. ఇల్లు దాటి బయటకు వస్తున్నావంటే ధైర్యం చేసుకుని రావాలి. సినిమా ఇండస్ట్రీ అయినా, మెడికల్ ఫీల్డ్ అయినా, సాఫ్ట్ వేర్ రంగం అయినా ఎక్కడికి వెళ్లినా ఇలాంటి జరుగుతున్నాయని... కాస్టింగ్ కౌచ్ లాంటి సంఘటనలను ఉద్దేశించి గాయిత్రి గుప్తా వ్యాఖ్యానించారు.

    బోల్డ్‌గా ఉండటం వల్ల మంచే జరుగుతోంది

    బోల్డ్‌గా ఉండటం వల్ల మంచే జరుగుతోంది

    సినిమా రంగం కాకుండా వేరే ఏ సెక్టార్ తీసుకున్నా దానిపై ప్రజల ఫోకస్ ఉండదు. కానీ సినిమా రంగంలో అలా కాదు. ఇక్కడ పని చేసే వారికి పబ్లిసిటీ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇక్కడ ఏం జరిగినా సెన్సేషన్ అవుతుంది. నా లాంటి వారు ఇండస్ట్రీలో జరిగిన విషయాలను బోల్డ్ గా బయట పెట్టడం వల్లే ‘క్యాష్' కమిటీ వచ్చింది. బోల్డ్‌గా మాట్లాడటం వల్ల మంచే జరుగుతుంది కాబట్టి నేను ఇలాగే ఉంటానని గాయిత్రి గుప్తా స్పష్టం చేశారు.

    English summary
    "Man needs to feed. Similarly, sex is also necessary. Sexual frustration is the cause of rape." Telugu actor Gayathri Gupta said. Gayatrhi Gupta is an Indian Telugu language actress and TV presenter. She is known for her progressive and liberal views. She is well known for her debates in Telugu News Channels about casting couch issue in Tollywood. She is known to be straight forward and frank.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X