Sreeleela: శ్రీలీల చేసిన పనికి షాకిచ్చిన హీరో... ఆ ఛాన్స్ కొట్టేసిన బేబమ్మ
టాలీవుడ్ సెన్సెషన్ యంగ్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పెళ్లి సందడి సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ.. ఆ తర్వాత ధమాకా సినిమాతో మరో హిట్టును అందుకుంది. ఇక అప్పటినుంచి ఈ బ్యూటీకి సినిమాల మీద సినిమా అవకాశాలు వస్తున్నాయి. అయితే శ్రీలీలకు ఓ టాలీవుడ్ హీరో దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ఇక షాక్ తో బేబమ్మకు కలిసి వచ్చింది. అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
యంగ్ హీరోయిన్ శ్రీలీల వరుస సినిమాలతో బిజి బిజిగా ఉంది. ఇక ఈ బ్యూటీ చేతిలో దాదాపు 10సినిమాలు ఉన్నాయి. అమెరికాలో పుట్టి... బెంగళూరులో పెరిగిన ఈ కన్నడ భామ... తెలుగులో పెళ్లి సందడి సినిమాతో పరిచయం అయింది. ఇక ఈ సినిమాలో ఆమె అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఆ తర్వాత ధమాకా సినిమాలో నటించి.. వాహ్ అనిపించింది. ఆసినిమాలో శ్రీలీల యాక్టింగ్, అందం, అభినయంతో పాటు డ్యాన్సులకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు.

ఇక శ్రీలీలకు తిరుగులేదు అనే రేంజులో సినిమా ఆఫర్లు వచ్చాయి. శ్రీలీల ఎంటర్ అయిన టైంలోనే హీరోయిన్ కృతిశెట్టి సైతం వచ్చింది. ఈ భామ కూడా రావడం రావడం ఉప్పెన సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకుంది. అంతే కాదు బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటింటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది.
నానితో శ్యాం సింఘరాయ్, నాగచైతన్యతో బంగార్రాజు సినిమాల్లో నటించి లక్కీ హీరోయిన్ అనే పేరు తెచ్చుకుంది. అయితే ఈ రెండు సినిమాల అనంతరం ఆమెకు ఏ సినిమా కలిసి రాలేదు. లక్కీ హీరోయిన్ కాస్త... ఐరెన్ హీరోయిన్ అనేలా ట్యాగ్ తెచ్చుకుంది. అయితే ఈ క్రమంలో శ్రీలీల మాత్రం దూసుకుపోతూ.. సినిమా అవకాశాలు సొంతం చేసుకుంది.

అయితే శ్రీలీల చేసింది రెండు సినిమాలే అయినా... రెమ్యూనరేషన్ మాత్రం ఆమాంతం పెంచేసింది. శ్రీలీలకు మొదట శర్వానంద్ 35 సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చిందట. అయితే రెమ్యూనరేషన్ దగ్గర తగ్గకపోవడంతో... శ్రీలీలను తీసేసి... కృతిశెట్టిని పెట్టుకున్నారట మేకర్స్. అలా శ్రీలీల చేసిన పనికి శర్వా షాక్ ఇచ్చాడు.
ఇటీవల కృతిశెట్టి బర్త్ డే సందర్భంగా శర్వా 35 సినిమా మేకర్స్ ఆమెకు బర్త్ డే విషెష్ చెబుతూ వీడియో రిలిజ్ చేశారు. ఇక ఈ సినిమాలో శర్వాతో శ్రీలీల నటించాల్సి ఉంది.. కానీ శ్రీలీల రెమ్యూనరేషన్ విభేదాల వల్ల... కృతిశెట్టి ఆ ఛాన్స్ కొట్టేసింది. ఇక కృతిశెట్టికి ఈ సినిమాతోనైనా హిట్టు పడాలని ఫ్యాన్స్ అంటున్నారు.


Click it and Unblock the Notifications











