కోరిక తీరిందంటున్న షాలినీ పాండే.. ఆ విషయమై అందరిముందు ఓపెన్ అయిన హాట్ బ్యూటీ

అర్జున్ రెడ్డి భామ షాలినీ పాండే.. అంత ఈజీగా మర్చిపోయే పేరు కాదిది. తెలుగు ప్రేక్షకులకు కొత్త రకం ముద్దుల లోకం చూపించి మైమరిపించింది ఈ ముద్దుగుమ్మ. చిన్నతనం నుంచే హీరోయిన్ కావాలనే ఆశతో పెరిగిన షాలినీ పాండే 'అర్జున్ రెడ్డి' అనే తెలుగు మూవీతో సినీ గడప తొక్కింది. అయితే తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఆమె పెట్టిన ఓ పోస్ట్ నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. ఇంతకీ ఏంటా పోస్ట్? అందులో ఏముంది? వివరాల్లోకి పోతే..

అమ్మడికి ఛాన్సులే ఛాన్సులు అనుకున్నాం.. కానీ

అమ్మడికి ఛాన్సులే ఛాన్సులు అనుకున్నాం.. కానీ

షాలినీకి తొలి సినిమా 'అర్జున్ రెడ్డి' సూపర్ డూపర్ హిట్ ఇచ్చింది. దీంతో అమ్మడికి అవకాశాలు వెల్లువెత్తుతాయని ఉహించారంతా. కానీ అనుకున్న రేంజ్‌లో ఛాన్సెస్ పట్టలేక పోయింది. దీంతో ఈమె కెరీర్ ఇక ముగిసినట్లే అనుకున్న ఈ సమయంలో బడా స్టార్ హీరోతో నటించే బంపర్ ఆఫర్ పట్టేసింది ఈ బ్యూటీ.

ఆ హీరోతో రొమాన్స్ చేయడం చూసి..

ఆ హీరోతో రొమాన్స్ చేయడం చూసి..

అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండతో ఆమె పండించిన రొమాన్స్ చూసి టాలీవుడ్ సహా ఇతర భాషా దర్శకనిర్మాతల చూపు షాలినీపై పడింది. ఆ తర్వాత తెలుగులో ''మహానటి, ఎన్టీఆర్ బయోపిక్, 118'' లాంటి పలు సినిమాల్లో నటించినప్పటికీ అమ్మడికి ఆశించిన ఫలితం మాత్రం రాలేదు.

ఫోకస్‌ అంతా దానిమీదే.. చివరకు దక్కించుకుంది

ఫోకస్‌ అంతా దానిమీదే.. చివరకు దక్కించుకుంది

దీంతో తన ఫోకస్‌ అంతా బాలీవుడ్‌ మీదే పెట్టింది షాలినీ పాండే. అక్కడ ఓ సినిమా చేయాలన్న పట్టుదలతో చాలా ప్రయత్నాలు చేసి, చివరికి అక్కడ ఓ అవకాశం పొందగలిగింది. బాలీవుడ్ క్రేజీ స్టార్ రణ్‌వీర్‌ సింగ్‌కు జోడీగా ఆమె ఛాన్స్ పట్టేసింది. 'జయేశ్‌భాయ్ జోర్దార్' అనే పేరుతో రాబోతున్న కొత్త సినిమాలో షాలినీ పాండేని ఫైనల్ చేసేశారట.

 కోరిక తీరింది.. హద్దుల్లేని ఆనందం

కోరిక తీరింది.. హద్దుల్లేని ఆనందం

దీంతో షాలినీ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ తన కోరిక ఇన్ని రోజులకు తీరిందంటూ సోషల్‌ పోస్టు పెట్టింది. ఈ పోస్ట్ చూసిన ఆమె అభిమానులు.. కోరిక తీర్చుకోవడమే కాదు, బాలీవుడ్ హీరోలకు బెటర్ ఛాయిస్ నువ్వే కావాలంటూ రియాక్ట్ అవుతున్నారు.

Recommended Video

Alexander Movie Press Meet | Jaya Prakash Reddy | జయప్రకాష్ రెడ్డి హీరోగా 'అలెగ్జాండర్'
షాలినీ పాండే.. నిశ్శబ్దం

షాలినీ పాండే.. నిశ్శబ్దం

మరోవైపు హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నిశ్శబ్దం' సినిమాలో షాలినీ పాండే ముఖ్యపాత్ర పోషిస్తోంది. అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో రాబోతున్న ఈ సినిమాలో షాలినీ.. సోనాలి అనే పాత్రలో నటిస్తోంది. కోన ఫిలింఫ్యాక్టరీ- పీపుల్స్ మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X