లిప్‌లాక్‌లు, బోల్డ్ సీన్స్.. అందుకే మెగా హీరో మూవీ ఆఫర్ ను రిజెక్ట్ చేశా..
Shivani Rajasekhar: బాలీవుడ్ సీనియర్ నటులు జీవిత రాజశేఖర్ నటవారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది శివాని రాజశేఖర్. వరుస సినిమాలు చేస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే తన కెరీర్ ప్రారంభంలోనే ఓ సూపర్ హిట్ మూవీలో నటించే అవకాశం వచ్చిందని, కానీ ఆ సినిమాలో బోల్డ్ సీన్స్ లిప్ లాక్ లు ఎక్కువగా ఉన్నాయని, అందుకే ఈ సినిమాను రిజెక్ట్ చేశానని తెలిపింది. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఆ హీరో ఎవరు?ఓ లూక్కేయండి.
శివాని రాజశేఖర్ వదులుకున్న ఆ సినిమా ఏంటో కాదు.. టాలీవుడ్ లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా ఉప్పెన. ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అదొక విభిన్నమైన లవ్ స్టోరీ అండ్ యాక్షన్ మూవీ. ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్ అని చెప్పవచ్చు. ఈ సినిమా తో అటు హీరోకు హీరోయిన్ కు మాత్రమే కాదు.. ఇందులో నటించిన ప్రతి క్యారెక్టర్ కు టెక్నీషియన్ కు మంచి పాపులారిటి సొంతం చేసుకున్నారు.

అంచనా లేకుండా వచ్చిన ఉప్పెన సినిమా కానీ విని ఎరుగని రీతిలో సక్సెస్ అందుకుంది. 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. అది కూడా కరోనా సమయంలో థియేటర్లలో కాలు పెట్టడానికి భయపడుతున్న సమయంలో 100 కోట్ల మార్కును దాటిందంటే ఆ సినిమా ఇలాంటి హిట్ సాధించిందో అర్థం చేసుకోవచ్చు. విజయంతో ఉప్పెన సినిమా తో ప్రధానంగా దర్శకుడు బుచ్చి బాబు, హీరో వైష్ణవ్ తేజ్, అలాగే హీరోయిన్ కృతి శెట్టి ఓవర్ నైట్ స్టార్లుగా మారిపోయారు.
ఈ సినిమా సక్సెస్ తో డైరెక్టర్ బుచ్చి బాబుకు స్టార్ హీరోలతో డైరెక్షన్ చేసే అవకాశాన్ని అందుకున్నారు. ఇక హీరోయిన్ కృతి శెట్టి విషయానికి వస్తే ఈ అమ్మడుకు వరుసగా ఆరేడు సినిమాలలో నటించే అవకాశం వచ్చిందంటే.. ఎంత పాపులారిటి అందుకుందో అర్థం చేసుకోవచ్చు. అయితే.. ఇలాంటి హిట్ సినిమాను వదులుకుంది శివాని రాజశేఖర్. అవును ఈ సినిమాలో తొలుత హీరోయిన్ గా సెలెక్ట్ చేసింది శివాని రాజశేఖర్ నే. కానీ, ఈ అవకాశాన్ని తానే చేతులారా కోల్పోయిందట.

ఈ విషయాన్ని శివాని రాజశేఖర్ ఓ ఇంటర్వ్యూలో చెప్తూ బాధపడింది. ఆ ఇంటర్వ్యూలో శివాని రాజశేఖర్ మాట్లాడుతూ..'ఉప్పెన సినిమాలో హీరోయిన్ గా నటించమని మొదట ఆఫర్ నాకే వచ్చింది. మొదట్లో డ్రాఫ్ట్ స్టోరి పూర్తిగా వేరేలా ఉంది. సినిమా తెరకెక్కించిన విధానం వేరేలా ఉంది. నాకు చెప్పిన కథకు.. తెరకెక్కిన సినిమాకు చాలా మార్పులు ఉన్నాయి. నాకు చెప్పిన స్టోరీలో చాలా బోల్డ్ సీన్స్, లిప్ లాక్ సీన్స్, ఇమిటేట్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. దీంతో అవి చేసేందుకు నాకు ఇబ్బందిగా అనిపించింది ఒక రకంగా చెప్పాలంటే భయం వేసింది. దీంతో ఆ సినిమాను వదులుకున్నా..' అని శివానీ రాజశేఖర్ పేర్కొంది.
ఇప్పటికి కూడా ఆన్ స్క్రీన్ ఇమిటేడ్ సీన్స్ చేస్తావా? అని అడుగుతే తాను నో అని చెప్పేస్తానని శివాని పేర్కొంది. ఏది ఏమైనా హీరోయిన్ శివాని తన కెరీర్ లో ఓ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీని మిస్ అయిందని చెప్పాలి. ఒకవేళ ఈ సినిమాలో శివాని రాజశేఖర్ నటించి ఉంటే.. ఆమె కెరీర్ మరోలా ఉండేది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ అమ్మడు చిన్నచిన్న సినిమాలో నటిస్తున్నా.. ఇప్పటివరకు చెప్పుకోదగ్గ గుర్తింపు రాలేదని చెప్పాలి.


Click it and Unblock the Notifications











