సెగలు పుట్టిస్తున్న వరుణ్ సందేశ్ భార్య.. సెక్సీ లుక్స్‌తో పరేషాన్ చేసింది
హీరో వరుణ్ సందేశ్ భార్య వితిక షేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఆమె పోస్ట్ చేసిన ఫోటో షూట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫొటోల్లో ఘాటు అందాలతో కుర్రకారును మతిపోగెట్టే స్టిల్స్ ఇచ్చింది వితిక షేరు.
'ప్రేమ ఇష్క్ కాదల్' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన వితిక షేరు.. ఆ తరువాత వరుణ్ సందేశ్‌తో కలిసి 'పడ్డానండి ప్రేమలో మరి' సినిమాలో నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడిన రుణ్ సందేశ్- వితిక షేరు ఆ తర్వాత పెళ్లి పీటలెక్కి ఒక్కటయ్యారు. ఇటీవలే ఈ భార్య భర్తలిద్దరూ బుల్లితెర పాపులర్ షో తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 లో కూడా భాగం కాబోతున్నారని వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో తాజాగా వితిక షేర్ చేసిన ఫోటో షూట్ హాట్ టాపిక్‌గా మారింది. సెక్సీ లుక్స్‌తో ఫొటోలకి పోజిచ్చిన ఈ అమ్మడు తనలోని వయ్యారాలు ఒలకబోసింది. పెళ్ళయితే మాత్రం హీరోయిన్ అందాలు తరిగిపోతాయా? అన్నట్లుగా కిక్కిచ్చే స్టిల్స్ షేర్ చేసింది వితిక షేరు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ పిక్స్ పై భిన్నరీతిలో స్పందిస్తున్నారు నెటిజన్లు. టూ హాట్, వెరీ సెక్సీ, బిగ్ బాస్ హౌస్ లో హంగామా చేసే ముందు ఇస్తున్న చిన్న కిక్కా? ఇది.. అంటూ నెటిజన్ల నుంచి రియాక్షన్ వస్తోంది. కాగా వితిక షేరు వాలకం చూస్తుంటే మరోసారి సినిమాల్లో దర్శనమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











