షకీలా పోర్న్ స్టార్ కాదు.. బయోపిక్ టైటిల్ లుక్ రిలీజ్
దక్షిణాది శృంగార తార షకీలా బయోపిక్ టైటిల్ లోగో లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. షకీలా బయోపిక్ రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రిచా చద్దా టైటిల్ పాత్రను పోషిస్తున్నారు. షకీలా టైటిల్ లుక్‌లో నాట్ ఏ పోర్న్ స్టార్ అనే క్యాప్షన్ ఉంచారు. మిలమిలా మెరిసే నియాన్ లైట్ల బ్యాక్ గ్రౌండ్‌తో నల్లటి బోర్డుపై షకీలా టైటిల్‌ను ప్రజెంట్ చేశారు.

90వ దశకంలో దక్షిణాది పరిశ్రమను తన అందాలతో ప్రేక్షకులకు మత్తెక్కించిన షకీలా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. ఆమె జీవితంలో సుఖ: దుఖాలను వెండితెర మీద ఆవిష్కరించనున్నారు. ఈ చిత్రానికి కన్నడ దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

టైటిల్ లుక్ రిలీజ్ సందర్భంగా ఇంద్రజిత్ లంకేష్ మాట్లాడుతూ.. షకీలా బయోపిక్ దర్శకత్వం వహించడం, ఆమె జీవితాన్ని తెరకెక్కించడం నా జీవితంలో అద్భుతమైన సంఘటన. 2003లో ఆమెతో ఓ చిత్రం రూపొందించాను అని ఇంద్రజిత్ చెప్పారు. తన బయోపిక్‌లో షకీలా అతిథి పాత్రలో కనిపించనున్నారు. దాంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి.


Click it and Unblock the Notifications











