ఎద అందాలతో శివాని రాజశేఖర్ అటాక్.. స్లీవ్‌లెస్ జాకెట్‌లో స్పైసీ షో
సినీ గ్లామర్ రంగుల ప్రపంచంలో సెలబ్రిటీల కొడుకులు, కూతుళ్లు ఎంట్రీ ఇవ్వడం సహజమే. తొలి సినిమాకు స్టార్ కిడ్స్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తమ టాలెంట్ తో సత్తా చాటుతుంటారు. అలాంటి హీరోయిన్లలో బ్యూటిఫుల్ శివాని రాజశేఖర్ ఒకరు.
యాంగ్రీ యంగ్ మ్యాన్ గా గుర్తింపు పొందిన రాజ శేఖర్ కుమార్తెగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటి అందం, అభినయంతో తెలుగు, తమిళం చిత్రాల్లో ఆకట్టుకుంటోంది. అలాగే సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు పెడుతూ అందాలను నెట్టింట్లో వడ్డిస్తోంది. తాజాగా శివాని షేర్ చేసిన ఫొటోలపై నెటిజన్లు మనసు పారేసుకుంటున్నారు.

ఆగిపోవడానికి: సినీ హీరో రాజశేఖర్, నటి, డైరెక్టర్ జీవితకు ఇద్దరు కూతుళ్లు. వారిలో పెద్ద కుమార్తె శివాని.. టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్ హీరోగా నటించిన '2 స్టేట్స్' సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం కావాల్సి ఉంది. కానీ, ఈ మూవీ షూటింగ్ పూర్తైన తర్వాత ఆగిపోయింది. అయితే ఈ చిత్రం ఎందుకు ఆగిపోయింది అన్న దానిపై ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి.

కొంత కాలం గ్యాప్: మొత్తానికి మొదటగా టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాలనుకున్న శివాని ఆశలు అడియాశలు అయ్యాయి. తన కెరీర్ లో తొలి చిత్రమే ఆగిపోవడంతో శివాని రాజశేఖర్ కొంత గ్యాప్ తీసుకుంది. ఆ తర్వాత 'అద్భుతం' అనే సినిమా ద్వారా ఈ అమ్మడు తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

డిజిటల్ వేదికపై: బాల నటుడిగా గుర్తింపు పొందిన తేజ సజ్జా హీరోగా నటించిన అద్భుతం సినిమాను మల్లిక్ రామ్ అనే దర్శకుడు తెరకెక్కించాడు. టైం లాప్స్ అనే కాన్సెప్టుతో ఇది రూపొందింది. అయితే ఈ చిత్రం నేరుగా ఓటీటీలో అంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైంది. డిజిటల్ వేదికపై స్ట్రీమింగ్ అయిన అద్భుతం సినిమా పర్వాలేదనిపించుకుంది.

రియల్ లైఫ్: హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత శివాని రాజశేఖర్ వరుస సినిమాలతో సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే WWW అనే సినిమాలో తన నటనతో అందర్నీ ఆకట్టుకుంది. అనంతరం రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటించిన 'శేఖర్' సినిమాలోనూ కీలక పాత్ర చేసింది. ఇందులో రాజశేఖర్ కు కుమార్తేగా నటించింది. ఆ పాత్రలో తన రియల్ లైఫ్ కూతురుని తీసుకుంటే ఎఫెక్టివ్ గా ఉంటుందని మేకర్స్ భావించారట.
సోషల్ మీడియాలో: హీరోయిన్ గా సత్తా చాటుతున్న శివాని రాజశేఖర్ 'అన్బరివు', 'నింజాక్ నీతి' అనే తమిళ సినిమాలు కూడా చేసింది. వీటిలో అద్భుతమైన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. వరుసగా తెలుగు, తమిళంలో సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నప్పటికీ.. శివాని రాజశేఖర్ సోషల్ మీడియాలోనూ ఎంతో బిజీగా ఉంటోంది.
మెరుస్తున్న సొగసు: శివాని రాజశేఖర్ తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో అందాలను ఆరబోసింది. యెల్లో కలర్ స్లీవ్ లెస్ జాకెట్ వేసుకుని శివాని రాజశేఖర్ సోఫాకు ఒరిగి ఎద అందాలను ఆకర్షణీయంగా చూపించింది. కొద్దిగా చీకటి ఉండి.. బంగారు వర్ణంలా మెరుస్తున్న డ్రెస్సులో తన సొగసును హాట్ ఎక్స్ ప్రెషన్స్ తో చూపించేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











