twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మేకప్ రూమ్‌లో నాపై దారుణంగా.. చెప్పలేని విధంగా.. నిర్మాత బాగోతాన్ని బయటపెట్టిన టీవీ నటి

    |

    పాపులర్ టెలివిజన్ నటి శిల్పా షిండే మరోసారి నిర్మాత సంజయ్‌పై సంచలన ఆరోపణలు చేసింది. తనను లైంగికంగా వేధించి మానసికంగా క్షోభకు గురిచేశాడనే విషయాన్ని వెల్లడించింది. ఉత్తరాదితోపాటు దేశవ్యాప్తంగా టెలివిజన్ ప్రేక్షకులకు బాబీ జీ ఘర్ పర్ హై అనే టీవీ సీరియల్ ద్వారా శిల్పా షిండే సుపరిచితులు. ఈ సీరియల్ ద్వారా ఇంటింటికి, ప్రతీ గడపకు ఆమె చేరువయ్యారు. అలాంటి నటి లైంగిక వేధింపులు విషయాన్ని బయటకు చెప్పగానే సినీ, టెలివిజన్ ఇండస్ట్రీ షాక్ గురైంది. ఈ వివాదంలోకి వెళితే..

    దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమం

    దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమం

    2017లో దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతున్న నేపథ్యంలో నిర్మాత సంజయ్ కోహ్లి, సహ నిర్మాత బెనఫిర్ కోహ్లి తనను వేధించారనే విషయాన్ని బయటపెట్టింది. ఈ విషయాన్ని హిందూస్థాన్ టైమ్స్ పత్రికకు ఇంటర్వ్యూ ఇవ్వడంతో ద్వారా మళ్లీ చాలా రోజుల తర్వాత ఈ విషయాన్ని మీడియాలో ప్రస్తావించడంతో ఆ వివాదం మరోసారి రాజుకొన్నది.

    టీవీ ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు

    టీవీ ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు

    వినోద పరిశ్రమలో మహిళలపై వేధింపులను చాలా తేలిక తీసుకొంటారు. పురుషులు రకరకాల కామెంట్లు చేసి మానసికంగా వేధిస్తారు. ఏదైనా ఎదురు తిరిగి అడిగితే.. మేము జోక్ చేశాం. సరదాగా కామెంట్ చేశామని అంటారు. నిన్ను చూస్తే అంటూ ఓరగా మాటలు విసురుతారు. నీవు చాలా హాట్‌గా ఉన్నావు అంటూ వేధిస్తారు. నిర్మాత సంజయ్ కూడా ఇలాంటి మాటలనే నా వద్ద ప్రస్తావించే వారు అని శిల్పా షిండే తెలిపారు.

    నా మేకప్ రూమ్‌లోకి వచ్చి

    నా మేకప్ రూమ్‌లోకి వచ్చి

    సంజయ్ కోహ్లి లైంగిక వేధింపుల గురించి చెబుతూ ఒక రోజు మేకప్ రూమ్‌లోకి వచ్చాడు. నాకు అతి సమీపంగా వచ్చి ఫోటో తీసుకొందామని అన్నాడు. తన చేయి చెప్పలేని చోట వేసి తడిమాడు. దాంతో నాకు చాలా కోపం వచ్చింది. నీవు చేసే పని సరికాదని చెప్పాలని అనిపించింది. ఈ విషయాన్ని నా సహనటి సౌమ్య టాండన్‌తో పంచుకొన్నాను.

    ఇండస్ట్రీలో రేప్‌లు ఉండవు అంటూ

    ఇండస్ట్రీలో రేప్‌లు ఉండవు అంటూ

    అయితే సంజయ్ లైంగిక వేధింపులపై నా సహనటి సౌమ్య టాండన్ స్పందిస్తూ.. ఇండస్ట్రీలో రేప్‌లు లాంటివి ఉండవు అంటూ సమాధానం చెప్పింది. అయితే సంజయ్ చేష్టలు నాకు అసౌకర్యంగా ఉన్నాయని చెప్పాను. అయితే ఈ విషయాలన్నింటిని సహ నిర్మాత బెనఫిర్‌కు, సంజయ్ భార్యకు సౌమ్య చెప్పింది. దాంతో సీరియల్‌లో ఉండాలనుకొంటున్నావా? లేదా. ప్రేమగా మాట్లాడితే పెడదర్థాలు తీస్తున్నావా? అంటూ బెనఫిర్ నన్ను బెదిరించాడు. నీ కెరీర్ నాశనం చేయాలంటే మాకు రెండు నిమిషాలు చాలు అని హెచ్చరించారు.

    నాపై నిర్మాత ఎదురుదాడి చేస్తూ

    నాపై నిర్మాత ఎదురుదాడి చేస్తూ

    నిర్మాత సంజయ్ కోహ్లిపై ఫిర్యాదు తర్వాత ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే ఆ తర్వాత కూడా తనను వివాదంలోకి లాగేందుకు ప్రయత్నించారు. అప్పుడు ఈ లైంగిక వేధింపుల గురించి ఎందుకు మాట్లాడలేదు. ఆ సమయంలో ఎందుకు స్పందించలేదు. ఇప్పడే ఈ నాటకాలు ఎందుకు అని నాపై ఆరోపణలు, విమర్శలు చేశారు. నేను కేసు పెడితే క్షమాపణ చెబుతారని అనుకొన్నాను. కానీ నాపై ఎదురు దాడి చేయడం ప్రారంభించారు అని శిల్పా షిండే అన్నారు.

    నేను వదలను.. జైలులో పెట్టిస్తా అంటూ

    నేను వదలను.. జైలులో పెట్టిస్తా అంటూ

    అయితే సంజయ్ కోహ్లి లైంగిక వేధింపులతో నేను చాలా డిప్రెషన్‌లోకి వెళ్లాను. వైద్యులన సంప్రదించి ట్రీట్‌మెంట్ తీసుకొన్నాను. ఆ రోజు నుంచి నాకు మానసిక ప్రశాంతత లోపించింది. ఏదైనా మాట్లాడితే నా ఫోన్ కాల్స్ రికార్డు చేసేవారు. మహిళను ఇలా వేధిస్తారా అని బాధపడ్డాను. నా కెరీర్‌ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ విషయాన్ని ఇంతటితో వదలను. నేను కోర్టుకు వెళ్తాను. వాళ్లందరిని నేను జైలులో పెట్టిస్తాను అని శిల్ప షిండే అన్నారు.

    English summary
    Bhabi Ji Ghar Par Hai actress Shilpa Shinde alleges sexual harassment of Producer Sanjay Kohli. TV actress filed a complaint against the producer of Bhabhi Ji Ghar Par Hai of sexual harassment in 2017
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X