‘ఒకేసారి ఒక్కరితో రిలేషన్‌షిప్ కష్టం.. అందుకే చాలా మందితో రొమాన్స్’

Photo Courtesy: Instagram/shahanagoswami

బాలీవుడ్‌లో షహానా గోస్వామి అంటే పెద్దగా ఎవరు గుర్తుపట్టరు. కానీ టాప్ మోడల్, నటుడు మిలింద్ సోమన్ మాజీ ప్రియురాలు అంటే ఠక్కున గుర్తు పట్టేస్తారు. అయితే షహానా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలతో ఇంటర్నెట్ మీడియాకు అగ్గి పెట్టేసింది. బోల్డుగా ఆమె చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. తన రిలేషన్‌షిప్స్ గురించి, పెల్లి గురించి చెప్పిన మాటలు అందర్నీ నివ్వెరపోయేలా చేస్తున్నాయి. అలాగే మిలింద్ సోమన్‌తో బ్రేకప్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఇంతకు షహానా గోస్వామి ఎవరు? ఆమె లేటేస్ట్ ఇంటర్వ్యూ వివరాల్లోకి వెళితే..

షహానా గోస్వామి విషయానికి వస్తే.. ప్రముఖ ఎకానమిస్ట్ ఓంకార్ గోస్వామి కూతురు. బాలీవుడ్‌లో నటిగా రాణిస్తున్నారు. రాక్ ఆన్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఫిరాఖ్ అనే సినిమాలోను, హీరోయిన్, మిడ్‌నైట్ చిల్డ్రన్, ఏ సూటెబుల్ బాయ్, జ్విగాటో, సంతోష్ సినిమాల్లో నటించారు. 2024 సంవత్సరంలో చివరిగా ఆమె డిస్పాచ్ అనే సినిమాలో నటించింది.

Shahana Goswami latest Interview

ఇక మిలింద్ సోమన్‌తో చాలాకాలం లివిన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఆయనతో సెటిల్ అవుతుందని అంతా భావించారు. కానీ ఉన్నట్టుండి వారిద్దరూ తెగతెంపులు చేసుకొన్నారు. కారణం ఏమిటని అడిగితే.. జీవితంలో డిఫరెంట్‌గా చాలా విషయాలు ఉన్నాయి. వాటిని అనుభవించాలని ఆయనతో విడిపోయాను. ఆయన అంటే నాకు టీనేజ్ నుంచి ఇష్టమే. ఇప్పటికీ ఆయనపై పీకల్లోతు ప్రేమ ఉంది. కానీ కలిసి ఒక్కరితో జీవించలేను అని షహానా చెప్పింది.

నాకు యుక్త వయసు వచ్చేటప్పటికీ.. ఒక్కరితో జీవితాన్ని గడపాలని అనుకోలేదు. ఒకేసారి చాలా మందితో రిలేషన్స్ పెట్టుకొన్నాను. పెళ్లి తర్వాత కూడా ఒకే జీవిత భాగస్వామితో కలిసి ఉండలేను. స్కాండేవేనియన్ కంట్రీలో రెండేళ్ల కాంట్రాక్టుతో పెళ్లి జరుగుతుంది. రెండేళ్ల తర్వాత నచ్చితే ఆ కాంట్రాక్టును పొడిగిస్తారు. ఒక్కసారి ఒకరితో రిలేషన్‌ పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు అని తెగేసి చెప్పేసింది.

లైఫ్ గురించి షహానా చెబుతూ.. నాకు మతపరమైన విశ్వాసాలు ఉన్నాయి. అధ్యాత్మికంగా కనెక్ట్ అయి ఉన్నాను. కానీ నేను దేనిని గుడ్డిగా నమ్మను. నాకంటూ అభిప్రాయాలు ఉన్నాయి. నాకంటూ లక్ష్యాలు ఉన్నాయి. వాటిని జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ జీవిస్తాను. నాకు ఇష్టం ఉన్నట్టు జీవిస్తాను అని అన్నారు.

నాకు ఇప్పటికీ ముఖ్యమైన జీవిత భాగస్వామి లేడు. చాలా మందితో నేను రిలేషన్‌షిప్ పెట్టుకొన్నాను. ఒకే సమయంలో చాలా మందితో జీవితాన్ని ఆస్వాదిస్తాను. నాకు ఉన్న రిలేషన్‌షిప్స్ గురించి అందరికి షేర్ చేస్తాను. నా రిలేషన్‌షిప్ గురించి ఏదీ దాచను. ఒకరికంటే ఎక్కువ మందితో రిలేషన్‌షిప్ పెట్టుకొంటే నిజాయితీగా అందరితో షేర్ చేసుకొంటాను అని షహానా చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X