శివాత్మక రాజశేఖర్ షాకింగ్ స్టిల్: తొలిసారి ఈ రేంజ్‌లో అందాల ఆరబోత
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది స్టార్లు తమ వారసులుగా కుమారులను పరిచయం చేశారు. అయితే, అందులో చాలా తక్కువ మంది మాత్రమే తమ కూతుళ్లను పరిశ్రమలోకి తీసుకు వచ్చారు. అలా వచ్చిన వారిలో సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక ఒకరు. స్టార్ డాటర్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. మొదటి చిత్రంతోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. దీంతో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. దీంతో అప్పుడే కెరీర్ పరంగా ఫుల్ బిజీగా మారిపోయింది. అయినప్పటికీ శివాత్మిక సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు ఓ హాట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి!

దొరసానితో ఎంటరైన బ్యూటీ
జీవితా రాజశేఖర్ కుమార్తెగా శివాత్మిక రాజశేఖర్ 'దొరసాని' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంటరైంది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కేవీఆర్ మహేంద్ర రూపొందించారు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది. కానీ, ఇందులో శివాత్మిక కనబరిచిన నటన, వ్యక్తపరిచిన హావభావాలకు అదిరిపోయే స్పందన దక్కింది.

వరుస ఆఫర్లు.. భారీ ప్రాజెక్టు
హీరోయిన్‌గా అదిరిపోయే ఆరంభాన్ని సొంతం చేసుకోలేకపోయిన శివాత్మిక రాజశేఖర్‌కు.. సినిమా ఆఫర్లు మాత్రం భారీ స్థాయిలోనే వస్తున్నాయి. కానీ, ఆమె మాత్రం తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటినే ఒప్పుకుంటోంది. ఇందులో భాగంగానే రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో కృష్ణ వంశీ తెరకెక్కిస్తోన్న 'రంగమార్తండ'లో భాగమైంది. ఇందులో శివాత్మిక మంచి పాత్ర చేస్తోంది.

వాటిలోనూ నటిస్తున్న భామ
శివాత్మిక రాజశేఖర్ ప్రస్తుతం 'పంచతంత్రం' అనే సినిమాలో నటిస్తోంది. దీనితో పాటు తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతోన్న 'ఆకాశం' అనే సినిమాలోనూ నటిస్తోంది. వీటి షూటింగ్‌లు కూడా కంప్లీట్ అయ్యాయి. అలాగే, జీ 5లో ప్రసారం కానున్న 'అహ నా పెళ్లంట' అనే వెబ్ సిరీస్‌లోనూ కనిపించనుంది. రాజ్ తరుణ్ హీరోగా చేస్తున్న ఈ సిరీస్‌ను సంజీవ్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు.

పార్టీలతో రచ్చ.. గట్టి రిప్లైలు
శివాత్మిక రాజశేఖర్ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నప్పటికీ.. తన పర్సనల్ లైఫ్‌ను కూడా తెగ ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ పార్టీలు చేసుకుంటూ రచ్చ చేస్తోంది. వీటికి సంబంధించిన అప్‌డేట్లను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తోంది. అంతేకాదు, తనపై, తన ఫ్యామిలీపై వచ్చే రూమర్లకు గట్టిగానే రిప్లైలు ఇస్తోంది. ఇలా మొత్తానికి తరచూ వార్తల్లో నిలుస్తోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్
వరుస పెట్టి సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకు వెళ్తోన్న శివాత్మిక రాజశేఖర్ సోషల్ మీడియాలోనూ ఎంతో బిజీగా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. దీంతో తెగ హైలైట్ అయిపోతోంది.

అప్పుడప్పుడూ హాట్ ట్రీట్
హీరోయిన్‌గా పరిచయం కాకముందు నుంచే సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న శివాత్మిక రాజశేఖర్.. అప్పుడప్పుడూ అందాలను కూడా ఆరబోస్తూ ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ భామ తన లేలేత అందాలను చూపిస్తూ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఇందులో భాగంగానే హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఫలితంగా అందరి దృష్టిలో పడడంతో పాటు తరచూ ట్రెండ్ అవుతోంది.

శివాత్మిక అందాల జాతర
స్టార్ డాటర్ శివాత్మిక రాజశేఖర్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె స్లీవ్‌లెస్ అండ్ షార్ట్ డ్రెస్‌ను ధరించి క్లీవేజ్ షో చేసింది. అంతేకాదు, సోఫాలో కూర్చుని అదిరిపోయే హాట్ ఫోజులు ఇచ్చింది. ఫలితంగా ఆమె అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇది తక్కువ టైంలోనే వైరల్ అయింది.


Click it and Unblock the Notifications











