చుట్టూ వంద మంది మగాళ్లు.. వాష్ రూమ్ కూడా లేదు.. చేసేదేం లేక..: శివాత్మిక

Recommended Video

Shivathmika About Her Shooting Experience In Dorasani Movie || Filmibeat Telugu

తెలుగు యంగ్ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్, సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక కలిసి నటించిన చిత్రం 'దొరసాని'. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ కమర్షియల్‌గా సక్సెస్‌ కాలేకపోయింది. అయితే, ఇందులో హీరో, హీరోయిన్ల నటనకు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా ఇందులో శివాత్మక 'దొరసాని' పాత్రలో మెప్పించింది. ఈ నేపథ్యంలో ఆమె ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా పలు విషయాలను వెల్లడించింది.

 తొలి సినిమాతోనే గుర్తింపు

తొలి సినిమాతోనే గుర్తింపు

జీవిత, రాజశేఖర్ దంపతుల చిన్న కూతురిగా సినీ రంగ ప్రవేశం చేసినా.. తొలి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది శివాత్మిక. ‘దొరసాని'లో ఆమె కనబరిచిన నటన, వ్యక్తపరిచిన హావభావాలు ఆకట్టుకున్నాయి. అందుకే ఈమె నటనను సినీ ప్రముఖులతో పాటు చాలా మంది మెచ్చుకున్నారు.

కోట మీద షూటింగ్ అన్నారు

కోట మీద షూటింగ్ అన్నారు

ఆరోజు కోట పైన షూటింగ్ అన్నారు. అప్పుడు పైకి వెళ్తుంటే.. మేడమ్ మీరు రెస్ట్ రూమ్ యూజ్ చేయాలంటే చేసుకోండి. పైకి వెళ్లడానికి 20 నిమిషాలు పడుతుంది అన్నారు. ఎంత సేపు షూట్ చేస్తాము అని అడగగానే రాత్రి మొత్తం అని చెప్పారు. నేను డ్రెస్ మార్చుకోవాలన్నా.. రెస్ట్ రూమ్ యూజ్ చేసుకోవాలన్నా క్యారీ వ్యాన్ కింద ఉంది. కానీ, అప్పుడు షూట్ పూర్తి చేయాలన్న ఉద్దేశ్యంతోనే పైకి వెళ్లాను.

గుహ దగ్గర డ్రెస్ మార్చుకున్నా

గుహ దగ్గర డ్రెస్ మార్చుకున్నా

అప్పుడు నేను ట్రాక్ ప్యాంటు మీద పైకి వెళ్లాను. పైన ఒక గుహ లాగ ఉంది. అక్కడే నా డ్రెస్ మార్చుకోవడం.. మిగతావి చేశాను. అప్పటి వరకు ఒక్కదాన్నే ఉన్నాను. ఆ తర్వాత అక్క వచ్చింది. కాకపోతే, అప్పటికే ఈ టీమ్‌తో చాలా కంఫర్ట్‌గా ఉన్నాను. నాకు అందరూ బ్రదర్స్, ఫ్రెండ్స్‌లా ఉన్నారు. సో.. నాకేమీ ఇబ్బంది అనిపించలేదు.

 అక్క లేకపోతే అన్నం తినేదాన్ని కాదు

అక్క లేకపోతే అన్నం తినేదాన్ని కాదు

తన అక్క శివాని గురించి చెబుతూ.. ‘‘ఆరోజు అక్క వచ్చిన తర్వాత.. అన్నం తిన్నాను. ఆమె తీసుకొచ్చి పెట్టింది లేకపోతే తినేదాన్ని కూడా కాదు. మా అక్క గురించి అంతగా చెప్పుకోకూడదు. కానీ, ఆమె ఉంటే నాకెంతో ధైర్యంగా ఉంటుంది. డిన్నర్ తర్వాత చేసి కిందకు వెళ్లొచ్చాం. నైట్ అంతా కష్టమే కానీ, వీళ్లందరి వల్ల ఇబ్బంది అనిపించలేదు'' అని చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X