Shakeela షకీలా నిజస్వరూపం చూస్తే షాక్ అవ్వాల్సిందే.. 23 ఏళ్ల ఆ అనుభవాన్ని కడిగిపడేసేందుకే..!
యాక్టర్ షకీలా గురించి బయటి ప్రపంచానికి ఉన్న ఇమేజ్ వేరు. కానీ ఆమె వ్యక్తిగత జీవితం చూస్తే అందుకు భిన్నంగా కనిపించింది. ఆఫర్లు లేకపోయినా మనోబలంతో నెట్టుకొస్తున్నది. చాలా మంది ట్రాన్స్‌జెండర్లకు అండగా నిలిచి తనలోని గొప్పతనాన్ని చాటుకొన్నది. బిగ్‌బాస్ తెలుగు 7లోకి వచ్చిన తర్వాత షకీలాను చూస్తే.. ఇప్పటి వరకు ఉన్న ఇమేజ్‌ను తుడిచిపెట్టడం ఖాయం. షకీలా గురించి నాగార్జున, ఆమె చెప్పిన విషయాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు లాంటి పాపులర్ షోలో అవకాశం రావడమే చాలా కష్టం. అలాంటి అవకాశం రావడంతో నేను మరోమారు ఆలోచించకుండా ఒకే చెప్పాను. ముందు నాకు వేరే కెరీర్ ఉండేది అని షకీలా అంటే.. నీవు అది సినిమాకు సంబంధించి.. దాని గురించి పట్టించుకోవద్దు అని నాగార్జున అన్నాడు. దాంతో నేను దాని గురించి ఆలోచించి బాధపడటం లేదు. 23 ఏళ్ల నుంచి శృంగార తార షకీలా అని ఉండేది. ఇప్పుడు షకీలా అమ్మ అని పిలుస్తున్నారు. నాకు తెలుగు ప్రజలతో ఓ బాండింగ్ కోరుకొంటున్నాను. నాకు మంచి పేరు తెచ్చుకోవాలంటే.. ఈ ఫ్లాట్‌ఫామ్ చాలా అవసరం అని నేను నమ్మాను అని షకీలా చెప్పింది.

ఇంటిలోకి మీరు షకీలాగా వెళ్తున్నారా? లేదా షకీ అమ్మగా వెళ్తున్నారా? అని నాగార్జున అంటే.. షకీ అమ్మా కాదు.. మీరు షకీ అని పిలువండి అని షకీలా కోరింది. అయితే షకీ ఇంటిలోకి వెళ్లే ముందు ఆమెను అమితంగా ప్రేమించే వారిని పిలుస్తానని నాగార్జున చెప్పారు. వేదికపైకి షాషా, తంగమ్ అనే ఇద్దరు ట్రాన్స్‌జెండర్స్‌ను పిలిచారు.
షకీలా బాగోగులను ఈ ఇద్దరు చూసుకొంటారా? అని నాగార్జున అంటే.. లేదు మా బాగోగులే ఆమె చూసుకొంటుంది. మమ్మల్ని కని పెంచినా అంత బాగా చూసుకొనేదో లేదే తెలియదు అని షాషా అనగానే.. షకీలా కంటతడి పెట్టింది. అయితే మీరు కన్నీరు పెట్టకూడదు అంటూ వారిద్దరూ ఓదార్చారు. బిగ్‌బాస్ షోలోకి వస్తున్నారని తెలియగానే మేము చాలా హ్యాపీగా ఫీలయ్యాం. మాటల్లో ఆ ఆనందాన్ని చెప్పలేం అంటూ వారిద్దరూ ఎమోషనల్ అయ్యారు. మీరు బాగా ఆడాలి. టైటిల్ గెలువాలి. చాలా విషయాలు మనసులో పెట్టుకొని షోకు వచ్చారు

ట్రాన్స్ జెండర్స్‌ను బాగా చూసుకోవాలని ఎప్పుడు అనిపించింది అని నాగార్జున అడిగితే.. 25 ఏళ్ల నుంచి నాకు ఇలాంటి ఆలోచన ఉంది. ట్రాన్స్‌జెండర్ చాలా మంది ఫ్యామిలీని వదిలేసి వస్తారు. వీరిద్దరూ నా అమ్మను అమ్మమ్మ అని పిలుస్తారు. తంగమ్ నా పెద్ద కూతురు, షాషా నా చిన్నకూతురు. ఇలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు. దాదాపు 40 మంది ఉన్నారు అని షకీలా ఎమోషనల్ అయింది.

తంగమ్, షాషాకు పిల్లలు ఉన్నారు. నన్ను అవ్వ అని పిలుస్తారు. విదేశాల నుంచి చాలా మంది వస్తుంటారు. వీళ్లందరూ నన్ను వాళ్ల కమ్యూనిటీలో చేర్చుకొన్నారు. వాళ్ల కమ్యూనిటీలో నాకు చాలా మంది అక్కలు, చెల్లెలు ఉన్నారు అని షకీలా చెప్పింది. అయితే ఆమె నాకు ఎవరూ లేరని బాధపడుతుంటుంది. కానీ ఆమెకు మేము కుటుంబంలా అండగా ఉంటాం అని షకీలా పెంపుడు కూతుళ్లు చెప్పారు.


Click it and Unblock the Notifications











