పరస్పర అంగీకారంతోనే అలా జరుగుతుంది.. మీటూ ఆరోపణలు కొట్టి పారేసిన బిగ్ బాస్ విజేత!

హీరోయిన్లు, హీరోలు అంతా ఏకమై బాలీవుడ్ మీటూ ఉద్యమానికి మద్దత్తు తెలుపుతున్నారు. కానీ బిగ్ బాస్ 11 విజేత శిల్ప షిండే మాత్రం విభిన్నంగా స్పందించింది. పలువురు నటీమణులు మీటూ పేరుతో చేస్తున్న ఆరోపణలని శిల్ప షిండే కొట్టిపారేసింది. సంఘటన జరిగిన వెంటనే స్పందిస్తే నిజానిజాలు బయట పడుతాయి.

ఎప్పుడో జరిగిన విషయాలని ఇప్పుడు ప్రస్తావించడం వివాదాలు రేపడం కోసమే అవుతుందని శిల్పా షిండే తెలిపింది. అయినా ఇండస్ట్రీలో ఇలాంటి సంఘటనలన్నీ పరస్పర అంగీకారంతోనే జరుగుతాయి. అనుమతి లేకుండా ఇండస్ట్రీలో ఎవరూ ఎవరిని ఏమీ చేయరని తెలిపింది. పరస్పర అవగాహన వల్ల ఇద్దరి మధ్య రిలేషన్ ఏర్పడుతుంది. దానికి అత్యాచారం అని పేరుపెట్టి రాద్ధాంతం చేయడం తగదు అని శిల్ప షిండే తెలిపింది.

Shilpa Shinde Calls MeToo Movement Rubbish

సినిమారంగం, టివి రంగం చెడ్డవి కావు. కొందరు కావాలనే పేరు చెడగొడుతున్నారని శిల్పా షిండే ఆగ్రహం వ్యక్తం చేసింది. తనుశ్రీ దత్త ఆరోపణలతో మొదలైన మీటూ ఉద్యమం ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. మీటూ ఉద్యమానికి ప్రముఖులంతా మద్దత్తు తెలుపుతుంటే.. శిల్పా షిండే స్పందన విభిన్నంగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X