For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Raj Kundra Arrest తర్వాత శిల్పాశెట్టి తొలిసారి షాకింగ్ పోస్ట్.. సజీవంగానే అంటూ..!

  |

  ఇంటర్నేషనల్ పోర్న్ రాకెట్ కేసులో భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత బాలీవుడ్ నటి శిల్పాశెట్టి బాహ్య ప్రపంచానికి కనిపించకుండా పోయింది. ఓ దశలో దేశం విడిచి పారిపోతారనే కామెంట్లు, వార్తలు కూడా వినిపించాయి. అయితే తనపై వస్తున్న రూమర్లు, గాసిప్స్, ఊహాగానాలకు శిల్పాశెట్టి తెర దించింది. భర్త అరెస్ట్ తర్వాత తొలిసారి సోషల్ మీడియాలో పోస్టుతో స్పందిస్తూ...

  రాజ్ కుంద్రాతో కలిసి అందాలు ఆరబోసిన శిల్పా శెట్టి.. ఎక్కడా తగ్గలేదుగా!

  భయం, ఆవేశంతో అంటూ

  భయం, ఆవేశంతో అంటూ

  భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ నేపథ్యంలో శిల్పాశెట్టి భావోద్వేగంతో ఇన్స్‌టాగ్రామ్‌లో స్పందించారు. రచయిత జేమ్స్ థర్బర్ కొటేషన్‌ను ఉపయోగిస్తూ.. ఆవేశంలో గతాన్ని లేదా భయంతో భవిష్యత్‌ను చూసుకోవద్దు. కానీ నీ చుట్టూ ఉన్న పరిస్థితులపై అవగాహన కల్పించుకో అంటూ తనలోనే ఎమోషన్స్‌ను శిల్పాశెట్టి బయటపెట్టారు. లుకింగ్ ఎరౌండ్ అనే టైటిల్‌తో ఉన్న ఓ పుస్తకంలోని పేజీని స్క్రీన్ షాట్ తీసి ఇన్స్‌టాగ్రామ్‌లో పెట్టింది.

  Bigg Boss బ్యూటీ హిమజ హాట్ ఫోటోలు.. మీరెప్పుడూ చూడని గ్లామరస్ పిక్స్!

  ప్రాణాలకు ముప్పు కూడా అంటూ

  ప్రాణాలకు ముప్పు కూడా అంటూ

  ప్రతికూల పరిస్థితుల కారణంగా మనం కోపం, ఆవేశంలో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వారిని చూస్తే అనవసరపు ఆందోళనకు గురి అవుతాం. ఆ పరిస్థితుల వల్ల ఏర్పడే భయాందోళనల వల్ల మన విధి నిర్వాహణను కోల్పోయే ప్రమాదం ఉంది. లేదా వ్యాధుల బారిన పడటం, లేదా ప్రాణాలకు ముప్పు కూడా వాటిల్లే ప్రమాదం ఉంది అంటూ శిల్పాశెట్టి ఎమోషనల్‌గా స్పందించారు.

  పూర్తిస్థాయి అవగాహన అంటూ

  పూర్తిస్థాయి అవగాహన అంటూ

  ఇప్పుడు ఉన్న ప్రతికూల పరిస్థితుల మధ్య నా చుట్టు ఏం జరిగింది? జరుగుతున్నదనే విషయాన్ని పక్కన పెడితే.. ప్రస్తుతం మనం సరైన స్థితిలోకి వెళ్లాలి. అంతకంటే ముఖ్యంగా ఏం జరగబోతుందనే విషయంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించుకోవాలి అంటూ మరే పేరాను హైలెట్ చేస్తూ.. శిల్పాశెట్టి నర్మగర్భంగా ఏదో చెప్పి చెప్పకుండా ఉండటానికి ప్రయత్నించింది.

  Karthika Deepam కార్తీక్ చేయిపట్టి లాగిన మోనిత.. నీ పెళ్లి పెటాకులే.. దీప వార్నింగ్.. హాస్పిటల్‌లో హైడ్రామా

  ఇంకా సజీవంగానే అంటూ..

  ఇంకా సజీవంగానే అంటూ..


  శిల్పాశెట్టి తాను భావోద్వేగంతో కొట్టుమిట్టాడుతున్నట్టు చెప్పడానికి ప్రయత్నిస్తూ.. నేను ఇంకా సజీవంగా ఉన్నానని భావించడానికి దీర్ఘమైన శ్వాసను తీసుకొన్నాను. గతంలో ఎన్నో సవాళ్లను అధిగమించాను. భవిష్యత్‌లో కూడా సవాళ్లను అధిగమించి మనగడతో ఉంటాను. ఈ రోజు ఉన్న పరిస్థితులను చూసి కంగారు గానీ, ఆందోళన గానీ చెందను అనే విధంగా శిల్పాశెట్టి పోస్టు పెట్టారు.

  Shilpa Shetty Hosts A Grand Birthday Bash For Hubby Raj Kundra | Filmibeat Telugu
  25 లక్షల లంచం అంటూ

  25 లక్షల లంచం అంటూ

  ఇదిలా ఉండగా, రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి రాజ్ కుంద్రా ముంబై పోలీసులకు 25 లక్షల లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని తమకు నాలుగు ఈమెయిల్స్ వచ్చాయి అని మహారాష్ట్ర యాంటీ కరప్షన్ బ్యూరో ఓ విషయాన్ని బయటపెట్టింది. ఈ నేపథ్యంలో శిల్పాశెట్టి దంపతులపై ఇలాంటి ఆరోపణలు రావడం మరింత సంచలనంగా మారాయి

  English summary
  Bollywood actress Shilpa Shetty reacted and come with first post in instagram after Raj Kundra arrest in International Porn Rocket. She wrote Instagram that Let us not look back in anger, nor forward in fear, but around in awareness. And shared a quote by James Thurber.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X