బాత్రూం వద్ద క్రికెటర్ల భార్యలు దారుణంగా.. డ్రగ్స్‌లో మునిగి తేలుతూ..ఐపీఎల్‌పై షెర్లీన్ చోప్రా బాంబు
బాలీవుడ్‌ను డ్రగ్స్ రాకెట్ అతలాకుతలం చేస్తుంటే సినీ శృంగార తార షెర్లీన్ చోప్రా మరో బాంబు పేల్చింది. ఐపీఎల్ క్రికెట్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్‌పై సంచలన ఆరోపణలు చేసింది. ఐపీఎల్ మ్యాచ్ అనంతరం తాను చూసిన విషయాలు అంటూ సోషల్ మీడియాలో సెన్సేషనల్‌గా పోస్టులు పెట్టారు. ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపిస్తున్న షెర్లీన్ చోప్రా క్రికెటర్ల భార్యల గురించి వివాదాస్పద కామెంట్లు చేయడం ఇప్పుడు మరింత చర్చకు దారి తీసింది. షెర్లీన్ చేసిన కామెంట్లు ఏమిటంటే...

ఐపీఎల్ మ్యాచ్ చూడటానికి వెళ్లినప్పుడు
ఓసారి ఐపీఎల్ చూడటానికి నేను కోల్‌కతాకు వెళ్లాను. ఆ మ్యాచ్ అనంతరం ఏర్పాటు చేసిన ఓ పార్టీకి ఆహ్వానిస్తే నేను వెళ్లాను. అక్కడ చూసిన వాతావారణం చూసి నేను షాక్ తిన్నాను. అక్కడ వారు తమ భార్యలతో కలిసి చేస్తున్న నిర్వాకం నాకు ఒళ్లు జలదరించేలా చేసింది అని షెర్లీన్ చోప్రా తెలిపారు.

క్రికెటర్ల భార్యలు బాత్రూం వద్దనే
క్రికెటర్లతో ఏర్పాటు చేసిన పార్టీలో నేను డ్యాన్స్ చేసి బాగా అలిసి పోయాను. అనంతరం నేను లేడీస్ బాత్రూంకు వెళ్లగా అక్కడ క్రికెటర్ల భార్యలు కొకైన్ తీసుకోవడం కనిపించింది. వాళ్లు నన్ను గమనించి చిన్న నవ్వి తమ పనిలో వారు మునిగిపోయారు అని షెర్లీన్ వెల్లడించారు.

రాంగ్ ప్లేస్‌లో ఉన్నాననే భావనతో బయటకు
క్రికెటర్లు తమ భార్యలతో బాత్రూంలో చేస్తున్న పని చేసిన తర్వాత ఇది నేను ఉండాల్సిన ప్రదేశం కాదు. రాంగ్ ప్లేస్‌లో ఉన్నానని బయటకు వచ్చాను. ఇంకా అప్పటికీ పార్టీ ఫుల్ స్వింగ్‌లోనే కొనసాగుతున్నది. ఒకదాని తర్వాత మరో డ్రగ్ పార్టీ జోరుగా సాగుతున్నది. ఒకవేళ పురుషుల బాత్రం వద్దకు వెళ్లి ఉంటే అలానే కనిపించి ఉండేదేమో అంటూ షెర్లీన్ పేర్కొన్నారు.

బాలీవుడ్‌లో డ్రగ్స్ రాకెట్ వివాదం నేపథ్యంలో
బాలీవుడ్ తారలు దీపిక పదుకోన్, సారా ఆలీ ఖాన్, శ్రద్దాకపూర్, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి అగ్రతారలకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సమన్లు జారీ చేసిన నేపథ్యంలో షెర్లీన్ చోప్రా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపేలా ఉన్నాయి. బాలీవుడ్‌లో డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో మరికొన్న పేర్లు తెరపైకి వచ్చే అవకాశం ఉన్న సమయంలో షెర్లీన్ చోప్రా వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకనొ్నాయి. ఐపీఎల్ టోర్నీ కొనసాగుతున్న సమయంలో ఇలాంటి ఆరోపణలు రావడం మరింత సంచలనంగా మారింది.


Click it and Unblock the Notifications











