50 ఏళ్ల వయసులో శిల్పాశెట్టి అరాచకం.. మంచు లక్ష్మీ రియాక్షన్ వైరల్

కొందరు హీరోయిన్లను చూస్తే వారి వయసు పెరుగుతుందా? తగ్గుతుందా? అన్న అనుమానాలు కలుగుతాయి. తమతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన వారు వృద్ధాప్యంలోకి వెళ్లిపోగా.. వీరు మాత్రం పాతికేళ్ల పడచుపిల్లలా అందాల విందు చేస్తుంటారు. ఈ కోవలోకే వస్తారు బాలీవుడ్ అగ్రనటి శిల్పాశెట్టి. 50 ఆల్రెడీ క్రాస్ చేసినా ఇప్పటికీ చెక్కుచెదరని గ్లామర్‌తో మెరిసిపోతారు శిల్పాశెట్టి. తాజాగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

కర్ణాటకకు చెందిన శిల్పా శెట్టి.. 16 ఏళ్ల వయసులోనే మోడలింగ్‌లో దిగారు. ఆమె అందాన్ని చూసిన బాలీవుడ్ మేకర్స్.. హీరోయిన్‌గా ఛాన్స్ ఇవ్వంతో హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు ఈ ముద్దుగుమ్మ. 1993లో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన బాజీగర్‌లో సెకండ్ హీరోయిన్‌గా నటించారు. అనంతరం దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ఆమెను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన సాహసవీరుడు సాగరకన్య సినిమాలో తన అందాలతో అప్పటి తెలుగు కుర్రాళ్లని పిచ్చెక్కించారు శిల్పా. తర్వాత వీడెవడండీ బాబూ, ఆజాద్, భలేవాడివిబాసూ తదితర తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించారు. మూడు దశాబ్ధాలకు కెరీర్‌లో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు శిల్పాశెట్టి.

Shilpa Shetty Stuns in White Outfit at Mumbai Beach Viral Photos Win Hearts

నటన, మోడలింగ్ మాత్రమే కాదు.. శిల్పాశెట్టి బహుముఖ ప్రజ్ఞాశాలి. చిన్నప్పుడే భరతనాట్యం నేర్చుకుని పలు ప్రదర్శనలు కూడా ఇచ్చారు. అలాగే ఆ రోజుల్లో మగాళ్లకి మాత్రమే సాధ్యమైన కరాటేలో ఆమె బ్లాక్‌బెల్ట్ ఛాంపియన్ కూడా. వ్యాపారవేత్త రాజ్ కుంద్రాతో ప్రేమలో పడిన శిల్పాశెట్టి ఆయనను పెళ్లాడారు. ఈ దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు. సినిమాలతో పాటు వ్యాపారం, బ్రాండ్ అండార్స్‌మెంట్స్ ద్వారా ప్రతియేటా కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు శిల్పాశెట్టి. వీటితో పాటు తన సంపాదనను పెట్టుబడులుగా మళ్లిస్తున్నారు.

ఇక శిల్పాశెట్టి విజయవంతమైన వ్యాపారవేత్త కూడా.. ముంబై నగరంలోని బాంద్రాలో బాస్టియన్ పేరుతో ఆమెకు సొంతంగా రెస్టారెంట్ ఉంది. 2019లో మొదలైన ఈ రెస్టారెంట్‌కు బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు హైప్రొఫైల్ సర్కిల్స్‌కు చెందిన వారు రెగ్యులర్ కస్టమర్లు. ఈ ఒక్క రెస్టారెంట్ నుంచే శిల్పాశెట్టికి నెలకు 6 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తుందట. త్వరలో బెంగళూరు, పూణే, కోల్‌కతా సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ రెస్టారెంట్‌ను విస్తరించాలని శిల్పాశెట్టి ప్లాన్‌లో ఉన్నారు.

సినిమాలు, వ్యాపారాలలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ అందం, ఆరోగ్యానికి శిల్పా శెట్టి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. యోగా, వర్కవుట్స్, ధ్యానం, ఎయిరో బిక్స్ వంటివి చేస్తూ తన శరీరాన్ని నాజూకుగా ఉంచుకుంటున్నారు. 50 ఏళ్లు దాటినా, ఇద్దరు బిడ్డలకు తల్లయినా శిల్పాశెట్టి అందంలో ఏమాత్రం మార్పు రాలేదు. ఆరోగ్యానికి సంబంధించి కొన్ని టిప్స్‌ను ఎప్పటికప్పుడు అభిమానులతోనూ పంచుకుంటూ ఉంటారు శిల్పాశెట్టి.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శిల్పాశెట్టి.. ఎప్పటికప్పుడు తన సినిమాలు ఇతర వ్యక్తిగత వివరాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇక లేటు వయసులో హాట్ హాట్ ఫోటోలతో రెచ్చగొడుతుంటారు శిల్పాశెట్టి. తాజాగా ఆదివారం సండ్ మోడ్‌ అంటూ ముంబై బీచ్ వెంట వైట్ కలర్ డ్రెస్‌లో అందాలను ఆరబోసిన ఈ ముదురు భామ.. దానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆమె అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. టాలీవుడ్ నటి, మంచు లక్ష్మీ ప్రసన్న ఈ ఫోటోలను చూసి హాట్ ఎమోజీతో శిల్పాశెట్టికి కాంప్లిమెంట్ ఇచ్చారు.

Read more about: shilpa shetty
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X