మోటివేషన్ క్లాస్ తీసుకున్న నాజూకు శిల్పం... ఇన్స్టాలో చాంతాడంత పోస్టు....
సామాజిక మాధ్యమాల ద్వారా కమ్యునికేషన్ వ్యవస్థ మరింత సరళమైందన్న సంగతి తెలిసిందే. ఎందరికో జీవితాన్ని ఇచ్చిన ఈ మాధ్యమం ఇప్పుడు మానసిక ఒత్తిడిని ప్రేరేపించే వస్తువుగా మారింది. అయితే ఈ సమస్యని అధిగమించేందుకు తన వద్ద మంచి ఉపాయం ఉందంటోంది నాజూగు సుందరి శిల్పా శెట్టి.
సోషల్ మీడియాలో పోస్ట్ చేసేదంగా అబద్ధమేనని శిల్పా శెట్టి చెబుతోంది. తమ సమస్యలను కప్పిపుచ్చుకుంటూ అందరం అబద్ధపు జీవితాన్ని జీవిస్తున్నామంటూ ఘాటుగా తన ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టింది.

ఎవరి జీవితమూ సక్రమంగా లేదని చెబుతున్న శిల్పా, మనం మన సమస్యలను సోషల్ మీడియాకు ఎలా అయితే దూరంగా ఉంచుతున్నామో, ఇతరులు కూడా అంతే చేస్తారని గుర్తుపెట్టుకోవాలని వెల్లడించింది. మనం సామాజిక మాధ్యమాల్లో చూసేదంతా నిజం కాదని, కాబట్టి, వాటి వల్ల ఒత్తిడికి గురవ్వడంలో అర్ధంలేదని స్పష్టం చేసింది.
కానీ, సామాజిక మాధ్యమాల కాలంలో బతుకుతున్నాం కాబట్టి, అందరూ కలసిగట్టుగా మంచితనాన్ని, సానుకూల దృక్పధాన్ని ప్రోత్సహించాలని కోరింది. అందమైన ప్రపంచాన్ని నిర్మించే శక్తి మన అందరికీ ఉందని తెలిపింది. ఇటీవలే పలు నటీనటులు సామాజిక మాధ్యమాల ద్వారా బెదిరింపులు, దూషణలకు గురౌతున్న నేపథ్యంలో శిల్పా శెట్టి పోస్ట్ ప్రాధాన్యతను సంతరించుకుంది.


Click it and Unblock the Notifications











