అతడు నన్ను దారుణంగా చీట్ చేశాడు... అర్జున్ రెడ్డి భామ సంచలన ఆరోపణలు

అర్జున్ రెడ్డి చిత్రంలో రొమాన్స్‌తోపాటు లిప్‌లాక్స్‌తో ఇరుగదీసిన యువ హీరోయిన్ షాలిని పాండే కెరీర్ గ్రాఫ్‌కు తిరుగే ఉండదని అనుకొన్నారు. కానీ ఆ సినిమా భారీ విజయం సాధించినా.. ఆ పిల్ల తెలుగు తెర మీద కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే తాజాగా మహరాజా అనే హిందీ సిరీస్‌లో హాట్ హాట్‌గా నటించి వార్తల్లోకి ఎక్కింది. అయితే ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో కొందరు చేసిన చీటింగ్‌ను బయటపెట్టింది. ఆమె చెప్పిన వివరాల్లోకి వెళితే..

తన తల్లిదండ్రులు నన్ను బాగా చదివించాలని ఆశపడ్డారు. కానీ నాకు సినిమాలంటే పిచ్చి. ఇంట్లో చెప్పకుండా పారిపోయి ముంబైకి చేరుకొన్నాను. చేతిలో డబ్బులు లేకపోవడంతో నేను అబ్బాయిలతో కలిసి రూమ్ షేర్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో చాలా ఇబ్బందులకు గురి అయ్యాను అని షాలిని పాండే చెప్పింది.

Shalini Pandey sensational comments on Manager s Cheating after Arjun Reddy

అర్జున్ రెడ్డి సినిమా హిట్ తర్వాత నాకు అదే తరహా పాత్రలు వచ్చాయి. కానీ నేను అలాంటి పాత్రలు చేసి రొటీన్ కావడం ఇష్టం లేక వదులుకొన్నాను. ఆ సినిమా తర్వాత నన్ను ట్రోల్ చేశారు. నా బాడీని టార్గెట్ చేసి సూటిపోటి మాటలతో వేధించారు. నాకు భాష అర్ధం కాకపోవడంతో పెద్ద ఇబ్బంది కలుగలేదు. కానీ వారి బిహేవియర్ ఇబ్బందిగా ఉండేది. అయినా నేను భరించాను అని అన్నారు.

అర్జున్ రెడ్డి సమయంలో నా మేనేజర్ నన్ను దారుణంగా చీట్ చేశారు. నాకు భాష రాదని చెప్పి నాతో చెప్పకూడని మాటలు, చేతలు చేయించే వారు. ఇండస్ట్రీకి కొత్త కావడంతో మరోమాట ఎదురు చెప్పలేక వారు చెప్పిన పనులు మొత్తం చేశాను అని షాలిని పాండే చెప్పారు.

ఇక తాజాగా అమీర్ ఖాన్ కుమారుడు హిందీ సినిమా రంగానికి పరిచయమైన మహరాజ్ వెబ్ సిరీస్‌లో షాలిని పాండే మెరిసింది. జునైద్ ఖాన్‌తో కలిసి ఆమె చేసిన రొమాంటిక్ సీన్లకు మంచి రెస్పాన్స్ వస్తున్నది. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్‌గా మారింది. అర్జున్ రెడ్డి తర్వాత నిశ్శబ్దం, మహనటి, ఇద్దరి లోకం ఒకటే లాంటి సినిమాల్లో నటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X