ఆ రోజు రాత్రి ఎప్పటికీ మర్చిపోలేను.. ఫ్రెండే కదా రూమ్‌లో పడుకొనిస్తే..
సౌత్ ఫిల్మీ ఇండస్ట్రీలో బోల్డ్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి షకీలా (Shakeela). ఈ హాట్ భామ తరచుగా తన కెరీర్‌లో జరిగిన ఆసక్తికర సంఘటనలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలాగే ఓ ఇంటర్య్వూలో ఆమె దివంగత హాస్యనటుడు వేణు మాధవ్ (Venu Madhav)తో తనకు ఎదురైన ఒక ఫన్నీ సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల్లో నవ్వులు పూయిస్తోంది.
షకీలా చెప్పిన వివరాల ప్రకారం, ఒక సినిమా షూటింగ్ సమయంలో ఆమెతో పాటు వేణు మాధవ్,బ్రహ్మానందం, రఘబాబు వంటి ప్రముఖ నటులు ఒకే హోటల్‌లో స్టే చేశారు. షూటింగ్ షెడ్యూల్ పూర్తయ్యాక మూవీ టీంలోని కొంతమంది ఆమె గదిలోనే భోజనం చేయడంతో రూమ్ మొత్తం గందరగోళంగా మారిపోయిందట. ఆ పరిస్థితిలో ఆ గదిలో పడుకోవడం అసాధ్యంగా మారింది. దీంతో షకీలా తన స్నేహితుడైన వేణు మాధవ్‌ను అడిగి ఆయన గదిలో పడుకోవచ్చా అని కోరిందట. వేణు మాధవ్ కూడా ఎలాంటి సంకోచం లేకుండా 'రా పడుకో' అంటూ ఆమెను తన గదికి ఆహ్వానించాడని చెప్పారు.

రాత్రి వేళ అనుమానం
రాత్రి లైట్లు ఆపేసిన తర్వాత గదిలో కేవలం టీవీ లైట్ మాత్రమే ఉండటంతో చీకటి వాతావరణం నెలకొంది. ఆ సమయంలో వేణు మాధవ్ ఒక్కసారిగా 'నేను ఒక మాట అడుగుతాను... నువ్వు కాదనకూడదు' అని అన్నాడట. ఈ మాట విన్న వెంటనే షకీలాకు అనుమానం వచ్చిందట. 'మంచి స్నేహితుడిగా భావించిన వేణు ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు? ఏమైనా తప్పుగా ప్రవర్తిస్తాడా?' అనే సందేహం ఆమెకు కలిగిందని చెప్పారు. ఒకవేళ అతను ఏమైనా తప్పుగా అడిగితే తమ స్నేహం అక్కడితో ముగుస్తుందని కూడా ఆమె ఆలోచించిందట. చివరకు 'సరే... అడుగు చూద్దాం' అని ఆమె చెప్పిందట.
వేణు మాధవ్ ఇచ్చిన ట్విస్ట్
అప్పుడు వేణు మాధవ్ మరోసారి సీరియస్‌గా మాట్లాడుతూ 'నువ్వు ఒప్పుకోను అని మాత్రం చెప్పకూడదు'అని చెప్పాడట. దీంతో షకీలా అనుమానం మరింత పెరిగింది. తర్వాత అసలు విషయం చెబుతూ వేణు మాధవ్ ఇలా అన్నాడట. 'నాకు పెళ్లాం పిల్లలు ఉన్నారు. వాళ్లు బాగుండాలంటే నేను బతికి ఉండాలి' ఈ మాట విన్న షకీలా ఆశ్చర్యపోయిందట.'అదేంటి ఇప్పుడు?'అని అడగగా వేణు మాధవ్ వెంటనే ఇద్దరి మధ్యలో దిండ్లు పెట్టడం ప్రారంభించాడట. 'నిద్రలో నువ్వు పొరపాటున నాపై కాలు వేస్తే నేను చచ్చిపోతాను. అందుకే ఈ దిండ్లు పెట్టాను. నీకు కాలు వేయాలనిపిస్తే వీటిమీద వేయి'అని చెప్పాడట.
ఈ షాకింగ్ సమాధానం విన్న షకీలా ఒక్కసారిగా నవ్వు ఆపుకోలేకపోయిందట. ఆ రాత్రంతా ఆమె నవ్వుతూనే గడిపిందని చెప్పారు. మరుసటి రోజు ఉదయం ఈ విషయాన్ని బ్రహ్మానందం, రఘుబాబులకు చెప్పడంతో వారు కూడా రోజంతా నవ్వుతూనే ఉన్నారని షకీలా తెలిపారు. ఈ సంఘటన ద్వారా వేణు మాధవ్‌లోని అమాయకత్వం, కామెడీ టైమింగ్ స్పష్టంగా కనిపిస్తుందని షకీలా పేర్కొన్నారు. ఆయనతో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఇలాంటి అనుభవాలు చాలానే ఉంటాయని కూడా చెప్పారు.
టాలీవుడ్‌లో తన ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ, కామిక్ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించిన వేణు మాధవ్ ఇప్పటికీ అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని సినీ అభిమానులు చెబుతున్నారు. షకీలా చెప్పిన ఈ చిన్న సంఘటన కూడా వేణు మాధవ్ వ్యక్తిత్వం ఎంత సరదాగా ఉండేదో మరోసారి గుర్తు చేస్తోంది.


Click it and Unblock the Notifications

















