హాట్ హాట్‌గా షకీలా బయోపిక్.. మత్తెక్కించేందుకు హీరోయిన్ ట్రైనింగ్.. ఆమె ప్రియుడెవరంటే!
Recommended Video

90వ దశకంలో దక్షిణాది ప్రేక్షకులను ఉర్రూతలూగించిన శృంగార తార షకీలా జీవిత కథపై సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. షకీల పాత్రలో బాలీవుడ్ నటి రిచా చద్దా కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం తన శరీరాకృతిని మార్చుకొని రిచా అందరికీ షాక్ ఇచ్చింది. అంతేకాకుండా శృంగార నృత్యాలను.. ముఖ్యంగా బెల్లీ డ్యాన్స్ కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందుతున్నట్టు ఆమె వెల్లడించారు. రిచా చద్దా ఏమన్నారంటే..

షకీలా బయోపిక్ కోసం
షకీలా బయోపిక్ కోసం బెల్లీ డ్యాన్స్ నేర్చుకొంటున్నాను. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా చిత్రీకరించే ప్రమోషనల్ సాంగ్ కోసం శిక్షణ పొందుతున్నాను. ముంబైకి చెందిన బెల్లీ డ్యాన్స్ శిక్షకురాలు షైనా లెబానా ట్రైనింగ్ ఇస్తున్నారు అని రిచా చద్దా చెప్పారు.

బెల్లీ డ్యాన్స్ శిక్షణ
ఇప్పటి వరకు నేను మూడు వారాలపాటు షైనా వద్ద బెల్లీ డ్యాన్స్ శిక్షణ తీసుకొన్నాను. ఈ శిక్షణ మరి కొన్ని వారాలు జరుగుతుంది. ఈ సినిమాలో డ్యాన్స్‌కు చాలా ప్రధాన్యం ఉంది. అందుకే దీని కోసం నేను ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొంటున్నాను అని రిచా చద్దా వెల్లడించారు.

ప్రమోషనల్ సాంగ్ కోసం
నాకు కొత్తగా ఏదైనా నేర్చుకోవడమంటే చాలా ఇష్టం. ముఖ్యంగా డ్యాన్స్ లాంటి కళను నేర్చుకోవడమంటే మరీ ఉత్సాహంగా ఉంటుంది. మేము షూట్ చేసే పాట ప్రమోషన్ సాంగ్. దాంతో ఈ పాటపై మరింత దృష్టిపెడుతున్నాం. బెల్లీ డ్యాన్స్ అంటే చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాదు. చాలా హుందాగా కూడా కనిపిస్తుంది.

షకీలా పరిశ్రమకు దూరంగా
సుమారు రెండు దశాబ్దాలపాటు వెండితెరపై సంచలన రేపిన నటి షకీలా ప్రస్తుతం సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. తన జీవితంలోని సంఘటన ఆధారంగా చేసుకొని ఓ బయోపిక్‌ను దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ రూపొందించే పనిలో ఉన్నారు. రిచా చద్దా షకీలాగా కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన షకీలా బయోపిక్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

షకీలా ప్రియుడిగా ఎవరంటే
షకీలా బయోపిక్‌తోపాటు ఆమె జీవితంలో కూడా ప్రియుడి పాత్ర కీలకమైందనే చెబుతున్నాను. షకిలా ప్రియుడి పాత్రలో మలయాళ నటుడు రాజీవ్ పిళ్లై నటిస్తున్నాడు. నేను షకిలా బయోపిక్‌లో కీలక పాత్రలో కనిపించనున్నాను. నా క్యారెక్టర్ పేరు అర్జున్ అని రాజీవ్ పిళ్లై వెల్లడించారు.


Click it and Unblock the Notifications











