స్లీవ్ లెస్ బ్లౌజ్ లో శివాని రాజశేఖర్ బోల్డ్ షో.. వెనక్కి తిరిగి అది చూపిస్తూ కొంటెగా!
టాలీవుడ్ లో బ్యూటిఫుల్ ముద్దుగుమ్మలకు ఏమాత్రం కొదవలేదు. కొందరు సోషల్ మీడియా ద్వారా క్రేజ్ సంపాదించుకుని హీరోయిన్లుగా ఎస్టాబ్లిష్ అవుతుంటే మరికొందరు సినీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇస్తున్నారు. అయితే స్టార్ హీరోలు, హీరోయిన్ల వారసులుగా సినిమాల్లోకి వచ్చిన తమదైన టాలెంట్ తో ప్రేక్షకుల్లో మంచి స్థానం సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.
అలాంటి వారిలో గ్లామరస్ బ్యూటి శివాని రాజశేఖర్ ఒకరు. తమిళ సినిమాలతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ సినిమాలే కాకుండా సోషల్ మీడియాలోనూ హాట్ ఫొటోలతో అదరగొడుతోంది. తాజాగా మరికొన్ని పిక్స్ షేర్ చేసి వైరల్ గా మారింది.

నటనపై ఇష్టంతో..
సినీ హీరో రాజశేఖర్ యాంగ్రీ మ్యాన్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయన సతీమణి జీవిత మహిళా దర్శకురాలిగా పేరు సంపాదించుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. వారిలో పెద్ద కుమార్తెనే శివాని రాజశేఖర్. ఇక సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఉండటంతో వారి వారసులు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారన్న విషయం తెలిసిందే. అలాగే నటనపై మక్కువతోనే శివాని రాజశేఖర్ కూడా చిత్రసీమలోకి అడుగుపెట్టింది.

డెబ్యూ చేద్దామనుకుంటే..
అయితే ముద్దుగుమ్మ శివానీ రాజశేఖర్ ముందుగా అడివి శేష్ హీరోగా నటించిన '2 స్టేట్స్' సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం కావాల్సి ఉంది. కానీ, ఈ సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత ఆగిపోయింది. అయితే ఈ చిత్రం ఎందుకు ఆగిపోయింది అన్న దానిపై పలు రకాల వార్తలు అయితే వైరల్ అయ్యాయి. మొత్తానికి టాలీవుడ్‌లోకి ముందుగా హీరోయిన్‌గా డెబ్యూ చేద్దామనుకున్న శివానికి కలిసి రాలేదు.

గ్యాప్ తర్వాత అలా..
కెరీర్ లో వేసిన మొదటి అడుగు అక్కడే ఆగిపోవడంతో బ్యూటిఫుల్ శివాని రాజశేఖర్ అదే సంవత్సరం తమిళంలో ఒక సినిమా చేసింది. 2018లో వీవీ స్టూడియోస్ బ్యానర్ లో వచ్చిన తమిళ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ముద్దుగుమ్మ శివానీ రాజశేఖర్. ఆ తర్వాత నటన పట్ల కొంత కాలం గ్యాప్ తీసుకుంది ఈ చిన్నది. ఇక 2021లో 'అద్భుతం' అనే సినిమా ద్వారా ఈ అమ్మడు తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో..
బాల నటుడిగా గుర్తింపు పొందిన తేజ సజ్జా హీరోగా నటించిన అద్భుతం సినిమాను మల్లిక్ రామ్ అనే దర్శకుడు తెరకెక్కించాడు. టైం లాప్స్ అనే కాన్సెప్టుతో రూపొందిందిన ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో అంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల చేశారు. అయితే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత శివాని రాజశేఖర్ వరుస సినిమాలతో సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే WWW అనే సినిమాలో తన నటనతో అందర్నీ ఆకట్టుకుంది.

ప్రమోషన్స్ లో జీవిత..
తండ్రి రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటించిన 'శేఖర్' సినిమాలోనూ కీలక పాత్ర చేసింది గ్లామరస్ బ్యూటి శివానీ రాజశేఖర్. ఇందులో రాజశేఖర్ కు కుమార్తేగా నటించింది. ఆ పాత్రలో తన రియల్ లైఫ్ కూతురుని తీసుకుంటే ఎఫెక్టివ్ గా ఉంటుందని మేకర్స్ భావించినట్లు ప్రమోషన్స్ లో ఆ మూవీ డైరెక్టర్ జీవిత చెప్పుకొచ్చారు. ఇక హీరోయిన్ గా సత్తా చాటుతున్న శివాని రాజశేఖర్ 'అన్బరివు', 'నింజాక్ నీతి' అనే తమిళ సినిమాలు కూడా చేసింది.

హాట్ పిక్స్.. వీడియోలతో..
తమిళ చిత్రాల్లో నటించిన శివాని రాజశేఖర్ తన యాక్టింగ్ తో ఆకట్టుకుంది. వరుసగా తెలుగు, తమిళంలో సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్న శివాని రాజశేఖర్ సోషల్ మీడియాలోనూ ఎంతో బిజీగా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో తన హాట్ ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది.

వెనక్కి తిరిగి చూపిస్తూ..
ముద్దుగుమ్మ శివాని రాజశేఖర్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె యెల్లో కలర్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తోపాటు అదే కలర్ చీర ధరించి సూపర్ హాట్ గా అందాలను చూపించింది. యెల్లో కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ లో వెనుకవైపుకు తిరిగి తన బ్యాక్ అందాలను చాలా రొమాంటిక్ గా ప్రదర్శించింది శివాని రాజశేఖర్. మత్తెక్కే పోజులతో కొంటెగా చూస్తూ తన బ్యాక్, నడుము అందాలతో అట్రాక్ట్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.


Click it and Unblock the Notifications











