Don't Miss!
- Finance
d-sib: సురక్షిత బ్యాంకు కోసం చూస్తున్నారా.. RBI సూచించింది ఇదే..
- News
కేసీఆర్ చెప్పినట్లే..!: ఈటల రాజేందర్‌పై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Sports
INDvsNZ : ఇదేంట్రా అయ్యా?.. ఇన్ని గాయాలా?.. యువ ఓపెనర్‌పై సెలెక్టర్లు సీరియస్!
- Lifestyle
Chanakya Niti: ఈ తప్పుల వల్ల లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురవుతారు, ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
అర్జున్ రెడ్డి బ్యూటీ హాట్ వీడియో: కెమెరా ముందు చేయలేనంటూ షాకింగ్ గా!
తెలుగులో లవ్ స్టోరీ చిత్రాల్లో విపరీతమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న సినిమా అర్జున్ రెడ్డి. బోల్డ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఈ చిత్రం యూత్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక అర్జున్ రెడ్డి సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన హీరోయిన్ షాలిని పాండే కూడా మంచి క్రేజ్ అయితే అందుకుంది. అర్జున్ రెడ్డి తర్వాత మళ్లీ అలాంటి సక్సెస్ చూడకపోయినప్పటికి కూడా గ్లామర్ తో మాత్రమే ఈ బ్యూటీ కుర్రాళ్లను ఎంతగానో అట్రాక్ట్ చేస్తోంది. సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో ఆకట్టుకునే ఈ బ్యూటీ తాజాగా ఓ హాట్ వీడియో వదిలింది.

బోల్డ్ సన్నివేశాల్లో నటించి..
అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శాలిని పాండే ఏ స్థాయిలో గుర్తింపును అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక అందులో బోల్డ్ సన్నివేశాల్లో కూడా ఆమె ఊహించని విధంగా కనిపించి ఓ వర్గం యువతను ఎంతగానో అట్రాక్ట్ చేసింది. దీంతో చాలా ఈజీగా స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ దక్కించుకుంది.

కంటెంట్ ఉన్న పాత్రల్లో..
అయితే
అర్జున్
రెడ్డి
తర్వాత
అంతగా
ఆకట్టుకునే
సినిమా
షాలినీ
పాండే
చేయలేదు.
ఆ
తర్వాత
చేసిన
చాలా
వరకు
సినిమాలు
ఏదో
నామమాత్రంగానే
బాక్సాఫీస్
వద్ద
సక్సెస్
అయ్యాయి.
ఆమె
అందులో
ఆమె
పాత్రకు
మాత్రం
అంతగా
గుర్తింపు
లభించిన
ఆమెను
లక్
వరించలేదనే
చెప్పవచ్చు.
అయితే
శాలిని
పాండే
కేవలం
హీరోయిన్
గానే
కాకుండా
కొన్ని
మంచి
సినిమాల్లో
కంటెంట్
ఉన్న
సైడ్
క్యారెక్టర్స్
లో
కూడా
నటించేందుకు
ఒప్పుకుంది.

షావుకారు జానకిగా షాలినీ..
షాలినీ పాండే ముఖ్యంగా మహానటి సినిమాలో సావిత్రి స్నేహితురాలిగా కనిపించిన విషయం తెలిసిందే. ఆ పాత్ర కూడా ఆమెకు మంచి గుర్తింపు లభించింది. కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా అలాంటి పాజిటివ్ రోల్స్ లో కూడా ఆమె చక్కగా నటిస్తుంది అని క్రేజ్ తెచ్చుకుంది. మహానటి తర్వాత మళ్లీ ఎన్టీఆర్ బయోపిక్ లో షావుకారు జానకిగా కనిపించింది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ 118 సినిమా లో ఆమె చేసిన పాత్ర కూడా బాగానే క్లిక్ అయింది.

అనుష్క సినిమాలో కీ రోల్..
కేవి గుహన్ దర్శకత్వం వహించిన 118 సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ కూడా షాలినీ పాండే నటిగా కొంతకాలం బిజిగానే కనిపించింది. అయితే శాలిని పాండేకు హీరోయిన్ గా అనుకున్నంత స్థాయిలో అవకాశాలు రావడం లేదు. చివరగా ఆమె తెలుగులో రాజ్ తరుణ్ తో ఇద్దరి లోకం ఒకటే అనే సినిమాలో నటించింది. అలాగే నిశ్శబ్దం సినిమాలో అనుష్కకు ఫ్రెండ్ గా కీలక పాత్రలో కనిపించింది. ఈ సినిమాల తర్వాత మళ్లీ ఆమె తెలుగులో కనిపించింది లేదు.

రణ్ వీర్ సింగ్ కు భార్యగా..
షాలినీ పాండే తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా హీరోయిన్ గా అలరించింది. తమిళంలో 100% లవ్ రీమేక్ లో హీరోయిన్ గా నటించి మరోసారి తన గ్లామర్ తో ఎంతగానో ఆకర్షించింది. హిందీలో యంగ్ హీరో రణ్ వీర్ సింగ్ సరసన జోడి కట్టింది ఈ ముద్దుగుమ్మ. జయేశ్ భాయ్ జోర్దార్ సినిమాలో ఒక గృహిణిగా అలరించింది షాలినీ పాండే. ఇందులో రణ్ వీర్ సింగ్ కు భార్యగా నటించి ఆకట్టుకుంది.

బికినీ అందాలతో రచ్చ..
రణ్ వీర్ సింగ్ తో షాలినీ పాండే జోడి కట్టిన ఈ జయేశ్ భాయ్ జోర్దార్ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. విభిన్నమైన కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఇదిలా ఉంటే షాలినీ పాండే తన గ్లామర్ అందాలతో మాత్రం సోషల్ మీడియా ద్వారా జనాలను అట్రాక్ట్ చేస్తూనే ఉంది. ముఖ్యంగా బికినీ అందాలతో కూడా ఆమె షాక్ ఇచ్చింది.

ట్రైనర్ కి షాక్ ఇచ్చిన ముద్దుగుమ్మ..
ఇక తాజాగా వర్కౌట్ చేస్తున్న కొన్ని వీడియోలు వదిలింది బ్యూటిఫుల్ ముద్దుగుమ్మ షాలినీ పాండే. ఈ వర్కౌట్ వీడియోలో షాలినీ పాండే సూపర్ హాట్ గా దర్శనమిచ్చింది. అయితే షాలినీ పాండే వర్కౌట్ చేస్తున్నప్పుడు తన ట్రైనర్ ఆమెను వీడియో తీసేందుకు ప్రయత్నించాడు. అలా చేస్తే ఆమె మరింతగా వర్కౌట్ చేస్తుందని అతను భావించాడని ఆ వీడియోలో రాసుకొచ్చింది షాలినీ పాండే. అయితే షాలినీ పాండే మాత్రం.. కెమెరా ఉంటే నేను వర్కౌట్ చేయను అని ఆపేసి ట్రైనర్ కి షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.