ముద్దులతో చంపేస్తుంది.. తట్టుకోలేకపోతున్నా, బాధగా ఉంది.. తాప్సీ వ్యవహారం బట్టబయలు
విలక్షణ నటి తాప్సీ పొన్ను వరుస విజయాలతో దూసుకెళ్తున్నది. పింక్ చిత్రం తర్వాత అమితాబ్ బచ్చన్‌తో కలిసి తాజాగా బద్లా అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతూ సంచలన విజయం దిశగా ప్రయాణిస్తున్నది. ఈ నేపథ్యంలో తాప్సీ తన సోదరి షగున్ పొన్నుతో కలిసి జీ కేఫ్ చానెల్ నిర్వహించే చాట్ షో స్టారీ నైట్స్ 2.ఓహెచ్ అనే క్యార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కా చెల్లెల్లు చేసిన హంగామా గురించి మీ కోసం..

హీరోయిన్ తాప్సీ అలవాట్లు ఇలా
తాప్సీ గురించి సోదరి షగున్ వెల్లడిస్తూ.. మా అక్కకు పరధ్యానం ఎక్కువ. పక్కనే ఉంటుంది. కానీ ఎప్పుడు ఏదో ధ్యాసలో ఉంటుంది. రెండు రోజుల క్రితం కారు ఇంజిన్ ఆపకుండానే ఇంట్లోకి వచ్చింది. దాదాపు మూడు గంటలు కారు అలా స్టార్ట్‌లోనే ఉంది. దాంతో నీ మైండ్ ఎక్కడపెట్టుకొన్నవ్ అని కోపగించాను అని చెప్పింది.

తాప్సీకి మహా చెడ్డ అలవాటు
ఇక తన సోదరి తాప్సీ అలవాట్ల గురించి షగున్ బయటపెట్టింది. తనకు ఓ చెడ్డ అలవాటు ఉంది. నన్ను వదలకుండా ఎప్పుడూ ముద్దులు పెట్టి చంపేస్తుంది. అంతేకాకుండా మోచేతితో గుద్ది బాధపెడుతుంది అంటూ తాప్పీపై షగున్ ఫిర్యాదు చేసింది.

నా బలం, బలహీనత నా సోదరియే
ఇక షగున్ గురించి తాప్సీ మాట్లాడుతూ.. నా జీవితంలో బలం, బలహీనత నా సోదరియే. షగున్ అంటే నాకు చాలా ఇష్టం. ఆమె నా జీవితం. అందుకే ఆమెతో అలా ప్రవర్తిస్తాను. షగున్ ఏ మాత్రం చెడు జరిగినా నేను తట్టుకోలేను అని అన్నారు.

అక్కా చెల్లెళ్లు కలిసి బిజినెస్
షగున్, తాప్సీ ఒకరిపై మరొకరు చాలా ప్రేమను చాటుకొంటారు. వారిద్దరు కలిసి కొద్దికాలంగా బిజినెస్ కూడా చేస్తున్నారు. వెడ్డింగ్ ఫ్యాక్టరీ అనే ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని సక్సెస్‌ఫుల్‌గా నిర్వహిస్తున్నారు. బాద్లా చిత్ర విజయంతో తాప్పీ క్రేజ్ మరింత పెరిగింది.


Click it and Unblock the Notifications











