పిల్లల కనడం కంటే కుక్కలు పెంచుకోవడం బెస్ట్ .. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

సినిమా ఇండస్ట్రీలోని కొంత మంది సెలబ్రెటీలు.. ప్రేమ, పెళ్లి, డేటింగ్ గురించి రకరకాలుగా మాట్లాడారు. ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రెటీలు పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉంటున్నారు. మరికొందరూ అయితే.. పెళ్లి చేసుకున్న సింగిల్ గా ఉండటమే బెటర్ అంటున్నారు మరి కొందరు. ఇలా తాజాగా ఓ హీరోయిన్ 'పిల్లలను కనడం కంటే కుక్కలను పెంచుకోవడం బెటర్'అంటూ చేసిన వ్యాఖ్య వైరల్ అవుతున్నాయి. అసలు ఆ హీరోయిన్ ఎవరు? ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేశారు? అనే చర్చ నెట్టింట జోరుగా సాగుతోంది.

ఆ హీరోయిన్ ఎవరో కాదు.. బాలీవుడ్ నటి షెఫాలీ షా (Shefali Shah). ఈ అమ్మడు తాజాగా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీశాయి. పెళ్లి, సంబంధాలు, పిల్లల పెంపకం వంటి వ్యక్తిగత, సున్నితమైన అంశాలపై ఆమె బహిరంగంగా తన అభిప్రాయాలను వ్యక్తపరచడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా బోల్డ్ అభిప్రాయాలతో, సహజ నటనతో గుర్తింపు పొందిన షెఫాలీ షా ఈసారి నేటి తరం జీవన విధానం, సంబంధాలపై మాట్లాడారు. చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవద్దని, ముందుగా తమను తాము అర్థం చేసుకోవాలని షెఫాలీ సూచించారు.

Shefali Shah Sparks Debate Don t Have Kids Raise Dogs Instead Viral Comments

"జీవితంలో పెళ్లి అనేది ఒక పెద్ద నిర్ణయం. మనకు మన గురించి, మన ఇష్టాలు, అభిరుచులు, లక్ష్యాల గురించి స్పష్టత లేకుండానే పెళ్లి చేసుకోవడం సరైన నిర్ణయం కాదు. ముందుగా జీవితాన్ని అనుభవించాలి, ప్రపంచాన్ని చూడాలి, మనుషులను అర్థం చేసుకోవాలి. ఆ తర్వాతే పెళ్లి గురించి ఆలోచించాలి. ఎందుకంటే పెళ్లి అనేది ఒక బాధ్యతతో కూడుకున్న వ్యవస్థ, దాన్ని కొనసాగించడం అంత సులభం కాదు" అని షెఫాలీ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు నేటి యువత ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయని పలువురు భావిస్తున్నారు.

ఇదే ఇంటర్వ్యూలో షెఫాలీ షా చేసిన ఒక కామెంట్ ఇప్పుడు పెద్ద వివాదానికి కారణమైంది. "పిల్లలను కనకండి... దాని బదులు కుక్కలను పెంచుకోవడం బెటర్" అని ఆమె చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె మాటల్లో, కుక్కలు మనుషులపై ఎలాంటి అంచనాలు లేకుండా నిస్వార్థంగా ప్రేమను పంచుతాయి. పిల్లలు పెరుగుతున్న కొద్దీ వారి ఆలోచనలు, అభిరుచులు మారుతాయి. ఒక దశలో తల్లిదండ్రులతో విభేదాలు రావడం సహజం. కానీ, కుక్కలు మాత్రం ఎప్పటికీ అదే విధమైన ప్రేమను, నమ్మకాన్ని చూపుతాయని ఆమె వివరించారు. ఈ వ్యాఖ్యను కొందరు సరదాగా తీసుకుంటే, మరికొందరు దీన్ని సీరియస్‌గా తీసుకుని చర్చ మొదలుపెట్టారు.

ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో రెండు వర్గాలుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఆమె మాటలను సమర్థిస్తూ, నేటి కాలంలో పిల్లలను పెంచడం అనేది ఆర్థికంగా, మానసికంగా చాలా పెద్ద బాధ్యతగా మారిందని అంటున్నారు. కెరీర్ ఒత్తిడి, జీవనశైలి మార్పులు, వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యం పెరగడం వల్ల చాలామంది పెళ్లి, పిల్లల విషయంలో జాగ్రత్తగా ఆలోచిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు.. కొందరు నెటిజన్స్ మాత్రం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కుటుంబ వ్యవస్థను బలహీనపరిచేలా ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయని, యువతను సంబంధాల నుంచి దూరం చేసే ప్రమాదం ఉందని అంటున్నారు.

Read more about: Shefali Jariwala bollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X