For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Shilpa Shetty : తప్పు చేశా, అయినా పర్లేదు, అవి చేయకుండా జీవితం ఆసక్తి ఉండదంటూ సంచలనం!

  |

  అశ్లీల చిత్రాలను చిత్రీకరించి వాటిని కొన్ని ఆప్స్ ద్వారా అమ్ముతున్నారని ఆరోపణల మీద శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా కొద్ది రోజుల క్రితం అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో శిల్పాశెట్టికి కూడా ఏదైనా హస్తం ఉందేమో అనే అనుమానాలను పోలీసులు గతంలో వ్యక్తం చేశారు.. అనుమానం వ్యక్తం చేయడమే కాకుండా ఆమెను పలు దఫాలు విచారణ కూడా జరిపారు. అయితే ఈ వ్యవహారాలతో తనకు సంబంధం లేదని అప్పట్లో పేర్కొన్న శిల్పాశెట్టి తాజాగా తప్పు జరిగి పోయింది కానీ పర్వాలేదు అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టడం ఆసక్తికరంగా మారింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

  టెలివిజన్ లో బిజీ

  టెలివిజన్ లో బిజీ

  బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టికి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా పదుల సంఖ్యలో సినిమాలు చేసిన ఈ భామ వివాహం చేసుకున్నాక సినిమాలకు దూరం అయింది. ఇప్పుడు నెమ్మదిగా మళ్ళీ సినిమాలు చేస్తున్నా సరే మధ్యలో మాత్రం టెలివిజన్లో ప్రసారమయ్యే సూపర్ డాన్సర్ అనే ఒక ప్రోగ్రాం లో జడ్జిగా వ్యవహరిస్తూ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.

  ప్రేమించి మరీ

  ప్రేమించి మరీ

  నిజానికి రాజ్ కుంద్రా అనే లండన్కు చెందిన ఒక వ్యాపారవేత్తను ఆమెను ప్రేమించి మరీ రెండోసారి వివాహం చేసుకుంది. అయితే రాజ్ కుంద్రా పేరు ఎప్పటినుంచో అనేక వివాదాల్లో వినిపిస్తూనే ఉంటుంది. కానీ అనూహ్యంగా ఈ ఏడాది జూలై నెలలో రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాలు చిత్రీకరించి వాటిని కొన్ని యాప్స్ ద్వారా అమ్మిన కేసులో నిందితుడు అని తేల్చిన పోలీసులు ఆయనను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ప్రస్తుతానికి కూడా ఆయన జైలులోనే ఉన్నారు.

   కూలంకషంగా

  కూలంకషంగా

  భర్త అరెస్టు కావడంతో శిల్పాశెట్టి ఒకరకంగా కొంతకాలం పాటు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. ఆమె చానళ్ల పాటు బయట కూడా ఎక్కడా కనిపించలేదు. ఆమె జియో గురించి సూపర్ డాన్సర్ ఫోర్ కార్యక్రమానికి కూడా ఆమె కొన్ని వారాల పాటు దూరంగా ఉంది. ఎవరికి ఆగస్టు 2వ తేదీన ఆమె తన సోషల్ మీడియా వేదికగా తాను చెప్పాలనుకుంటున్న విషయాలు అన్నిటిని కూలంకషంగా వెల్లడించింది.

  తప్పులు చేయకుండా మనం ఆసక్తికరమైన జీవితాన్ని గడపలేము

  తప్పులు చేయకుండా మనం ఆసక్తికరమైన జీవితాన్ని గడపలేము

  అయితే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియా వేదికగా తప్పు జరిగిపోయింది అయితే తప్పు మంచిది అంటూ ఆమె కామెంట్ చేయడం పట్ల ఆసక్తి కరంగా మారింది. ఆమె ఒక పుస్తకంలోని ఒక పేజ్ ఫోటోను షేర్ చేశారు. అందులో అక్కడక్కడా కొన్ని తప్పులు చేయకుండా మనం ఆసక్తికరమైన జీవితాన్ని గడపలేము, అవి ప్రమాదకరమైన తప్పులు లేదా ఇతర వ్యక్తులను బాధించే తప్పులు కాదని మేము ఆశిస్తున్నామని కానీ తప్పులు ఉంటాయని పుస్తకంలో పేర్కొన్నారు.

  Shilpa Shetty's Home Raided By Mumbai Crime Branch | Filmibeat Telugu
  తప్పు చేశాను, బట్ ఇట్స్ ఓకే

  తప్పు చేశాను, బట్ ఇట్స్ ఓకే

  మన తప్పులను మనం మర్చిపోవాలనుకునేవిగా లేదా మన అత్యంత ఆసక్తికరమైన, సవాలుగా చూడవచ్చు. తాము చేసిన తప్పుల వల్ల కాదు, వాటి నుండి మనం నేర్చుకున్న దాని వల్ల అని కూడా పేర్కొని ఉంది. నేను తప్పులు చేయబోతున్నాను, నేను నన్ను క్షమిస్తాను, వారి నుండి నేర్చుకుంటాను అని కూడా పేర్కొని ఉంది. అంతే కాక తప్పు చేశాను, బట్ ఇట్స్ ఓకే అని కూడా ఆమె పేర్కొన్నారు.

  English summary
  Shilpa Shetty shared a new book excerpt on her Instagram story. The actress wrote that she has made mistakes and it's okay.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X