అర్జున్ రెడ్డి లాంటి బోల్డ్ రోల్? ఆ తప్పు మళ్లీ చేయను.. షాలిని పాండే
తెలుగు సినిమా దగ్గర కేవలం ఒక్క సినిమా తోనే సంచలనం రేపి మళ్ళీ చల్లబడిపోయిన హీరోయిన్స్ చాలా మందే కనిపిస్తారు. ఇలా టాలీవుడ్ లో ఒక్క సినిమాతో ఓ రేంజ్ లో హైలైట్ అయ్యిన యంగ్ బ్యూటీస్ లో అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే కూడా ఒకామె అని చెప్పాలి. కంప్లీట్ గా తెలుగు ఆడియెన్స్ కి ఈ అమ్మాయి కొత్త అయినప్పటికీ అర్జున్ రెడ్డి ప్రీతీ అంటే తెలియని మూవీ లవర్ మన తెలుగులో ఉండడు.
ఆ రేంజ్ ఇంపాక్ట్ ని షాలిని పాండే ఈ సినిమాతో అందుకుంది. కాగా అర్జున్ రెడ్డి సినిమాలో అటు హీరో విజయ్ దేవరకొండ ఇటు షాలిని పాండే ఇద్దరు కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగకి కావాల్సినంత బోల్డ్ నెస్ ని అందించి రెచ్చిపోయారు. కట్ చేస్తే ఇదే సినిమాలో ఎమోషన్ తో పాటుగా మంచి హైలైట్ అయ్యింది.

అయితే అర్జున్ రెడ్డి సినిమాలో ఇద్దరు లీడ్ నడుమ ఎలాంటి సీన్స్ సాంగ్, ఎన్ని పెదవి ముద్దులు ఉన్నాయో లెక్కే ఉండదు. ఇలా కొన్నేళ్ల కితం అర్జున్ రెడ్డి అనే సినిమా ఒక సంచలనంగా మారింది. మరి ఇలాంటి సెన్సేషనల్ హిట్ ఉన్నా కూడా షాలిని పాండేకి తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా పెద్దగా బ్రేక్ లేదు. మరి ఇపుడు మళ్ళీ షాలిని పాండేకి ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురైతే తాను దానికి అంతే ఇంట్రెస్టింగ్ సమాధానం కూడా ఇవ్వడం వైరల్ గా మారింది.
కాగా మళ్ళీ అర్జున్ రెడ్డి లాంటి బోల్డ్ రోల్స్ తనకి వస్తే చేస్తారా అనే ప్రశ్నకి ప్రీతీ ఇలా సమాధానం ఇచ్చింది. తనకి ఇప్పుడుకి కూడా అలాంటి పాత్రలు వస్తే ఖచ్చితంగా నో చెప్పను అంటుంది. కాకపోతే తన పాత్రలో ఏమన్నా అభ్యంతరకర అంశాలు మాత్రం ఉంటే ఖచ్చితంగా వాటిని మార్పించుకొని ఆ రోల్ చేసేందుకు సిద్ధమే అని ఆమె చెబుతుంది.
అయితే తాను అర్జున్ రెడ్డి సినిమా చేసిన సమయంలో అలా చెప్పుకునేందుకు స్కోప్ లేకపోయింది అని అప్పుడు తన వయస్సు చాలా చిన్నది ఆ సినిమా చేసిన తర్వాత తన పాత్రలో కొన్ని చేయకుండా ఉండాల్సింది అని భావించింది అట. అందుకే అలాంటివి ఇపుడు రిపీట్ కాకుండా ప్లాన్ చేసుకుని అర్జున్ రెడ్డి సినిమాలో లాంటి పాత్ర మళ్ళీ వచ్చినా సిద్ధమే అని చెబుతుంది.
కాగా అప్పుడు కంటే ఇపుడు నటిగా తాను కొంచెం ఎక్కువ తెలుసుకుంది కాబట్టి ఆ సమయంలో జరిగిన మిస్టేక్స్ ఇపుడు చేయకుండా ఉండేలా తనని తాను మార్చుకున్నట్టుగా ఈ యంగ్ బ్యూటీ చెబుతుంది. మరి వీటితో మాత్రం అర్జున్ రెడ్డి సినిమా విషయంలో కొంచెం డిజప్పాయింట్ గానే ఉందని చెప్పక తప్పదు. కాగా ఇపుడు ఈ యంగ్ బ్యూటీ హిందీలోనే పలు సినిమాలు వెబ్ సిరీస్ లు చేస్తుండగా తాను నటించిన వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్ ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది. మరి ఈ సిరీస్ లో షాలినికి మంచి మార్కులు ఆడియెన్స్ నుంచి దక్కుతున్నాయి.


Click it and Unblock the Notifications











