10 కోట్ల ఆఫర్‌తో అలాంటి ఉచ్చులోకి స్టార్ హీరోయిన్.. ఆ తార ఎవరో తెలుసా?

జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీలు తమ ఉత్పత్తులను జనంలోకి తీసుకెళ్లడానికి భారీగా పబ్లిసిటీ చేపడతాయన్న సంగతి తెలిసిందే. టీవీలు, పేపర్లు వంటి సాంప్రదాయ ప్రచార సాధనాలతో పాటు సోషల్ మీడియాతో విస్త్రతంగా ప్రచారం కల్పిస్తున్నారు. సినీ, క్రీడా రంగాలకు చెందిన సెలబ్రెటీలను తమ ఉత్పత్తులకు ప్రచార కర్తలుగా నియమించుకుంటూ కోట్లలో పారితోషికంగా చెల్లిస్తున్నారు. కేవలం నిమిషం యాడ్‌లో కనిపించినందుకు కోట్ల రూపాయలు వస్తుండటంతో నటీనటులు వాణిజ్య ప్రకటనల్లో నటించేందుకు ఎగబడుతున్నారు.

యాడ్స్‌తో కోట్లు సంపాదిస్తున్న స్టార్స్
టాలీవుడ్ టూ బాలీవుడ్ ఎంతో మంది నటీనటులు ఎన్నో కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్స్‌గా వ్యవహరిస్తున్నారు. తమ రేంజ్‌ను బట్టి ఇందుకోసం పారితోషికం అందుకుంటున్నారు. అయితే డబ్బులు వస్తున్నాయి కదా అని ఏ యాడ్‌లో పడితే అందులో నటించేవారు కొందరైతే.. సమాజాన్ని, తమ వ్యక్తిత్వాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకునేవారు మరికొందరు. ఈ కోవలోకే వస్తారు బాలీవుడ్ సీనియర్ నటి శిల్పా శెట్టి. ఏకంగా రూ.10 కోట్లు ఆఫర్ ఇచ్చినా ఆమె ఓ వాణిజ్య ప్రకటనలో నటించేందుకు నో చెప్పారు. ఈ వివరాల్లోకి వెళితే..

Shilpa Shetty Turned Down 10 Crore Endorsement Deal Here s Why

బాజీగర్‌తో బాలీవుడ్‌లో ఎంట్రీ
భారతీయ చిత్ర పరిశ్రమకు ఎందరో నటీమణులు, అందగత్తెలను అందించిన కర్ణాటకలోని మంగళూరులో శిల్పాశెట్టి జన్మించారు. ఈమెలో ప్రొఫెషనల్ భరత నాట్యం కళాకారిణి, వాల్ బాల్ ప్లేయర్ ఉన్నారు. 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత కేవలం 16 ఏళ్ల వయసులోనే మోడలింగ్‌లో దిగిన శిల్పాశెట్టి.. లిమ్కా వాణిజ్య ప్రకటనలో నటించారు. 1993లో షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన బాజీగర్‌లో సెకండ్ హీరోయిన్‌గా నటించిన శిల్పాశెట్టి ఈ చిత్రం ద్వారా సినీరంగంలో అడుగుపెట్టారు. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ఆమెను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన సాహసవీరుడు సాగరకన్య సినిమాతో తెలుగు వారిని పలకరించారు శిల్పా. అనంతరం వీడెవడండీ బాబూ, ఆజాద్, భలేవాడివిబాసూ తదితర తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించారు.

అక్షయ్‌తో శిల్ప ప్రేమాయణం
మూడు దశాబ్ధాల కెరీర్‌లో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు. ఈమె కళ్లు, నవ్వుకు అప్పట్లో యువత పిచ్చెక్కిపోయేవారంటే అతిశయోక్తి కాదు. తొలుత అక్షయ్ కుమార్‌తో డేటింగ్ చేసిన శిల్పా శెట్టి ఆయనను పెళ్లాడాలని అనుకున్నారు. అయితే మరో హీరోయిన్ రవీనా టాండన్‌ వల్లే తాము విడిపోయామని ఆమె పలుమార్లు వ్యాఖ్యానించారు. ఈ దశలో వ్యాపారవేత్త రాజ్ కుంద్రాతో ప్రేమలో పడిన శిల్పాశెట్టి ఆయనను పెళ్లాడారు. ఈ దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు. అశ్లీల వీడియోల కేసులో రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేయడంతో వీరిద్దరూ విడిపోతారని గాసిప్స్ వైరల్ అయ్యాయి.

ఆ యాడ్ కోసం 10 కోట్లు ఆఫర్
కాగా.. కెరీర్ పీక్స్‌లో ఉన్న దశలో శిల్పాశెట్టి పలు వాణిజ్య ప్రకటనల్లో నటించారు. న్యూట్రెలా, మామాఎర్త్, జోఫా ఫుడ్స్, కేశ్ కింగ్ తదితర టాప్ కంపెనీలకు ప్రచాకర్తగా వ్యవహరించారు. ఇటీవల ఓ ఆయుర్వేద కంపెనీ తాము తయారు చేసిన మందును ప్రమోట్ చేయాల్సిందిగా శిల్పాను సంప్రదించారు. స్లిమ్‌గా అయ్యేందుకు సదరు కంపెనీ టాబ్లెట్స్‌ను తయారు చేసింది. ఇందుకోసం ఏకంగా రూ.10 కోట్లు ఆఫర్ చేసింది ఆ కంపెనీ. అయితే ఇలాంటి వాటిలో తాను నటించనని ఆమె తేల్చిచెప్పేశారు. స్లిమ్‌గా అవ్వాలని చాలా మంది యువత రకరకాల మందులను వాడి మోసపోతున్నారని... ఈ విషయం తెలిసి కూడా అలాంటి మందులను తాను ప్రమోట్ చేయలేనని శిల్పా శెట్టి తేల్చిచెప్పారు. వ్యాయామం, డైట్‌తోనే ప్రతి ఒక్కరూ నాజూగ్గా తయారవ్వొచ్చని శిల్పా అంటున్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. కోట్లు ఇస్తామన్నా సమాజం కోసం ఆలోచించడం గ్రేట్ అంటూ నెటిజన్లు శిల్పాశెట్టిన ప్రశంసిస్తున్నారు.

More from Filmibeat

Read more about: shilpa shetty bollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X