Shilpa Shetty మెడకు చుట్టుకొంటున్న పోర్న్ కేసు.. ఆ వీడియోతో చిక్కుల్లోకి?

దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న పోర్న్ రాకెట్ కేసులో విచారిస్తున్న కొద్ది రాజ్ కుంద్రాకు సంబంధించిన విషయాలు సెన్సేషనల్‌గా మారుతున్నాయి. దీంతో సాధ్యమైనంత మేరకు పలు కోణాల్లో ఈ కేసును మరింత లోతుగా మహారాష్ట్ర ప్రాపర్టీ సెల్, క్రైమ్ బ్రాంచ్, సైబర్ సెల్ విభాగాలు దర్యాప్తు చేస్తున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ కేసు వివరాల్లోకి వెళితే..

 శిల్పాశెట్టి‌పై ఫోకస్

శిల్పాశెట్టి‌పై ఫోకస్

పోర్న్ రాకెట్ కేసులో ఇప్పటి వరకు రాజ్ కుంద్రా కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులు ప్రస్తుతం వారి దృష్టిని బాలీవుడ్ నటి శిల్పాశెట్టిపైకి ఫోకస్ చేశారు. నిన్నటి వరకు మహారాష్ట్ర సైబర్ సెల్ పోలీసులు శిల్పాశెట్టికి రాజ్ కుంద్రా కంపెనీలతో సంబంధం లేదని తేల్చారు. దాంతో ఆమెకు సమన్లు జారీ చేయమని కూడా స్పష్టం చేశారు.

జేఎల్ స్ట్రీమ్ కంపెనీ వ్యవహారాల్లో

జేఎల్ స్ట్రీమ్ కంపెనీ వ్యవహారాల్లో

పోర్న్ రాకెట్ కేసులో రోజు రోజుకు మారుతున్న పరిణామాల నేపథ్యంలో శిల్పాశెట్టిని కూడా విచారించే దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో జేఎల్ స్ట్రీమ్ అనే కంపెనీతో శిల్పాశెట్టికి ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం జుహులోని శిల్పాశెట్టి నివాసంలో సోదాలు జరపడం సెన్సేషనల్‌గా మారాయి.

ప్రమోషనల్ వీడియోతో చిక్కుల్లో

ప్రమోషనల్ వీడియోతో చిక్కుల్లో

అయితే జేఎల్ స్టీమ్‌ కంపెనీ వ్యవహారాల్లో శిల్పాశెట్టి గతంలో చురుకుగా వ్యవహరించారు. ఆ సంస్థకు సంబంధించిన వెబ్‌సైట్‌కు ప్రచారం చేశారు. ఓ ప్రమోషనల్ వీడియోతో భారీగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆ కంపెనీ అశ్లీల చిత్రాలు రూపొందించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇంకా ఆ కంపెనీ చురుకుగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నది. ఈ క్రమంలో శిల్పాశెట్టికి ఈ కంపెనీకి ఉన్న సంబంధాలు ఏమిటనే కోణంలో విచారణ చేయడానికి సిద్దమయ్యారు.

 శిల్పాశెట్టిని విచారిస్తారా?

శిల్పాశెట్టిని విచారిస్తారా?

అశ్లీల చిత్రాల నిర్మాణం కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత శిల్పాశెట్టి కనిపించకుండా పోయారు. మీడియాకు గానీ, సోషల్ మీడియా మాధ్యమాల్లో కనిపించలేదు. కానీ శుక్రవారం తన భర్త అరెస్ట్ గురించి భావోద్వేగంగా పోస్టు పెట్టారు. ఈ క్రమంలో శిల్పాశెట్టిని విచారించేందుకు సిద్దమవుతున్నారనే వార్త హాట్ టాపిక్‌గా మారింది.

Recommended Video

Shilpa Shetty Hosts A Grand Birthday Bash For Hubby Raj Kundra | Filmibeat Telugu
వరుసగా ఎదురు దెబ్బలు

వరుసగా ఎదురు దెబ్బలు

ఇలాంటి పరిస్థితుల్లో శిల్పాశెట్టికి వరుస దెబ్బలు తగులుతున్నాయి. సత్‌యుగ్ గోల్డ్ స్కీమ్‌ కేసులో బాంబే హైకోర్టు శిల్పాశెట్టి దంపతులకు జరిమానా విధించింది. రూ,18,57,870 చెల్లించినా తనకు బంగారం ఇవ్వలేదని సినీ హీరో సచిన్ జోషి ఆరోపిస్తూ తనను చీట్ చేశారని దాఖలు చేసిన కేసులో 1 కిలో బంగారం ఇవ్వాలని శిల్పాశెట్టి దంపతులకు సూచించింది. ఇలాంటి సంఘటనలో శిల్పాశెట్టికి అన్ని ప్రతికూల పరిస్థితులే ఎదురువుతున్నాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X