బికినిలో అర్జున్ రెడ్డి భామ చిల్.. స్మిమ్మింగ్ పూల్‌లో తడిసిన అందాలతో ఘాటుగా!
అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోయిన్ గా నటించి, మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిన హీరోయిన్ శాలిని పాండే. అయితే ఈ బ్యూటీ ఇటీవల కాలంలో సోషల్ మీడియాకే పరిమితమైంది. అప్పుడప్పుడూ హాట్ ఫోటోలతో నెట్టింట రచ్చ చేస్తున్న శాలిని తాజాగా మరోసారి స్విమ్మింగ్ పూల్ లో బికినీతో చిల్ అవుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మరి ఇప్పటిదాకా ఆ ఫోటోలను చూడకపోతే ఇంకెందుకు ఆలస్యం ఓ లుక్కెయ్యండి.
శాలిని పాండే వన్ టైం వండర్ గా మారింది. అర్జున్ రెడ్డి మూవీ రిలీజ్ అయ్యి దాదాపు 8 ఏళ్లు కావస్తున్నప్పటికీ ఈ బ్యూటీకి చెప్పుకోదగ్గ హిట్ లేదు. అలాగని అవకాశాలు కూడా రావట్లేదు. బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది అంటూ నార్త్ లో అందాలు ఆరబోయడానికి రెడీ అయింది. అంతేకాకుండా నార్త్ మూవీ లవర్స్ కోసం అప్పటిదాకా బొద్దుగా ఉన్న ఈ బ్యూటీ సన్నజాజి తీగలా తయారైంది.

కానీ ఏం లాభం? అవకాశాలు మాత్రం కరువయ్యాయి. అటు నార్త్ లో పెద్దగా ఛాన్సులు లేవు, ఆమె నార్త్ కు వెళ్ళగానే ఇటు సౌత్ డైరెక్టర్స్ కూడా శాలినిని మర్చిపోయారు. కనీసం సౌత్ కు తిరిగి వద్దాం అనుకునేలోపు పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. కొత్త హీరోయిన్లు రావడం ఆమె స్థానాన్ని కబ్జా చేసుకోవడంతో శాలిని వైపు ఒక్కరు కూడా కన్నెత్తి చూడలేదు.
దీంతో అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అందాల విందు చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ వేసవి ఎండింగ్ లో బీచ్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోల్లో శాలిని పాండే సీ గ్రీన్ బ్రాలెట్ లో కనిపించి ఆకట్టుకుంది. అలాగే టైట్ ఫిట్ నల్లటి షేప్ వేర్ ధరించి ఫిట్ గా కనిపిస్తోంది. ఇక జుట్టు విపరీతంగా వీస్తున్న గాలిలో తేలుతుండగా, ప్రకాశవంతమైన చిరునవ్వుతో ఫోటోలకు ఫోజులిచ్చింది శాలిని.
ఆమె వెనకాల గమనిస్తే బీచ్ లో ఈ బ్యూటీ ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. దీంతో ఈ బ్యూటీని చూసిన అభిమానులు స్టన్నింగ్ బ్యూటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక 2017లో రిలీజ్ అయిన సూపర్ హిట్ మూవీ అర్జున్ రెడ్డిలో శాలిని పాండే తన యాక్టింగ్ తో ప్రేక్షకులను అట్రాక్ట్ చేసింది. సందీప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీనే హీరోయిన్ గా శాలిని పాండేకి మొదటి మూవీ. ఇందులో విజయ్ దేవరకొండతో కలిసి శాలిని స్క్రీన్ షేర్ చేసుకుంది.
అయితే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, హీరో విజయ్ దేవరకొండతో సహా అందులో నటించిన రాహుల్ రామకృష్ణ వంటి కమెడియన్స్ కూడా ప్రస్తుతం స్టార్స్ గా కొనసాగుతున్నారు. కానీ శాలిని కెరీర్ మాత్రం అక్కడే ఆగిపోయింది. తాజాగా శాలిని పాండే నటించిన మహారాజ్ అనే వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. సిద్ధార్థ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జునైత్ ఖాన్, జయదీప్ అహ్లావత్ తో కలిసి నటించింది శాలిని. జూన్ 21న ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. మరి ఇప్పటికైనా శాలినికి మంచి అవకాశాలు దక్కుతాయా అనేది చూడాలి.


Click it and Unblock the Notifications











