Don't Miss!
- News AP Elections: ముగిసిన నామినేషన్ల పర్వం- జగన్, బాబు, పవన్ కు పోటీ ఇలా..!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్‌కు మళ్లీ అన్యాయమే!
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కింద నుంచి పై వరకు చూసి.. ఆ ప్రైవేట్ పార్టులు నిజమైనవేనా? అని టచ్ చేయబోయాడు
క్యాస్టింగ్ కౌచ్ అనేది ప్రతి ఇండస్ట్రీలో ఒక మహమ్మారిలా మారిపోయింది. ఇక సినిమా ఇండస్ట్రీలో రెగ్యులర్ గా వ్యాప్తి చెందే ఒక ప్రమాదకరమైన వైరస్ అని చాలా మంది హీరోయిన్స్ వారికి ఎదురైన చేదు అనుభవాలను బయటపెడుతున్నారు. ఇటీవల పాయల్ ఘోష్, ప్రముఖ దర్శకుడిపై చేసిన లైంగిక ఆరోపణలు ఏ స్థాయిలో వైరల్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే మరొక హాట్ హీరోయిన్ కూడా క్యాస్టింగ్ కౌచ్ కి సంబంధించిన ఒక విషయాన్ని బయటపెట్టింది.
పుట్టింది హైదరాబాద్ లోనే..
ఆ హాట్ బ్యూటీ మరెవరో కాదు. షెర్లిన్ చోప్రా. ఈ బ్యూటీ పుట్టింది హైదరాబాద్ లోనే అయినా బాలీవుడ్ సర్కిల్ లో ఎక్కువగా పాపులర్ అయ్యింది. సినిమాలతో క్లిక్కవ్వలేదు గాని ఎప్పటికప్పుడు తన బోల్డ్ ఫోటో షూట్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటోంది. తెలుగులో ఏ ఫిల్మ్ బై అరవింద్ సినిమా ద్వారా నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత బాలీవుడ్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది.
అక్కడ టచ్ చేయాలని చూశాడు
ఇటీవల ఈ బ్యూటీ గతంలో ఒక ఫేమస్ టాలెంట్ ఏజెన్సీ కో ఫౌండర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. అతను తన ప్రైవేట్ పార్ట్స్ ని టచ్ చేయాలని చూశాడని ఓపెన్ గానే వివరణ ఇచ్చింది. అవకాశాల కోసం తిరిగే అమ్మాయిలకు ఒక్కడో ఒక చోట తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదని గతంలో నేను కూడా అనేక రకాల లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు షెర్లిన్ వివరణ ఇచ్చింది.
ఒక రూమ్ లోకి తీసుకెళ్లి..
షెర్లిన్ మాట్లాడుతూ క్వాన్ టాలెంట్ అనే ఒక ఏజెన్సీలో సినిమా అవకాశాలు చాలా తొందరగా దొరుకుతాయని తెలిసి ఒక రోజు వారీ దగ్గరికి వెళ్ళాను. అయితే అక్కడ నన్ను డైరెక్ట్ గా క్వాన్ ఏజెన్సీ సహా భాగస్వామిని కలిశాడు. అతను నన్ను చూసిన విధానం చాలా అసభ్యంగా అనిపించింది. ఎవరు లేని ఒక రూమ్ లోకి తీసుకెళ్లి మొదట నన్ను కింద నుంచి పైకి తేడాగా చూశాడు.
ని వక్షోజాలు నిజమైనవేనా?
అలా చూడడంతో నేను డ్రెస్ లో ఏమైనా తేడా ఉందా అని అడిగాను. అందుకు అతను, ' ని వక్షోజాలు నిజమైనవేనా? నాకు ఎందుకో అనుమానం కలుగుతోంది. ఒకసారి టచ్ చేసి తెలుసుకోవచ్చా' అని అడిగాడు. అతని మాటలకు నేను షాక్ కి గురయ్యాను. చాలా కోపం వచ్చింది. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాను.
Recommended Video
వాళ్ళు అలానే ట్రీట్ చేస్తారు
అసలు అవి నిజమైతే ఏంటి? కాకపోతే ఏంటి? ఆ విషయంలో అతనికి ఎలాంటి సమస్య ఉందొ నాకు అర్థం కాలేదు. కానీ అతని చెడు బుద్ధి మాత్రం క్లియర్ గా అర్థమైంది. అడవాళ్ళతో అలా మాట్లాడకూడదు అనే కనీస జ్ఞానం కూడా తెలీదా అని అనుకున్నాను. ఇలాంటి వారు రెగ్యులర్ గా తగులుతూనే ఉంటారు. అవకాశాల కోసం ఎంతో ఆశగా వచ్చే వారిని ఇలానే ట్రీట్ చేస్తారు.. అని షెర్లిన్ వివరణ ఇచ్చింది.