10 కోట్లు ఇస్తా అన్నారు.. అయితేనేం అలాంటి పని మాత్రం చేయలేను: శిల్పాశెట్టి

బాలీవుడ్ సహా టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా సుపరిచితం హీరోయిన్ శిల్పాశెట్టి. బాలీవుడ్ లో బోలెడన్ని సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ప్రేక్షకులకు సాగరకన్యగా బాగా దగ్గరైంది. కొంతకాలంగా సినిమాలకు దూరమైనప్పటికీ ఫిట్‌నెస్ పరంగా ప్రత్యేక శ్రద్ద తీసుకుంటూ ఉంటుంది శిల్ప. నిత్యం వ్యాయామాలు చేస్తూ శరీరాకృతిని కాపాడుకునే ఈ 44 ఏళ్ల సుందరీమణి తాజాగా ఓ భారీ ఆఫర్ కాదనేసి వార్తల్లో నిలిచింది. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటి? శిల్ప ఎందుకు వదులుకుంది? వివరాల్లోకి పోతే..

ఫిట్‌నెస్ పరంగా శిల్పాశెట్టి.. భారీ ఆఫర్

ఫిట్‌నెస్ పరంగా శిల్పాశెట్టి.. భారీ ఆఫర్

ఫిట్‌నెస్ పరంగా శిల్పాశెట్టి చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది కాబట్టి ఇటీవలే తమ సమస్తకు ప్రచార కర్తగా ఉండాలని ఓ ఆయుర్వేద సంస్థ శిల్పాశెట్టిని సంప్రదించింది. తాము ఉత్పత్తి చేస్తున్న ‘స్లిమ్మింగ్ పిల్'‌ (బరువు తగ్గే మాత్రలు)కు ప్రచారకర్తగా ఉంటూ సదరు యాడ్ షూట్స్‌లో భాగం కావాలని, అందుకు గాను పది కోట్ల రూపాయలను ఇస్తామని ఆఫర్ చేశారు కంపెనీ యజమానులు.

అలాంటి పనులు నా వల్ల కాదంటూ

అలాంటి పనులు నా వల్ల కాదంటూ

బాడీ ఫిట్ గా ఉండాలంటే యోగా, వ్యాయాయం లాంటి వాటినే ఎక్కువగా నమ్మే శిల్పాశెట్టి సదరు ఆయుర్వేద కంపెనీ ఇచ్చిన ఆఫర్‌ని రిజెక్ట్ చేసింది. తనకు ఇలాంటి పిల్స్ పట్ల నమ్మకం ఉండదని, అలాంటపుడు ఇతరులకు ఆ మాటలు చెప్పడం నా వల్ల కాదంటూ ఆ ఆఫర్ సింపుల్‌గా రిజెక్ట్ చేసింది శిల్పా.

నేను నమ్మను.. ఇంకొకరితో చెప్పలేను

నేను నమ్మను.. ఇంకొకరితో చెప్పలేను

నిజ జీవితంలో సరైన ఆరోగ్య పద్ధతులు, సమయానికి ఆహారం తీసుకుంటే ఫిట్‌నెస్‌ దానంతట అదే వస్తుందని శిల్పా అంటోంది. ఒక మనిషి బరువు పెరిగినా సహజసిద్ధంగా ఆ బరువు తగ్గించుకుంటేనే అది ఆరోగ్యకరం అని చెప్పిన ఆమె.. ఇలాంటి మాత్రలను తాను నమ్మనని తెలిపింది. తనకు నమ్మకం లేని దాని గురించి తాను ప్రచారం చేయలేనని, అందుకోసం ఎంత సొమ్మిచ్చినా తనకు ఆ సొమ్ము అవసరం లేదని తేల్చి చెప్పింది శిలాశెట్టి.

వెండితెరపై శిలాశెట్టి రీ ఎంట్రీ

వెండితెరపై శిలాశెట్టి రీ ఎంట్రీ

దాదాపు 13 ఏళ్ల క్రిందట వెండితెరకు దూరమైనా శిలాశెట్టి.. తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను పెళ్లాడిన ఈమె తిరిగి ఇన్నాళ్లకు కెమెరా ముందుకు రాబోతోంది. షబ్బీర్‌ ఖాన్‌ తెరకెక్కిస్తున్న ‘నికమ్మ' సినిమాలో ఓ సరికొత్త పాత్రలో బాలీవుడ్‌ తెరపై కనిపించనుంది శిల్పా. తాను సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుండటం ఆనందంగా ఉందని అంటోంది ఈ ముద్దుగుమ్మ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X