రొమాంటిక్ ఫోజుల్లో రెచ్చగొడుతున్న 50 ఏళ్ల హీరోయిన్ .. ఉల్లిపొర లాంటి చీరలో గ్లామర్ షో!
వయసు మీద పడుతున్నా ఇప్పటికీ చెక్కుచెదరని గ్లామర్‌తో అందంగా కనిపిస్తున్నారు కొందరు హీరోయిన్లు. రేఖ, హేమామాలిని, ఐశ్వర్యరాయ్, జయప్రద, దీప్తి భట్నాగర్, మాధురి దీక్షిత్, భాగ్యశ్రీ ఇలాంటి వారంతా నేటికీ అందంతో మెరిసిపోతున్నారు. ఈ కోవలోకే వస్తారు బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి. 50 ఏళ్లు దాటినా ఇప్పటికీ 25 ఏళ్ల అమ్మాయిలాగే కనిపిస్తారు. తాజాగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫోటోషూటో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
దర్శకేంద్రుడి చేతుల మీదుగా టాలీవుడ్‌లోకి
10వ తరగతి తర్వాత 16 ఏళ్ల చిరుప్రాయంలోనే మోడలింగ్‌లో దిగిన శిల్పాశెట్టి ఆ వెంటనే హీరోయిన్‌గా హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. 1993లో షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన బాజీగర్‌లో సెకండ్ హీరోయిన్‌గా నటించారు. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ఆమెను టాలీవుడ్‌కు పరిచయం చేశారు. విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన సాహసవీరుడు సాగరకన్య సినిమాతో తెలుగు వారిని పలకరించారు శిల్పా. తర్వాత వీడెవడండీ బాబూ, ఆజాద్, భలేవాడివిబాసూ తదితర తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించారు. మూడు దశాబ్ధాల కెరీర్‌లో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు.

శిల్పాశెట్టి ఫిగర్‌పై సెటైర్లు
అయితే ఈ స్టార్‌డమ్ ఆమెకు అంత తేలిగ్గా రాలేదు. మొదట్లో ఎన్నో అవమానాలు, ఛీత్కాలు ఎదుర్కొన్నారు శిల్పాశెట్టి. హిందీ భాషపై పట్టులేకపోవడంతో తన కెరీర్ కొద్ది సినిమాలతోనే ముగిసిపోతుందని భయపడ్డానని ఆమె పలు సందర్భాలలో తెలిపారు. బాగా సన్నగా ఉండటంతో దీనికి కారణంగా చూపి కొన్ని సినిమాలలోంచి తనను తప్పించిన ఘటనలు కూడా ఉన్నాయన్నారు. అయినప్పటికీ ఆత్మస్థైర్యంతో ఇంతదూరం వచ్చానని.. ఈ ధైర్యమే నన్ను నటిగా, భార్యగా, తల్లిగా నిలబెట్టిందని శిల్పాశెట్టి చెప్పారు.
కరాటేలో బ్లాక్‌బెల్ట్
శిల్పాశెట్టి చిన్నప్పుడే క్లాసకల్ డ్యాన్స్ నేర్చుకున్నారు. భరతనాట్యంలో పలు ప్రదర్శనలు కూడా ఇచ్చారు. అలాగే కరాటేలో బ్లాక్‌బెల్ట్ ఛాంపియన్ కూడా. వ్యాపారవేత్త రాజ్ కుంద్రాతో ప్రేమలో పడిన శిల్పాశెట్టి ఆయనను పెళ్లాడారు. ఈ దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు. అశ్లీల వీడియోల కేసులో రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేయడం బాలీవుడ్‌తో పాటు భారతీయ చిత్ర పరిశ్రమను కుదిపేసింది. ఈ పరిణామాలతో వీరిద్దరూ విడిపోతారని బీటౌన్ మీడియాలో గాసిప్స్ వైరల్ అయ్యాయి. కానీ శిల్పాశెట్టి మాత్రం రాజ్‌ను విడిచిపెట్టలేదు.
బిజినెస్‌లో గ్రాండ్ సక్సెస్
సినిమాల్లో నటిస్తూనే బ్రాండ్ అండార్స్‌మెంట్స్ ద్వారా కోట్లు సంపాదిస్తున్నారు శిల్పాశెట్టి. వీటితో పాటు పలు వ్యాపారాలలో పెట్టుబడులు మళ్లిస్తున్నారు. శిల్పాశెట్టి ముంబైలోని బాంద్రాలో బాస్టియన్ పేరుతో రెస్టారెంట్ ఉంది. 2019లో మొదలైన ఈ రెస్టారెంట్‌కు మంచి ఆదరణ లభించడంతో దేశంలోని కొన్ని నగరాలకు ఈ రెస్టారెంట్‌ను విస్తరించారు శిల్పాశెట్టి. ఈ ఒక్క రెస్టారెంట్ నుంచే ఈ ముదురు భామకు నెలకు 6 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తుందట. త్వరలో బెంగళూరు, పూణే, కోల్‌కతా నగరాల్లో ఈ రెస్టారెంట్‌ను తెరవాలని శిల్పాశెట్టి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట.
చీరలో అందాల ఆరబోత
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శిల్పా శెట్టి తన సినిమాలు, వ్యక్తిగత విషయాలతో పాటు జిమ్‌లో వర్కవుట్ చేయడంతో పాటు హాట్ హాట్ ఫోటోలు, వీడియోలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఉల్లిపొర లాంటి గ్రీన్‌కలర్ శారీ కట్టి అందాలను ఆరబోశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా అవికాస్తా వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











