శివాని రాజశేఖర్ అందాల ఆరబోత: తొలిసారి ఇంత హాట్‌గా కనిపించడంతో!
తెలుగు సినీ ఇండస్ట్రీలోని చాలా మంది స్టార్లు తమ కుమారులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా వచ్చిన వాళ్లలో ఎక్కువ మంది సక్సెస్ కాలేకపోయినా.. కొందరు మాత్రం స్టార్లుగా ఎదిగిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ ఇద్దరు కుమార్తెలను సినీ రంగానికి పరిచయం చేశారు జీవిత రాజశేఖర్ దంపతులు. వీళ్లిద్దరూ ఇప్పటికే హీరోయిన్లుగా పరిచయమై సత్తా చాటుతోన్నారు. అందులో శివాని రాజశేఖర్ వరుస సినిమాలతో సత్తా చాటుతోంది. తెలుగులోనే కాదు.. తమిళంలోనూ తెగ సందడి చేస్తోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా శివాని రాజశేఖర్ కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరూ చూసేయండి మరి!

మొదటి సినిమానే ఆగిపోయింది
జీవిత రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని.. అడివి శేష్ హీరోగా నటించిన '2 స్టేట్స్' ద్వారా సినీ రంగానికి పరిచయం కావాల్సి ఉంది. కానీ, ఈ సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత ఆగిపోయింది. ఈ చిత్రం ఎందుకు ఆగిపోయింది అన్న దానిపై ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి. మొత్తానికి టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాలనుకున్న శివాని ఆశలు అడియాశలు అయ్యాయి.

అద్భుతంతో హీరోయిన్‌గా ఎంట్రీ
మొదటి చిత్రమే ఆగిపోవడంతో శివాని కొంత గ్యాప్ తీసుకుంది. ఆ తర్వాత 'అద్భుతం' అనే సినిమా ద్వారా ఈ అమ్మడు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమాను మల్లిక్ రామ్ అనే దర్శకుడు తెరకెక్కించాడు. టైం లాప్స్ అనే కాన్సెప్టుతో ఇది రూపొందింది. నేరుగా హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయిన ఈ మూవీకి మంచి స్పందన దక్కింది.

తెలుగు, తమిళ సినిమాలు చేస్తూ
హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత శివాని రాజశేఖర్ వరుస సినిమాలతో సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే WWW అనే సినిమాలో తన నటనతో అందర్నీ ఆకట్టుకుంది. ఆ తర్వాత రాజశేఖర్ నటించిన 'శేఖర్'లోనూ కీలక పాత్ర చేసింది. అలాగే, 'అన్బరివు', 'నింజాక్ నీతి' అనే తమిళ సినిమాలు కూడా చేసింది. వీటిలో అద్భుతమైన నటనతో అలరించింది.

మిస్ ఇండియా.. తప్పుకుందిగా
శివాని రాజశేఖర్ ఈ ఏడాదికి గానూ మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనాల్సి ఉంది. కానీ, అదే రోజున ఈమె రాస్తున్న మెడికల్ థియరీ ఎక్సామ్ ఉన్నందున ఈ పోటీలో పాల్గొనలేకపోతున్నాను అంటూ ప్రకటించింది. అంతేకాదు, తన జీవితంలో ఫెమినా మిస్ ఇండియా కంటే .. ఒక డాక్టర్ కావడమే గొప్ప విషయం అని వెల్లడించింది. ఇలా ఈమె దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్
వరుసగా తెలుగు, తమిళంలో సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నప్పటికీ.. శివాని రాజశేఖర్ సోషల్ మీడియాలోనూ ఎంతో బిజీగా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. దీంతో ఈ అమ్మడు హైలైట్ అవుతోంది.

అందాల ఆరబోత తక్కువగానే
చాలా రోజులుగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న శివాత్మిక రాజశేఖర్.. పెద్దగా అందాలను ఆరబోయదు అన్న విషయం తెలిసిందే. తన సోదరి శివాత్మిక మాత్రం అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ తరచూ హైలైట్ అవుతోంది. కానీ, శివాని మాత్రం అలా కనిపించలేదు. దీంతో ఈమె పెద్దగా హైలైట్ కాలేదనే చెప్పుకోవాలి. అయినప్పటికీ తనదైన పోస్టులతో ఈ బ్యూటీ అలరిస్తోంది.

శివాత్మిక అదిరిపోయే హాట్ ట్రీట్
స్టార్ కిడ్ శివాని రాజశేఖర్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ను ధరించి క్లీవేజ్ షో చేసింది. అంతేకాదు, చీర కొంగును పక్కకు జరిపి మరీ హాట్ ఫోజులు ఇచ్చింది. ఫలితంగా వీటిని నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో ఇవన్నీ చాలా తక్కువ సమయంలోనే బాగా వైరల్ అయిపోతున్నాయి.


Click it and Unblock the Notifications











