అర్జున్ రెడ్డి హీరోయిన్‌కు బాలీవుడ్ ఛాన్స్.. యంగ్ హీరోతో రొమాన్స్!
తెలుగులో అర్జున్ రెడ్డి చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రం హీరో విజయ్ దేవరకొండకు, దర్శకుడు సందీప్ వంగాను మంచి క్రేజ్ తీసుకుని వచ్చింది. షాలిని పాండేకు కూడా మంచి గుర్తింపు లభించింది. కానీ ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం షాలిని పాండే కొన్ని చిత్రాల్లో మాత్రమే నటిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా షాలిని పాండే బాలీవుడ్ చిత్రంలో అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సీనియర్ నటుడు పరేష్ రావల్ తనయుడు ఆదిత్య హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఏ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాంఫాడ్ అనే టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని షాలిని పాండే దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రంజన్ అనే డెబ్యూ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు.

షాలిని పాండేకు ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఈ చిత్రం విజయం సాధిస్తే షాలిని పాండే బాలీవుడ్ మరిన్ని అవకాశాలు అందుకోవచ్చు. షాలిని పాండే ప్రస్తుతం తమిళంలో జివి ప్రకాష్ సరసన 100 పర్సెంట్ కాదల్ చిత్రంలో నటిస్తోంది. తెలుగులో కళ్యాణ్ రామ్ నటిస్తున్న 118 చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతోంది.


Click it and Unblock the Notifications











