బట్టలు మార్చుకొంటుంటే గదిలోకి ఆ డైరెక్టర్.. టాలీవుడ్‌లో షాలిని పాండేకు చేదు అనుభవం
ఒక్క తెలుగు సినిమా లోనే అని కాకుండా దాదాపు ప్రతీ ఇండస్ట్రీలో కూడా హీరోయిన్స్ పట్ల పలు షాకింగ్ ఘటనలు జరుగుతూనే వస్తున్నాయి. ఇది ఎప్పుడు నుంచో కొనసాగుతుంది కానీ దీనికి ముగింపు మాత్రం రావడం లేదు. ఎవరైనా కొత్త హీరోయిన్స్ వస్తే వారికి కమిట్మెంట్లు అలాగే లైంగిక వేధింపులు అనేవి కామన్ గా మారిపోయాయి. కాగా వీటిపై కొందరు నోరు విప్పుతున్నారు కానీ ఇంకొందరు ఏమీ మాట్లాడరు.
అయితే ఇది అందరి హీరోయిన్స్ విషయంలో ఒకేలా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండకపోవచ్చు. చాలా మంది హీరోయిన్స్ తెలుగు సినిమాలో సహా సౌత్ లో కూడా కంఫర్టబుల్ గానే ఉన్నామని ఎలాంటి ఇబ్బంది లేకుండా సినిమాలు చేస్తున్నట్టుగా చెబుతారు. కానీ లేటెస్ట్ గా అర్జున్ రెడ్డి సినిమా సెన్సేషన్ బ్యూటీ షాలిని పాండే చేసిన కామెంట్స్ కాక రేపుతున్నాయి.

కాగా షాలిని పాండే తెలుగులో అర్జున్ రెడ్డి తర్వాత హీరోయిన్ గా అలానే పలు చిత్రాల్లో సహాయ నటిగా కూడా పలు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. కాగా మొదటి సినిమాకే షాలిని పాండే మొత్తం బోల్డ్ షో చూపించింది. కానీ తన రెండో సినిమాకే ఊహించని చేదు అనుభవాన్ని ఆమె అందుకున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది.
కాగా ఆమె తెలుగు సినిమా లోనే అని చెప్పలేదు కానీ సౌత్ లో మాత్రం తన రెండో సినిమాకే ఓ దర్శకుడు నుంచి షాకింగ్ ఇన్సిడెంట్ గా మారింది అని చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తాను సౌత్ లో రెండో సినిమా చేస్తున్న సమయంలో తన క్యారీ వ్యాన్ లో బట్టలు మార్చుకుంటున్నాను అని ఆ సమయంలో కనీసం తలుపు తట్టకుండా లోపలకి సడెన్ గా ఆ దర్శకుడు వచ్చేసాడు అని నేను అలా షాక్ లోనే ఉన్నాను అని ఆమె చెప్పుకొచ్చింది.
అంతే కాకుండా ఆమెకి ఆ సినిమా ఆఫర్ కావాలి అంటే చెప్పింది చేయాలంటూ మాట్లాడేవారని షాలిని చెప్పడం ఇపుడు సోషల్ మీడియాలో తన వీడియో క్లిప్ వైరల్ గా మారగా అసలు సౌత్ లో ఆమెని అంతలా ఇబ్బంది పెట్టిన దర్శకుడు ఎవరు అనేది మరింత హాట్ టాపిక్ గా మారింది. కాగా అర్జున్ రెడ్డి తర్వాత ఆమె తెలుగులో 118, మహానటి అలానే ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలు చేయడం జరిగింది.
అలాగే తమిళ్ లో 100 పర్సెంట్ కాదల్ కూడా అప్పుడే మొదలైంది. సో సౌత్ అంటే అన్ని భాషలు వస్తాయి కాబట్టి ఆమెకి ఈ ఘటన తెలుగు దర్శకులు నుంచి జరిగిందా తమిళ దర్శకుల నుంచి జరిగిందా అనేది చర్చనీయాంశంగా మారింది. కాగా వాటిలో ఏది షూటింగ్ ముందు మొదలైంది అనేది కూడా ఎవరికీ తెలీదు కానీ మన తెలుగు యువత మాత్రం ఆల్రెడీ సోషల్ మీడియాలో ఎవరి స్టోరీలు వారు స్టార్ట్ చేసుకున్నారు. ఇక షాలిని పాండే ప్రస్తుతం హిందీ సినిమాలోనే బిజీగా ఉండగా మళ్ళీ సౌత్ సినిమాల వైపు అయితే కనిపించడం లేదు.


Click it and Unblock the Notifications











