twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నన్ను కొట్టాడు.. లైంగిక దాడి కూడా.. ప్రైవేట్ పార్ట్ మీదే అలా.. కేబీఆర్ పార్క్ ఘటనలో నటి సంచలనం

    |

    కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో టాలీవుడ్ నటి చౌరాసియా మీద ఒక దుండగుడు దాడి చేసి ఆమె చేతిలో ఫోన్ లాక్కుని వెళ్లి పోయిన సంగతి తెలిసిందే. ఈ అంశం హైదరాబాదులో మాత్రమేగాక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. అత్యంత సంపన్నులు నివాసముండే జూబ్లీ హిల్స్ ఏరియాలో ఇలాంటి ఘటన జరగడం మీద పోలీసులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. తాజాగా ఈ విషయం మీద ఆమె స్పందించింది. ఆ వివరాల్లోకి వెళితే.

    గుర్తు తెలియని వ్యక్తి దాడి

    గుర్తు తెలియని వ్యక్తి దాడి

    రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ వద్ద నటి చౌరాసియాపై ఒక గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశారు. పార్క్ లో చౌరాసియా వాకింగ్ చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి ఆమె సెల్‌ఫోన్‌ను లాక్కుని వెళ్లారు. ఈ క్రమంలో ఆమెకు గాయాలు కూడా అయ్యాయి.

    ఆ తర్వాత చౌరాసియా 100కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అలెర్ట్ అయిన పోలీసులు ఈ కేసుని సీరియస్ గా తీసుకునీ డీల్ చేస్తున్నారు. ఇప్పటికే నిందితుడి వేలి ముద్రలు కనిపెట్టగా నిందితుడికి సంబందించిన డ్రెస్, షూస్ తో పాటు ఫోన్ లొకేషన్ ఆదారంగా ట్రేస్ చేయడానికి ట్రై చేస్తున్నారు.

    షాక్‌కు గురయ్యా

    షాక్‌కు గురయ్యా

    తాజగా ఈ ఘటనపై షాలు చౌరాసియా మీడియాతో మాట్లాడింది. రెండు రోజుల క్రితం కేబీఆర్‌ పార్కు సమీపంలో కారు పార్కు చేసి సాయంత్రం 6 గంటలకు వాకింగ్‌కు వెళ్లానని, మెయిన్‌ గేట్‌ వద్దకు వెళ్లి రాత్రి 8.15 గంటలకు తిరిగి వస్తుండగా వెనక నుంచి వచ్చిన ఆగంతుకుడు నోట్లో గుడ్డ కుక్కి కుడి వైపు ఉన్న పొదలవైపు లాగడంతో షాక్‌కు గురయ్యానని ఆమె తెలిపారు, దోపిడీ చేసి దాడికి పాల్పడిన దుండగుడు కాల్చి చంపేస్తానని బెదించగా నేను తెలుగులో మాట్లాడుతూ డబ్బులు ఇస్తానని చెప్పడంతో ఒక చేయి వదిలాడని అన్నారు.

    ముఖంపై దాడి

    ముఖంపై దాడి

    ఫోన్‌ పే చేస్తానని మైండ్ డైవర్ట్ చేసి డయల్‌ 100కు రెండుసార్లు ఫోన్‌ చేస్తే గమనించిన ఆ వ్యక్తి నా సెల్‌ఫోన్‌ను లాగేసుకున్నాడని పేర్కొంది. హెల్ప్‌ అంటూ అరుస్తుండగా చేతులు, ముఖంపై దాడి చేసాడు అని ఆమె వివరించారు. కింద బండ రాయి మీదకు తోసివేయడంతో నేను స్పృహ తప్పానని ఆమె వెల్లడించింది.

    స్పృహ రావడంతో

    స్పృహ రావడంతో

    పొదల్లోకి లాగి నాపై లైంగిక దాడికి యత్నించాడన్న ఆమె అలా చేయడంతో నాకు స్పృహ రావడంతో అతను బండరాయితో నా ముఖంపై కొట్టేందుకు ప్రయత్నించాడని పేర్కొంది. మోచేతితో అతని ప్రైవేట్‌ పార్ట్‌పై కొట్టి మెయిన్ రోడ్ వైపు ఉన్న ఫెన్సింగ్‌ వద్దకు వెళ్ళి ఫెన్సింగ్‌పై నుంచి కిందకు దూకి హెల్ప్‌ అని అరవడంతో దగ్గర్లో కాఫీ షాపులో పని చేసేవారు వచ్చారని తెలిపింది.

    22 నుంచి 25 ఏళ్ల వయసు

    22 నుంచి 25 ఏళ్ల వయసు

    అది గమనించి వాడు పారిపోయాడన్న ఆమె పోలీసులు కూడా వెంటనే వచ్చారని, నేను అతడిని చూస్తే గుర్తుపడతాననీ వెల్లడించింది. అతనికి 22 నుంచి 25 ఏళ్ల వయసు ఉంటుందని, రాబరీ కోసమే వచ్చినట్టు అనిపించిందని వెల్లడించారు దాడి తర్వాత అఘాయిత్యానికి ప్రయత్నించాడన్న ఆమె తనకు శత్రువులెవరూ లేరని, ఎవరిపై అనుమానం లేదని చెప్పింది.

    English summary
    Tollywood actress Shalu chourasiya reveals the attack on her.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X